E-Paper
Advertisement

వానాకాలం స్పెషల్.. ఈ సెట్టింగ్స్ మార్చకపోతే.. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నా దండగే!

వానాకాలం స్పెషల్.. ఈ సెట్టింగ్స్ మార్చకపోతే.. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నా దండగే!
Advertisement

Monsoon Air Purifier Tips: వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ ఇంట్లోని గాలి నాణ్యత మాత్రం క్రమంగా క్షీణిస్తుంది. గాలిలో తేమ పెరగడం దుర్వాసన రావడమే కాకుండా ఇళ్లల్లో వైరస్ లు, బ్యాక్టీరియాలు వేగంగా విస్తరిస్తాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్‌ను సరిగ్గా ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో వానాకాలంలో ఎయిర్ ప్యూరిఫైయర్‌లో తప్పనిసరిగా మార్చాల్సిన 3 కీలక సెట్టింగ్స్, దాని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

‘డిహ్యూమిడిఫైయర్’

వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ ఎయిర్ ప్యూరిఫైయర్‌లో డిహ్యూమిడిఫైయర్ ఆప్షన్ లేదా హ్యూమిడిటీ కంట్రోల్ మోడ్ ఉంటే దాన్ని తప్పకుండా ఆన్ చేయాలి. ఇది గాలిలోని తేమను గ్రహించి.. ఇంట్లోని వాతావరణాన్ని పొడిగా మారుస్తుంది. తద్వారా శ్వాసకోశ సమస్యలు, అలర్జీల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

‘ఆటో మోడ్’ లేదా ‘హై ఫ్యాన్ స్పీడ్’

Advertisement

భారీ వర్షాల వల్ల నీటి జల్లు ఇంట్లోకి రాకుండా చాలా మంది కిటికీలు, తలుపులు మూసి వేస్తుంటారు. దీనివల్ల ఇంట్లో గాలి ఆడక.. ఒక రకమైన వాసన మెుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ‘ఆటో మోడ్’లో ఉంచితే ఎక్కు ప్రయోజనం అని నిపుణులు అంటున్నారు. గాలిలో కాలుష్యంతో పాటు దుర్వాసన పెరిగినప్పుడు ప్యూరిఫైయర్ తనంతట తానే ఫ్యాన్ స్పీడ్‌ను పెంచుకుంటుందని పేర్కొంటున్నారు. ఒకవేళ తేమ వల్ల ఇంట్లో దుర్వాసన ఇంకాస్త ఎక్కువగా వస్తుంటే.. కొద్దిసేపు ఫ్యాన్ స్పీడ్ పెంచాలని సూచిస్తున్నారు. దీనివల్ల చెడు గాలి వెళ్లిపోయి.. రూమ్ అంతా ఫ్రెష్ ఎయిర్ తో నిండిపోతుందని వివరిస్తున్నారు.

Also Read: జియో యూజర్లకు పండగే.. ఒక్క రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. టీవీలో కూడా చూడొచ్చు!

‘పెట్ మోడ్’ లేదా ‘హెపా సైలెంట్ మోడ్’

Advertisement

వానకాలంలో పెంపుడు జంతువుల వెంట్రుకలు, మురికి వల్ల క్రిములు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెట్ మోడ్ లేదా ప్రత్యేకమైన హెపా ఫిల్టర్ సెట్టింగ్ ఉపయోగించడం ద్వారా గాలిలోని సూక్ష్మ క్రిములు, ఫంగల్ స్పోర్స్ తొలగించేందుకు వీలుంటుంది. రాత్రి సమయంలో నిద్రకు ఇబ్బంది కలుగకుండా ఎయిర్ ప్యూరిఫైయర్‌ లో సైలెంట్ మోడ్ ఎంచుకోవడం కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: హాట్‌స్టార్ బంపరాఫర్.. రూపాయికే ప్రీమియం సబ్ స్క్రిప్షన్.. ఓటీటీ లవర్స్‌కి పండగే!

Related News

అల్యూమినియం బాడీ, 60 గంటల బ్యాటరీ.. Nothing Headphone (1) Pro ప్రత్యేకతలు ఇవే!

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

Big Stories

Advertisement
×