E-Paper
Advertisement

రూ.30వేలలోపే ల్యాప్‌టాప్..హెచ్‌పి 14q స్పెసిఫికేషన్స్ ఇవే!

రూ.30వేలలోపే ల్యాప్‌టాప్..హెచ్‌పి 14q స్పెసిఫికేషన్స్ ఇవే!
Advertisement

HP 14q laptop review: ప్రస్తుత రోజుల్లో.. ప్రతి ఒక్కరికీ ల్యాప్ టాప్ అవసరం చాలా పెరిగింది. స్టూడెంట్స్ ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా.. ఒక మంచి ల్యాప్ టాప్ ఉండాలి. అయితే అందరూ లక్షల రూపాయలు పెట్టి హై-ఎండ్ ల్యాప్ టాప్‌లు.. కొనలేరు. అలాంటి వారి కోసం ప్రముఖ కంపెనీ హెచ్‌పి  అందించిన బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ‘HP 14q-CS0005TU’. రూ.28,100 ధరలో.. లభిస్తున్న ఈ థిన్ అండ్ లైట్‌ వెయిట్ ల్యాప్ టాప్ అసలు ఎలా పని చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

HP 14q-CS0005TU ఫీచర్లు:

డిజైన్, లుక్:

ఈ ల్యాప్‌ టాప్ జెట్ బ్లాక్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని బరువు కేవలం 1.47 కేజీలు మాత్రమే.. ఉండటం దీనికి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్. బరువు తక్కువగా ఉండటం వల్ల.. దీన్ని కాలేజ్ బ్యాగ్‌లో లేదా ఆఫీస్ బ్రీఫ్‌ కేస్‌లో ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్లవచ్చు. 14 ఇంచుట డిస్‌ప్లేతో.. రావడం వల్ల సినిమాలు చూడటానికి, డాక్యుమెంట్లు చదవడానికి స్క్రీన్ సైజ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ ల్యాప్ టాప్‌లో ఇంటెల్ కోర్ i3 7వ జనరేషన్ ప్రాసెసర్‌ను వాడారు. దీనికి.. తోడు 4 జీబీ ర్యామ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. సాధారణ బ్రౌజింగ్ చేయడం, మైక్రో సాఫ్ట్ ఆఫీస్ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్)వాడటం, ట్యూబ్ వీడియోలు చూడటం వంటి రోజువారీ పనులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్‌కి, బేసిక్ ఆఫీస్ వర్క్స్ చేసే వారు దీనిని ఎలాంటి లాగ్ లేకుండా వాడొచ్చు.

Also Read: కేవలం చూడటానికే కాదు.. మీ స్మార్ట్ టీవీతో ఈ అద్భుతమైన పనులు కూడా చేయొచ్చు!

స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్ :

Advertisement

ఇందులో భారీగా 1 TB హెచ్‌డీడీ స్టోరేజ్ ఉంటుంది. దీని వల్ల మీ కాలేజ్ ప్రాజెక్ట్స్, వందలాది.. సినిమాలు, ఫోటోలు, పాటలు , ఇష్టమైన సాఫ్ట్‌ వేర్‌లను ఎలాంటి స్టోరేజ్ టెన్షన్ లేకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఇది ఒరిజినల్ విండోస్ 10 హోమ్ (Windows 10 Home) ఆపరేటింగ్ సిస్టమ్‌తో.. వస్తుంది. కాబట్టి లాప్ టాప్ ఆన్ చేయగానే నేరుగా వాడుకోవచ్చు.

బ్యాటరీ, కనెక్టివిటీ :

ఈ ల్యాప్‌ టాప్ బ్యాటరీ బ్యాకప్ కూడా  సాధారణ పనులకు సరి పోతుంది.ఇతర కనెక్టివిటీ ఆప్షన్స్ అయిన యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ పోర్ట్ , ఎస్‌డీ కార్డ్ రీడర్ వంటివి ఇందులో.. అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల పెన్ డ్రైవ్‌లు, ప్రొజెక్టర్లు లేదా ఇతర డివైజెస్‌ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

మీ బడ్జెట్ రూ.30 వేల లోపు ఉండి, రోజు వారీ స్టడీ లేదా బేసిక్ ఆఫీస్ పనుల కోసం ఒక నమ్మకమైన బ్రాండెడ్ ల్యాప్‌ టాప్ కావాలంటే.. హెచ్‌పి 14q బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.  గేమింగ్ లేదా హెవీ వీడియో ఎడిటింగ్ లాంటి  గ్రాఫిక్స్‌కు ఇది సరి పోకపోయినా, సాధారణ యూజర్లకు మాత్రం ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డివైజ్!

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×