Big Stories

NASA:- మార్స్‌పైకి నాసా శాస్త్రవేత్తలు.. అంతకంటే ముందు..

NASA:- భూమి అనేది ప్రస్తుతం మనుషులకే కాదు.. సమస్త జీవరాశులకు చాలా ప్రమాదకరంగా మరింది. రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్లాస్టిక్.. ఇలాంటి ఎన్నో అంశాలు భూమిపై మాత్రమే కాదు.. దానిపై జీవించే ప్రాణుల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే ఇతర గ్రహాలపై పరిశోధనలను వేగవంతం చేశారు శాస్త్రవేత్తలు. అందులో భాగంగానే ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

- Advertisement -

ప్రస్తుతం భూమిపై కాకుండా ఇంకా ఏ గ్రహంపై మానవాళి జీవించే అవకాశాలు ఉన్నాయి అన్న ప్రశ్న వస్తే.. చాలామంది శాస్త్రవేత్తలు ఆలోచించకుండా మార్స్ అని చెప్తారు. కానీ అక్కడ మానవాళి జీవనానికి ఉపయోగపడే వనరులను ఏర్పాటు చేయవచ్చా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న. అందుకే అసలు మార్స్‌పై జీవనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాసా నిర్ణయించుకుంది. పలువురు వాలంటీర్లకు మార్స్‌పై జీవితాన్ని రుచి చూపించనుంది.

- Advertisement -

ఒకవైపు స్పేస్ హెల్మెట్స్, ఆస్ట్రానాట్స్ బూట్లు, చార్ట్స్.. మరోవైపు ఎర్రటి మట్టి, తెల్లటి ఆకాశం, చిన్నగా వెలుగునిచ్చే లైట్. మార్స్‌పై ఉన్న కొండలు కూడా కాస్త దూరంలో కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ నేరుగా కళ్లతోనే చూసినా కూడా దీనికోసం వారు మార్స్‌పైకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవన్నీ 3డి టెక్నాలజీతో తయారు చేసి 12 మంది వాలంటీర్లను ఒక సంవత్సరం పాటు ఈ వాతావరణంలో వదిలేయనుంది నాసా. ఇప్పటికే ఈ వాతావరణాన్ని హోస్టన్‌లోని రీసెర్చ్ సెంటర్‌లో సిద్ధం చేసి ఉంచింది.

12 మంది వాలంటీర్లు మూడు గ్రూప్స్‌గా విభజించబడతారు. ప్రతీ గ్రూప్‌లో ఇద్దరు ఆడవారు, ఇద్దరు మగవారు ఉంటారు. సంవత్సరం పాటు వీరికి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. మార్స్‌పై మనుషుల జీవనం ఎలా ఉంటుందో వీరు పూర్తిగా అనుభూతి చెందనున్నారు. త్వరలోనే ఈ పరిశోధనను ప్రారంభించనుంది నాసా. భవిష్యత్తులో స్పేస్ టెక్నాలజీలో ఎన్నో విధాల ఛాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉండగా నాసా.. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మార్స్ డ్యూన్ అల్ఫా పేరుతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. మార్స్‌కు చేరుకోవాలంటే లో ఎర్త్ ఆర్బిట్‌ను దాటి భూమికి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సిన వనరులు దొరికే అవకాశం ఉండదు. అచ్చం అలాగే ఈ ప్రాజెక్ట్‌లో మనుషులు కూడా తక్కువ వనరులతో సంవత్సరం పాటు వారి జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఒకవేళ నాసా చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే మార్స్‌కు మరింత చేరువగా వెళ్లినట్టే అని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News