Moto G 5G 2025 Mobiles : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటో త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేయబోతోంది. Moto G 5G (2025) పేరుతో రాబోతున్న ఈ మెుబైల్… Moto G పవర్ 5G (2024)తో పాటు ఈ ఏడాది మార్చిలో లాంఛ్ అయిన Moto G 5G (2024)కి సక్సెసర్‌గా లాంఛ్ అవుతుంది. కాగా ఈ మెుబైల్ ఫీచర్స్ తాజాగా లీక్ అయ్యాయి ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు డిస్ ప్లే, ప్రాసెసర్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం ఈ మెుబైల్ ఫీచర్స్ పై మీరు ఓ లుక్కేయండి.
ఎప్పటికప్పుడు కొత్త మెుబైల్స్ ను మార్కెట్లోకి లాంఛ్ చేస్తున్న ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ మోటో. తమ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఫీచర్స్ ను జోడిస్తూ మెుబైల్స్ ను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది Moto G 5G (2024), Moto G Power 5G (2024) ఫోన్స్ ను తీసుకొచ్చింది. ఈ మెుబైల్స్ ఈ ఏడాది మార్చిలో లాంఛ్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీటికి లేటెస్ట్ వెర్షన్ లో Moto G 5G (2025), Moto G Power 5G (2025) ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. కాగా ఈ మెుబైల్స్ వచ్చే ఏడాది మార్చిలో లాంఛ్ కాబోతున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేయగా.. తాజాగా ఈ రెండు మెుబైల్స్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. కాగా ఈ అధునాతన ఫీచర్స్ టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
Moto G 5G (2025) డిజైన్ – ఈ మెుబైల్స్ వాటి ప్రీవియస్ వెర్షన్స్ కు సరిపోలి ఉన్నాయి. ఇందులో ఫ్లాట్ డిస్ ప్లేతో పాటు ఎడ్జెస్ కూడా ఉన్నాయి. 3.5 హెడ్ ఫోన్ జాక్ తో పాటు స్పీకర్ గ్రిల్, బటన్స్ ఉన్నాయి. కెమెరాలో స్పల్పంగా మార్పులు జరిగినట్లు తెలుస్తుంది. రియర్ కెమెరా మ్యాడ్యుల్ కు ఎడిషనల్ సెన్సార్ ఏర్పాటు చేశారు. స్క్వేర్ షేప్ ట్రిపుల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ అందుబాటులో ఉండనున్నాయి.
ఈ Moto G 5G (2025) మెుబైల్ 6.6 అంగుళాల డిస్ ప్లేతో రాబోతుంది. ఇక డిస్ ప్లే 2024లో వచ్చిన మోడల్స్ తో సమానంగా ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 167.2 x 76.4 x 8.17 మిమీ (వెనుక కెమెరా బంప్‌తో సహా 9.6 మిమీ) మందం ఉండనుంది.
స్పెసిఫికేషన్స్ – ఇప్పటికైతే ఈ Moto G 5G (2025) స్పెషిఫికేషన్స్ తెలియనప్పటికీ.. 2024 వెర్షన్ కంటే లేటెస్ట్ ఫీచర్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుందని కొందరు అంచనా వేయగా.. అల్ట్రా వైడ్ లెన్స్ సైతం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఫోన్ ఫీచర్స్ –
6.6 అంగుళాల ఫుల్ FHD+ 120Hz డిస్ ప్లే
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 SoC చిప్ సెట్
18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ
Android 14 ఆపరేటింగ్ సిస్టమ్
50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
4GB RAM + 128GB స్టోరేజ్ – 1 టీబీ వరకూ స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం
ALSO READ : వైర్ లెస్ ఛార్జర్స్ తో సేఫ్టీ ఎంత? ఫోన్ బ్యాటరీ డ్యామేజ్ అవుతుందా?