BigTV English

IQOO 13 5G : ఐక్యూ నియో 13 వచ్చేసిందోచ్.. దద్దరిల్లే ఫీచర్స్ తో దిమ్మతిరిగే లాంఛింగ్

IQOO 13 5G : ఐక్యూ నియో 13 వచ్చేసిందోచ్.. దద్దరిల్లే ఫీచర్స్ తో దిమ్మతిరిగే లాంఛింగ్

IQOO 13 5G : మోస్ట్ అవైటింగ్ స్మార్ట్ ఫోన్ గా ఉన్న iQOO 13 భారత్ లో లాంఛ్ అయిపోయింది. ఈ మెుబైల్ ఫీచర్స్ అదిరిపోయాయి. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6.82 అంగుళాల AMOLED డిస్ ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. 120W ఛార్జర్‌ తో 30 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే 6000mAh బ్యాటరీ సైతం ఉన్నాయి.


స్మార్ట్ ఫోన్ ప్రియులంతా ఎప్పుడెప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో కొత్త మొబైల్ మార్కెట్లోకి లాంఛ్ అయిపోయింది. iQOO తన ఫ్లాగ్‌షిప్ iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ను భారత్లో విడుదల చేసింది. Realme GT 7 Pro తర్వాత Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో భారత్ లో లాంఛ్ అయిన రెండో స్మార్ట్ ఫోన్ ఇదే. ఇక ధర ఫీచర్స్ అదిరేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ మెుబైల్ ఫీచర్స్ లీక్ అయినప్పుటికీ ధర, కెమెరా ఫీచర్స్ పై క్లారిటీ రాలేదు. ఇక ఈ లాంఛింగ్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఇంకెందుకు ఆలస్యం… ఈ మెుబైల్ ఫుల్ డీటెయిల్స్ పై ఓ లుక్కేద్దాం.

iQOO 13 ధర – iQOO 13 మెుబైల్ 12/16GB LPDDR5X RAM + 256/512GB UFS 4.1 స్టోరేజ్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి లెజెండ్ (వైట్), నార్డో గ్రే. ఇక 12GB+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999 కాగా, 16GB + 512GB వేరియంట్ ధర రూ. 59,999. ఇక SBI, HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,000 డిస్కౌంట్ సైతం లభిస్తుంది.


iQOO 13 Specifications – 

iQOO 13 8.13mm మందం, 213g బరువుతో ఉంది. కెమెరాలో RGB హాలో లైట్ ఉంది. ఇది ఛార్జింగ్, నోటిఫికేషన్స్, కాల్స్, సంగీతం వినడం వంటి పలు విషయాలకు అనుగుణంగా పిక్చర్స్ ను చూపిస్తుంది.

డిస్ ప్లే – ఈ ఫోన్ 6.82 అంగుళాల 8T LTPO 2.0 AMOLED డిస్‌ప్లేను 4,500 nits (హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 1800 nits), 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చేసింది.

ప్రాసెసర్ – iQOO 13 సరికొత్త Qualcomm Snapdragon 8 Elite SoC చిప్ సెట్ తో వచ్చేసింది. Adreno 830 GPUతో పనిచేస్తుంది. iQOO తన సొంత సూపర్‌కంప్యూటింగ్ చిప్ Q2 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ ను డిజైన్ చేసింది. ఇది 144FPS గేమ్ ఫ్రేమ్ ఇంటర్‌పోలేషన్, 2K సూపర్ రిజల్యూషన్‌ను అందిస్తుంది.

కెమెరా – iQOO 13 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చేసింది. 50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 4x లాస్‌లెస్ జూమ్‌తో 50MP సోనీ IMX 816 టెలిఫోటో లెన్స్‌తో వచ్చేసింది. ముందు భాగంలో 32MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కు అనుగుణంగా ఉంది.

బ్యాటరీ – iQOO 13 6,000mAh బ్యాటరీతో వచ్చేసింది. ఇక 120W ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయగలుగుతుంది. ఈ ఫోన్ Android 15 ఆధారంగా సరికొత్త Funtouch OS 15 లో పనిచేస్తుంది. iQOO 13 4 సంవత్సరాల OS అప్‌డేట్స్, 5 ఏళ్ల భద్రతా సదుపాయాన్ని అందిస్తుంది.

ALSO READ : గుర్తు పెట్టుకోండి! ఈ నెంబర్స్ తో వచ్చే కాల్స్ లిఫ్ట్ చేశారో.. ఇక అంతే సంగతి

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×