EPAPER

Moto Upcoming Mobiles: అంతా మోటో మయం.. మూడు కొత్త ఫోన్లు.. ఎంట్రీ అదిరిపోద్ది!

Moto Upcoming Mobiles: అంతా మోటో మయం.. మూడు కొత్త ఫోన్లు.. ఎంట్రీ అదిరిపోద్ది!

Moto Upcoming Mobiles: మోటరోలా టెక్ మార్కెట్‌లో ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. తన మార్క్‌ను చూపెడుతూ కొత్తకొత్త ఫోన్లను తీసుకొస్తుంది. కంపెనీ ఇటీవల తన Moto Edge 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది అనేక పవర్‌ఫుల్ ఫీచర్లు, సూపర్ డిజైన్‌తో వస్తుంది. దీనితో పాటు Motorola కొత్త ఫ్లిప్ ఫోన్‌లు Motorola Razr 50,Razr 50 Ultraలను జూన్ 25న గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.


ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్‌లతో పాటు Motorola S50 Neo పేరుతో మరో కొత్త డివైజ్‌ను చైనాలో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Moto G85 5G పేరుతో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుందని ఒక నివేదిక చెబుతోంది. అంటే మోటరోలా మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పెద్ద ఎంట్రీ ఇవ్వబోతోంది. అధికారిక లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌ల కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు, ధరల గురించి సమాచారం వెల్లడైంది.

Also Read: అస్సలు నమ్మలేరు.. రూ.6వేలకే కొత్త ఫోన్లు.. ఇదేలా సాధ్యం!


Motorola Razr 50, Razr 50 Ultra Price
నివేదిక ప్రకారంMotorola Razr 50 వేరియంట్ 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర 899 యూరోలు (సుమారు రూ. 80,572). అదే సమయంలో 12GB RAM +512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Razer 50 Ultra వేరియంట్ ధర 1199 యూరోలు (సుమారు రూ. 1,07,460)గా ఉండవచ్చు. ఈ ఫోన్లు మూడు కలర్ వేరియంట్‌లో వస్తాయి. గ్రే, ఆరెంజ్, సాండ్ వేరియంట్‌లు ఉన్నాయి. అయితే Motorola Razr 50 Ultra బ్లూ, గ్రీన్, పీచ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Motorola Razr 50, Razr 50 Ultra Specifications
Motorola రాబోయే ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్‌లు 6.9 అంగుళాల ఫుల్ HD + OLED మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. అయితే లోపలి స్క్రీన్ 3.6 అంగుళాలు ఉంటుంది. రేజర్ 50 డైమెన్షన్ 7300x ప్రాసెసర్‌తో రావచ్చు. Razer 50 Ultra స్మార్ట్‌ఫోన్  Snapdragon 8s Gen 3 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది.

రేజర్ 50 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3950mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే అల్ట్రా వేరియంట్‌ను 68 వాట్ ఛార్జింగ్, 4000mAh బ్యాటరీతో చూడవచ్చు. ఈ రెండు ఫోన్‌లు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. అయితే ఇందులో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Moto G85 5G Price
అన్నింటిలో మొదటిది ధర గురించి చెప్పాలంటే Motorola G85 5G ధర 349 యూరోలు (సుమారు రూ. 31,299) కావచ్చు. ఇది గ్రే, ఆలివ్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ దీని లాంచ్ తేదిని అఫిషియల్‌గా ప్రకటించలేదు.

Also Read: బిగ్గెస్ట్ డిస్కౌంట్.. రూ.12 వేలకే ఐఫోన్ 14 ప్లస్.. అసలు కారణం ఇదే!

ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానున్న Moto S50 Neo  రీబ్రాండెడ్ వెర్షన్. ఇందులో 6.6-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. దీని రిజల్యూషన్ ఫుల్ HD+గా ఉంటుంది.  ఈ రాబోయే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను చూస్తారు. కాగా ఇందులో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Related News

Android : ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

iPad mini: ఆపిల్ కొత్త ఐప్యాడ్ చూశారా…? ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్దీ

Redmi : రూ. 8,999కే Redmi 5G స్మార్ట్ ఫోన్ – స్పెసిఫికేషన్స్ అదుర్స్ గురూ!

Realme : ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ

Whatsapp : వాట్సాప్ షాకింగ్ డెషిషన్.. లక్షల్లో అకౌంట్స్ బ్యాన్

Jio Bharat V3 And V4 : అతి తక్కువ ధరకే జియో భారత్ మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Big Stories

×