E-Paper
Advertisement

Laptop Control with Brain: మెదడుతో ల్యాప్‌టాప్ కంట్రోల్ చేసిన యువకుడు.. కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే

Laptop Control with Brain: మెదడుతో ల్యాప్‌టాప్ కంట్రోల్ చేసిన యువకుడు.. కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే
Advertisement

Laptop Control with Brain| ఇప్పుడుంతా టెక్నాలజీ యుగం. ఊహకందని రీతిలో కొత్త కొత్త టెక్నాలజీ అభివ‌ృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో తాజాగా ఒక యువకుడు తన మెదుడుతో కంప్యూటర్ ల్యాప్‌టప్‌ని కంట్రోల్ చేయగలిగాడు. ఇదంతా ఎలన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ అభివ‌ృద్ధి చేసిన స్పెషల్ చిప్ టెక్నాలజీతో సాధ్యమైంది.

న్యూరాలింక్ కంపెనీ మెదడు, కంప్యూటర్‌ల మధ్య టెక్నాలజీని వేగంగా ముందుకు తీసుకెళుతోంది. పక్షవాతం బారిన పడిన ఒక యువకుడి మెదడులో 100 రోజుల క్రితం స్పెషల్ చిప్ ఇంప్లాంట్ చేసింది. ఈ 100 రోజుల్లో ఆ యువకుడు తన మెదుడు, ఆలోచనలతో వింత పనులు చేయగలిగాడు.

ఆ యువకుడు ఎవరంటే

Advertisement

బ్రిటీష్ ఆర్మీలో ఓ సైనికుడిగా పనిచేశాడు జాన్ ఎల్. నోబుల్. మిలిటరీ కార్యకలాపాల్లో గాయం వల్ల మెడ కింద భాగం పూర్తిగా పక్షవాతానికి గురైంది. అంటే అతని తల, మెడ వరకు ఉన్న శరీర భాగాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా శరీరంలో చలనం లేదు. దీంతో జాన్.. న్యూరాలింక్ ప్రోగ్రామ్‌లో చేరాడు. అక్కడ తన మెదడులో న్యూరాలింక్ పరిశోధకులు ఒక చిప్ అమర్చారు. అలా చిప్ అమర్చిన వారిలో జాన్ 18వ పేషెంట్. ఈ ప్రయోగం జాన్ జీవితాన్ని మార్చేసింది.

న్యూరాలింక్ N1 చిప్ ఇంప్లాంట్ ఏమిటి?

N1 ఇంప్లాంట్ అనేది మెదడుతో కంప్యూటర్‌ను లింక్ చేసే చిన్న చిప్. ఈ స్పెషల్ చిప్‌ని మనిషి మెదడులోని మోటార్ కార్టెక్స్ ప్రాంతంలో అమర్చారు. ఈ ప్రాంతం శరీరం కదలికలను నియంత్రిస్తుంది. ఈ చిప్‌లో 1,024 అతి సన్నని తీగలు ఉన్నాయి. ఇవి మెదడు సిగ్నల్స్‌ను కచ్చితంగా చదువుతాయి.

శస్త్రచికిత్స ఎలా జరిగింది?

Advertisement

రోబోటిక్ టెక్నాలజీతో జాన్ తలకు శస్త్రచికిత్స చేశారు. జనరల్ అనస్థీషియా ఇచ్చి, రోబో సహాయంతో తీగలను కచ్చితంగా అమర్చారు. ఇది చాలా సురక్షితమైన, తక్కువ ఇబ్బంది కలిగించే విధానం. శస్త్రచికిత్స తర్వాత మరుసటి రోజే రోగిని డిశ్చార్జ్ చేశారు.

Also Read: గూగుల్ సెర్చ్‌లో స్కామ్.. డాక్టర్ నెంబర్ కోసం వెతికితే రూ.18 లక్షల దోపిడీ

ఇంప్లాంట్ తర్వాత తొలి ఫలితాలు

శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజుల్లోనే మెరుగుదల కనిపించింది. మెదడు సిగ్నల్స్‌కు సిస్టమ్ త్వరగా స్పందించింది. రెండు వారాల్లోనే జాన్ మెదడులో ఉన్న చిప్‌ని ఆపిల్ ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్‌తో కనెక్ట్ చేశారు. అప్పటి నుంచి ఆలోచనలతోనే ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఉన్న కర్సర్‌ను జాన్ కంట్రోల్ చేశాడు. ఎలాంటి శారీరక కదలికలు లేకుండా పని చేయగలిగాడు.

ఆలోచనలతో కంప్యూటర్‌ను కంట్రోల్ చేయడం ఎలా?

కేవలం ఒక కుర్చీలో కూర్చున్న జాన్ తన ఎదుట ఉన్న ల్యాప్‌టాప్‌ని చూస్తూ కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. మొదట్లో కొంత అభ్యాసం.. సహనం అవసరమైంది. సిస్టమ్‌ను కాలిబ్రేట్ చేయాల్సి వచ్చింది. మూడవ వారంలో స్క్రోల్ చేయడం, క్లిక్ చేయడం, టైప్ చేయడం సులభమైంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మెదడు ఈ టెక్నాలజీకి అలవాటు పడింది.

బ్రెయిన్ సిగ్నల్స్‌తో గేమింగ్

80 రోజుల తర్వాత జాన్ ఎవరూ ఊహించనిది చేయగలిగాడు. ల్యాప్‌టాప్‌లో తన ఆలోచనలతోనే గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్ వీడియో గేమ్‌ను విజయవంతంగా ఆడాడు. మొదట్లో కష్టంగా అనిపించినా, అభ్యాసం వల్ల జాన్ గేమింగ్ పర్‌ఫామెన్స్ మెరుగైంది. ఇది మెదడు-కంప్యూటర్ మధ్య సమన్వయాన్ని చూపించింది.

ప్రజల స్పందన, ఆసక్తి

జాన్ ఇదంతా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పంచుకున్నాడు. ఆ పోస్ట్‌కు చాలా మంది సానుకూలంగా స్పందించారు. వికలాంగులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీ గురించి ఆసక్తి చూపారు. ఇది యాక్సెసిబిలిటీ, ఆవిష్కరణల గురించి చర్చలు మొదలు పెట్టింది.

జాన్ రోజువారీ జీవితంపై ప్రభావం

100 రోజుల తర్వాత నోబుల్ తన జీవితంలో పెద్ద మార్పులు వచ్చాయని చెప్పాడు. ఇప్పుడు ఆలోచనలతోనే కంప్యూటర్‌ను స్వతంత్రంగా నియంత్రించగలుగుతున్నాడు. అతనికి ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఇంప్లాంట్ లేని జీవితం ఇప్పుడు తాను ఊహించలేనని అన్నాడు.

బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ల భవిష్యత్తు

బ్రెయిన్-కంప్యూటర్ టెక్నాలజీ కెపాసిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంనేందుకు ఈ కేసు ఉదాహరణ. భవిష్యత్తులో మనిషి-యంత్రాల మధ్య సంబంధం పూర్తిగా మారిపోవచ్చు. అయితే దీర్ఘకాలిక ప్రభావాలు, భద్రత, నైతికత వంటి అంశాలపై ఇంకా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. మరిన్ని పరిశోధనలు ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరుస్తాయి.

న్యూరాలింక్ మానవ-యంత్ర సంబంధాల సరిహద్దులను ముందుకు తీసుకెళ్తోంది. 100 రోజుల ఎక్స్‌పీరియన్స్ వైద్య టెక్నాలజీలో నిజమైన పురోగతిని చూపిస్తోంది. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చగలదు.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×