BigTV English

Indian Dies in Italy: ఇటలీలో దారుణం, భారతీయుడు మృతి వెనుక ఏం జరిగింది?

Indian Dies in Italy: ఇటలీలో దారుణం, భారతీయుడు మృతి వెనుక ఏం జరిగింది?

Indian Dies in Italy: ఇటలీలో దారుణం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం ఇటలీకి వెళ్లిన ఓ భారతీయుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. సకాలంలో ట్రీట్‌మెంట్ చేయకపోవడంతో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇంకా లోతుల్లోకి వెళ్తే…


భారత్‌కు చెందిన 30 సత్నామ్‌సింగ్ పొట్ట కూటి కోసం ఇటలీ వెళ్లాడు. అయితే అధికారిక ద్రువ పత్రాలు లేకపోవడంతో ఇటలీలోని లాటినాలో ఉంటున్నాడు. భారత్ నుంచి వలస వచ్చినవారు ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉంటారు. అక్కడి వ్యవసాయ క్షేత్రంలో సత్నామ్ పని చేస్తున్నాడు. అయితే రెండురోజుల కిందట ఎండిపోయిన గడ్డిని కత్తిరించే పనిలోపడ్డాడు.

ఈ క్రమంలో అతడి చేయి తెగిపోయింది. ఈ ఘటనపై స్థానిక సిబ్బంది పట్టించుకోలేదు. రోడ్డు పక్కన ఓ దగ్గర పడివున్నాడు. బాధితుడి భార్య, ఫ్రెండ్స్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు వెల్లడించారు.


ఈ వ్యవహారంపై అక్కడ రాజకీయ రచ్చ మొదలైంది. ఇది అత్యంత క్రూరమైన చర్యగా పేర్కొన్నారు ఇటలీ కార్మిక మంత్రి. దీనిపై విచారణ చేయించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. అక్కడి విపక్షాలు సైతం ఆ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటలీలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి కుటుంబానికి సహకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×