Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే చివరి దశకు చేరుకోనుంది. అందుకే ఇప్పటినుండి నామినేషన్స్ అనేవి మరింత కీలకంగా మారనున్నాయి. కరెక్ట్‌గా ఆలోచించి నామినేట్ చేయకపోతే ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కంటెస్టెంట్స్ అనుకుంటారో వారే ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక తాజాగా టాప్ 9 కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్స్ మొదలయ్యాయి. ఈవారం నామినేషన్స్‌లో మరింత హీట్ పెంచేసే సంభాషణలు జరగనున్నాయని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. అంతే కాకుండా ఈసారి పాత కంటెస్టెంట్స్ అందరికీ గౌతమే టార్గెట్ అయ్యాడు అనేది కూడా గత కొన్ని ఎపిసోడ్స్‌లోనే క్లారిటీ వచ్చింది. అందుకే వారంతా గౌతమ్‌నే నామినేట్ చేయడానికి సిద్ధపడ్డారు.
దమ్ము లేదు
ముందుగా టేస్టీ తేజ వచ్చి పృథ్విని నామినేట్ చేయడంతో బిగ్ బాస్ 8 ప్రోమో మొదలవుతుంది. ‘‘నిన్న కంప్లైంట్స్ రాయమన్నప్పుడు నీకెందుకు అలా అనిపించిందో నాకు తెలుసుకోవాలని ఉంది. దానికి క్లారిటీ ఇస్తే చాలు’’ అన్నాడు టేస్టీ తేజ. దానికి సీరియస్‌గా రియాక్ట్ అవ్వకుండా చెప్పను అంటూ కామెడీ మొదలుపెట్టాడు పృథ్వి. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో పృథ్వి చాలా సీరియస్‌గా రియాక్ట్ అవ్వాలి, గొడవ పెట్టుకోవాలి. కానీ అలా జరగలేదు. దీంతో చెప్పను ఏంటయ్యా అంటూ టేస్టీ తేజ సీరియస్ అయ్యాడు. ‘‘నీకు దమ్ము లేదు, నాకు దమ్ము లేదు’’ అంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు పృథ్వి. ‘‘నాకు దమ్ముంది. అందుకే నామినేట్ చేసి చెప్పాను’’ అని అరిచాడు తేజ.
Also Read: నామినేషన్స్ రచ్చ.. అవినాష్ దెబ్బకి కన్నడ బ్యాచ్ విలవిల.!
విన్నర్ అవ్వనివ్వవు
ఆ తర్వాత వచ్చిన ప్రేరణ.. విష్ణుప్రియాను నామినేట్ చేసింది. ‘‘ఈ హౌస్‌లో నేను విన్నర్ అవ్వకూడదు అని చూస్తున్న వ్యక్తి నువ్వే’’ అంటూ తనపై పెద్ద ఆరోపణే వేసింది. ‘‘ప్రతీ ఒక్కరు గెలవాలి అనే అనుకుంటారు. కానీ ఆ కసి నీలో నాకు అంతగా కనిపించలేదు’’ అంటూ మరో కారణాన్ని చెప్పింది. ‘‘ఆ ఆలోచన లేకపోతే నేను ఇక్కడివరకు వచ్చేదాన్ని కాదు’’ అంటూ కూల్‌గా సమాధానమిచ్చింది విష్ణుప్రియా. తనతో పాటు గౌతమ్‌ను కూడా నామినేట్ చేసింది ప్రేరణ. తను కారణాలు చెప్తున్నప్పుడు గౌతమ్ జోక్యం చేసుకున్నాడని సీరియస్ అయ్యింది. ‘‘నేను మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ ఉండు’’ అంటూ సీరియస్ అయ్యింది ప్రేరణ.
తలవంచి మాట్లాడాలా
‘‘నువ్వు చెప్తున్నప్పుడు ఓకే మేడం అంటూ తలవంచి దండం పెట్టాలా? అలాంటి పరిస్థితిలో ఉండాలా?’’ అంటూ ప్రేరణ అన్నమాటకు సీరియస్ అయ్యాడు గౌతమ్. ‘‘నేను పాయింట్‌లాగా నామినేట్ చేయాలని చెప్పడానికి నువ్వు ఎవరు? నేను పారాగ్రాఫ్ లాగా నామినేట్ చేస్తాను’’ అని ప్రేరణ అరవడం మొదలుపెట్టింది. దానికి గౌతమ్ కూడా తిరిగి అరవడంతో అరవకు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అప్పుడే ఒకానొక సందర్భంగా ప్రేరణను బేబి అనేశాడు గౌతమ్. నీకు బేబి ఎవరు అంటూ సీరియస్ అయ్యింది ప్రేరణ. ‘‘బేబి అనేది ఒక పదం. బాబు అంటే ఏంటో బేబి అంటే కూడా అదే’’ అని అన్నాడు గౌతమ్. ఇక పృథ్వి, గౌతమ్ మధ్య నామినేషన్స్ కూడా చాలా సీరియస్‌గా సాగినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది.