Most Expensive Mobiles : మెుబైల్స్.. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ప్రతీ ఒక్కరి చేతిలో ఉండేవే. వీటి ధరలు సైతం అందరికీ అందుబాటులోనే ఉంటాయి. వేలల్లో మెుదలై లక్షల్లో ఉండే వీటిని ఎవరికి వాళ్లు తమ బడ్జెట్ లో కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ 6 మెుబైల్స్ రూటే వేరు. టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తీసుకొచ్చిన ఈ మెుబైల్స్ కొనాలంటే తక్కువలో తక్కువ లక్ష ఉండాల్సిందే. మరి ఆ మెుబైల్స్ ఏంటంటే..!
ఒప్పో, వన్ ప్లస్, సామ్ సాంగ్, వివో నుంచి ఈ ఏడాది టాప్ మొబైల్స్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీల నుంచి లాంఛ్ అయిన మొబైల్స్ అతి తక్కువ రేటు నుంచి లక్షల్లో ఉంటాయి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఐఫోన్ సైతం ఈ ఏడాదిలా తీసుకొచ్చిన 16 సిరీస్ లో ప్రతీ మొబైల్ రూ. లక్షకు చేరువలోనే ఉంది. అయితే ఈ టాప్ బ్రాండ్ తయారీ కంపెనీల నుంచి లాంఛ్ అయిన టాప్ రేట్ మొబైల్స్ పై ఓ లుక్ వేద్దాం. ఇక ఈ మెుబైల్స్ ఫీచర్స్ కు అనుగుణంగా ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఈ లిస్ట్ లో OPPO ఫైండ్ X8 ప్రో, Oneplus ఓపెన్, Samsung Galazy Z ఫోల్డ్4, Vivo X100 ప్రో, Samsung Galaxy S24, ఐఫోన్ 16 ప్రో ఉన్నాయి. ఇక వీటి ధరలతో పాటు ఫీచర్స్ కూడా చూసేయండి
OPPO Find X8 Pro – OPPO ఫైండ్ X8 ప్రో ధర రూ. 99,999. ఇక ఇందులో హై స్టోరేజ్ 16GB + 512GB మెబైల్ ధర ఇలా ఉంది. మీడియా టెక్ డైమన్సిటీ 9400 ఎస్ఓసీ ప్రాసెసర్, 6.78 అంగుళాల స్క్రీన్, 2K మైక్రో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 HZ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 5910mah బ్యాటరీతో వచ్చేసింది.
Oneplus Open – Oneplus ఓపెన్ మెుబైల్ లో 16GB RAM + 512GB స్టోరేజీ ధర రూ.99,999గా ఉంది. 2K రిజల్యూషన్‌తో 6.31-అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2800 nits గరిష్ట బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
Samsung Galaxy Z Fold4 5G – Samsung Galazy Z ఫోల్డ్4 మెుబైల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.88,590. ఈ మెుబైల్ ఫీచర్స్ సైతం అధునాతనంగా ఉన్నాయి. బెస్ట్ డిస్ ప్లే తో పాటు కెమెరా క్వాలిటీ, బ్యాటరీ సదుపాయం సైతం అదిరిపోయేలా ఉన్నాయి.
Vivo X100 Pro – Vivo X100 Pro మెుబైల్ ఒకే వేరియంట్ లో లాంఛ్ అయింది. ఇక 16GB+512GB స్టోరేజ్ ధర రూ.89,999. ఇందులో 2800 x 1260 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 6.78 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, OIS మద్దతుతో 50MP Sony IMX989 ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50MP టెలిఫోటో లెన్స్ సెటప్ ఈ మెుబైల్ లో ఉన్నాయి.
Samsung Galaxy S24 – Samsung Galaxy S24 5G మెుబైల్ 8GB + 256GB స్టోరేజ్ ధర రూ.67,999. ఈ మెుబైల్ Exynos 2400e చిప్‌సెట్ తో వచ్చేసింది. ఇక 25W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4565mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల పూర్తి HD + డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి.
iPhone 16 Pro – యాపిల్ లాంఛ్ చేసిన ఈ మెుబైల్ ధర రూ. 119900.ఇందులో 6.3 అంగుళాల స్క్రీన్, ప్రాసెసర్‌గా A18 ప్రో, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి.
ALSO READ : ఫోటో ప్రియుల కోసం ఎన్ని మెుబైల్సో! రూ.15వేలలోపు బెస్ట్ ఛాయిస్ ఇవే