Five Murders in 24 Hours : భాగ్యనగరం బ్రతుకు తెరువుకే కాదు.. క్రిమినల్స్ కు అడ్డాగా మారుతుంది. హైదరాబాద్ రక్తసిక్తమవుతోంది. రోడ్డుప్రమాదాల్లో చనిపోతున్నారంటే అది వాళ్ల దురదృష్టం, ఎదుటివాడి నిర్లక్ష్యం అవుతుంది. పనిగట్టుకుని ఒక వ్యక్తిని చంపడం అంటే.. ఏమనాలి ? ప్రతీరోజు నగరంలో అనేక దారుణాలు జరుగుతుండగా.. వాటిలో వెలుగులోకొచ్చేవి కొన్నే. గడిచిన 24 గంటల్లో నగర పరిధిలో ఐదురుగు హత్యకు గురవ్వగా.. మరో ఇద్దరిపై హత్యాయత్నాలు జరిగాయి. ఇప్పుడిదే నగరంలో హాట్ టాపిక్ గా మారింది.
పాతబస్తీలోని శాలిబండ పీఎస్ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురవ్వగా.. అదే పీఎస్ పరిధిలో కాలాపతేర్ వద్ద వజీద్, చందూలాలా బరాదారి వద్ద ఫకృద్దీన్ అనే ఇద్దరిపై హత్యాయత్నం జరిగింది. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద మరో వ్యక్తిని చంపేశారు దుండగులు.
1.శాలిబండ పీఎస్ పరిధిలో కాలాపతేర్ వద్ద రఫీక్ బిన్ షిమ్లా మర్డర్
2. ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధిలో అలీమ్ అనే వ్యక్తి దారుణ హత్య
3.తుకారాం గేట్ పీఎస్ పరిధిలో రోజా అనే మహిళ హత్య
4.సనత్ నగర్ పీఎస్ పరిధిలోని భరత్ నగర్ వద్ద అజరు అనే వ్యక్తి మర్డర్
5.కాచిగూడ పీఎస్ పరిధిలో ఖైజర్ అనే యువకుడి హత్య