BigTV English

Hero Siddharth on Pushpa Movie: పుష్ప సినిమాపై హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్

Hero Siddharth on Pushpa Movie: పుష్ప సినిమాపై హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్

Siddharth on Pushpa : పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు సిద్ధార్థ్. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సిద్ధార్థ ఆ తర్వాత శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి పేరును సిద్ధార్థ కు తీసుకొచ్చింది. ఈ సినిమా ఇప్పటికి చూసిన కూడా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బొమ్మరిల్లు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. రీసెంట్ గా కూడా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా చాలామంది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈ సినిమా పాటలను థియేటర్లో పాడుకుంటూ విపరీతంగా ఎంజాయ్ చేశారు.


ఈ సినిమా తర్వాత సిద్ధార్థ కెరియర్ లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. అలానే మధ్య మధ్యలో కొన్ని ప్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, లవ్ ఫెయిల్యూర్ వంటి సినిమాలు సినిమాలు కూడా బాగానే ఆడాయి. ఒక స్టేజ్ లో తెలుగు సినిమాలు చేయడం పూర్తిగా మానేశాడు సిద్ధార్థ్. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకుడుగా పరిచయమైన మహాసముద్రం సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత టక్కర్ అని ఒక డబ్బింగ్ సినిమాతో కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. తను నిర్మాతగా వ్యవహరిస్తూ చిన్నా అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాలేదు.

ఇక ప్రస్తుతం మిస్ యు అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు సిద్ధార్థ్. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా మీద టీమ్ అంతా కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా 29వ తారీఖున రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఆ తరువాత వారం రోజుల్లో పుష్ప సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది. దీని గురించి సిద్ధార్థ మాట్లాడుతూ నా సినిమా బాగుంటే థియేటర్ నుంచి ఎవరూ దాన్ని తీయలేరు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సినిమాలు గురించి తెలిసేది కాదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ఒక బాగున్న సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయలేరు. నా దృష్టిలో సినిమా అంతా ఒకటే, కొంతమంది బడ్జెట్ ను బట్టి దానిని పెద్ద సినిమా దీనిని చిన్న సినిమా అని నిర్ణయిస్తారు అంటూ తనదైన శైలిలో ఆన్సర్ చేశాడు సిద్ధార్థ్. అయితే సిద్ధార్థ చేసిన కామెంట్స్ ని కొందరు పొగుడుతుంటే మరి కొందరు మాత్రం సిద్ధార్థకి ఇంకా టెక్కు తగ్గలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.


Also Read : Sudigalisudheer GOAT : అభిప్రాయ బేధాలు కారణంగా సినిమా ఆగిపోయిందా.?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×