BigTV English

OnePlus 11R 5G : వన్‌ప్లస్ 11R నుంచి కొత్త వేరియంట్.. ఏప్రిల్ 18న లాంచ్!

OnePlus 11R 5G : వన్‌ప్లస్ 11R నుంచి కొత్త వేరియంట్.. ఏప్రిల్ 18న లాంచ్!

OnePlus 11R 5G : చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కంపెనీకి చెందినస్మార్ట్‌ఫోన్లకు దేశంలో భారీ డిమాండ్ ఉంది. వన్‌ప్లస్ ఫోన్లకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. ఈ కంపెనీకి చెందిన ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు చాలా మంది ఇష్టపడతారు. కానీ అధిక ధర కారణంగా వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపరు. OnePlus 11R 5G సోలార్ రెడ్ కలర్ వేరియంట్ గతేడాడి అక్టోబర్‌లో తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీ ఈ సోలార్ రెడ్ కలర్‌ని కొత్త ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లతో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.


Also Read : క్రేజీ డీల్.. సామ్‌సంగ్ ఫోన్‌పై రూ. 14 వేల డిస్కౌంట్!

ఇంతకుముందు కంపెనీ 18GB RAM+ 512GB స్టోరేజ్‌తో OnePlus 11R 5Gని లాంచ్ చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను 8GB RAM+ 128GB స్టోరేజ్‌తో ఏప్రిల్ 18న సేల్‌కు రానుంది. ఇప్పటికే అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌లో టీజర్ లాంచ్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చె కొనుగోలుపై కంపెనీ రూ.1250 తక్షణ తగ్గింపును ఇస్తుంది.


OnePlus 11R 5G
OnePlus 11R 5G

ఈ వన్‌ప్లస్ ఫోన్ 6.74 అంగుళాల ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఫోన్ బ్యాక్ 50MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Qualcomm Snapdragon 8+ Gen 1 SoC చిప్‌సెట్, 5,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Also Read : రియల్ మీ నుంచి కొత్త ఇయర్‌‌బడ్స్.. సౌండ్ దద్దరిల్లాల్సిందే!

వన్‌ప్లస్ 11R 5G సోలార్ రెడ్ 18GB RAM + 512GB వేరియంట్ ధర రూ.45, 999. ఇప్పుడు ఫోన్ యొక్క కొత్త వేరియంట్ ధర దీని కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. OnePlus కొత్త వేరియంట్ ఫోన్ 8GB LPDDR5 RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది. ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 SoC చిప్‌సెట్‌‌తో వస్తోంది. ఇది SuperVOOC S చిప్‌తో అమర్చబడి 100W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో  50MP IMX890 మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.

Tags

Related News

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×