BigTV English
Advertisement

Prithvi Shaw: క్రికెటర్‌ పృథ్వీ షా కోసం రంగంలోకి ఆ డేంజర్ మ్యాన్ ?

Prithvi Shaw: క్రికెటర్‌ పృథ్వీ షా కోసం రంగంలోకి ఆ డేంజర్ మ్యాన్ ?

Prithvi Shaw: టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా ( Prithvi Shaw) గురించి తెలియని వారుండరు. వివాదాలు, ఫాం కోల్పోవడం లాంటి అంశాల కారణంగా పాపులర్‌ అయ్యాడు టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా ( Prithvi Shaw). తన చేతులారా తానే కెరీర్ ను నాశనం చేసుకుంటున్నాడు. తన పొగరే తనకు శత్రువుగా మారుతుంది. పృథ్వీషా ప్రాక్టీస్ కు వెళ్లకపోవడం, ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టకపోవడం, కోచ్ లు చెప్పిన మాటలు వినకపోవడం వంటివి చేస్తున్నాడు. అందువల్ల ఇతడిని ముంబై రంజీ ట్రోఫీ నుంచి ముంబై క్రికెట్ అసోసియేషన్ తప్పించింది.


Also Read: Hardik – Axar: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ !

 


తన సారథ్యంలో ఆడిన ఆటగాళ్లంతా టీమ్ లో టీమిండియా స్టార్లుగా ఎదిగితే పృథ్వీషా మాత్రం అనవసరమైన గొడవలు, వివాదాలతో ఆటపై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. 18 ఏళ్ల వయసులోనే టీమ్ ఇండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఇతను ఇప్పుడు జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు పృథ్వీ షా ( Prithvi Shaw). టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ కాదు కదా ఇప్పుడు రంజి టీం లో చోటును కోల్పోయాడు. 2018లో పృథ్వీషా కెప్టెన్సీలో భారత్ అండర్-19 ప్రపంచకప్ ను గెలుచుకుంది. ఆ తర్వాత ఇతనికి తిరుగులేదు అనిపించింది.

Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!

టీమిండియా తరపున అరంగేట్రం చేసి తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. అయితే క్రమంగా ఫామ్ కోల్పోతూ వచ్చాడు. తన ప్రవర్తన కారణంగా టీమిండియా నుండి కూడా తొలగించబడ్డాడు. పృథ్వీషా పరిస్థితి చూసి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ చాపెల్ అతనిపై జాలి పడ్డాడు. అవసరమైతే పృథ్విషాకు సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గ్రేగ్‌ చాపెల్ ( Greg Chappell) వెల్లడించాడు. నిజానికి చాపెల్ ను భారతీయులు ఓ విలన్ గా చూస్తారు. అతని హయాంలో టీమిండియా క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. చాపెల్ 2005 నుంచి 2007 వరకు టీమ్ ఇండియాకు కోచ్ వ్యవహరించాడు.

Also Read: Rinku Singh: ఐపీఎల్‌ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !

ఈ సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు చాపెల్…. పృధ్విషాకు మద్దతునిస్తూ లేఖను రాశాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. టీమిండియా తలపులు ఇంకా మూసుకుపోలేదు. ఆటగాళ్లకు కెరియర్ లో ఒడిదుడుకులు సహజమేనని గ్రేగ్‌ చాపెల్ ( Greg Chappell) చెప్పాడు. అయితే పరిస్థితులకు తగినట్లుగా కెరియర్ ను మలచుకోవాలని సూచించాడు. క్రికెట్ లో పేరును సంపాదించడానికి మీకు ఇంకా తగినంత సమయం ఉందని చాపెల్ చెప్పాడు. మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులతో ఉండండి అని అన్నాడు. ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టండి అంటూ గ్రేగ్‌ చాపెల్ ( Greg Chappell)… పృథ్వి షాకు ( Prithvi Shaw) ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.

Related News

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Big Stories

×