E-Paper
Advertisement

వామ్మో.. డిస్‌ప్లే లేని స్మార్ట్ బ్యాండా? Noise సరికొత్త ప్రయోగం.. ధర, ఫీచర్లు ఇవే!

వామ్మో.. డిస్‌ప్లే లేని స్మార్ట్ బ్యాండా? Noise సరికొత్త ప్రయోగం.. ధర, ఫీచర్లు ఇవే!
Advertisement

Noise REP Band: ఇండియన్ మార్కెట్లోకి ప్రముఖ ఆడియో, వేరబుల్ బ్రాండ్ నాయిస్ సరికొత్త ప్రీమియం హెల్త్ బ్యాండ్‌ను తీసుకొచ్చింది. ‘నాయిస్ రెప్ బ్యాండ్’ పేరుతో లాంచ్ అయిన ఈ డివైజ్.. సాధారణ స్మార్ట్‌వాచ్‌లకు భిన్నంగా, అసలు స్క్రీనే లేకుండా రావడం విశేషం. డిస్‌ప్లే డిస్ట్రాక్షన్స్ లేకుండా, కేవలం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలనుకునే వారి కోసం కంపెనీ దీనిని డిజైన్ చేసింది.

ధర ఎంతంటే?

ప్రీమియం లుక్‌తో అలరిస్తున్న ఈ నాయిస్ రెప్ బ్యాండ్ ప్రీ-బుకింగ్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. ఇది వివిడ్ ఆరెంజ్, నావీ బ్లూ, క్లాసిక్ బ్లాక్, శాండ్ బేజ్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఆసక్తి గలవారు నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే దీని సాధారణ విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అసలు ధర ఎంత ఉంటుందనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

స్క్రీన్ లేని వెరైటీ డిజైన్:

Advertisement

సదా డిస్‌ప్లే నోటిఫికేషన్లు, మెసేజ్‌ల గోల వద్దు అనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. కేవలం 27 గ్రాముల బరువుండే ఈ బ్యాండ్ బాడీని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. దీనికి వాడిన హైపోఅలెర్జిక్ వోవెన్ స్ట్రాప్, వన్-హ్యాండ్ క్లాస్ప్ చేతికి మంచి కంఫర్ట్‌ను ఇస్తాయి. 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం వల్ల చెమట పట్టినా, స్నానం చేస్తున్నప్పుడు కూడా దీనిని సులభంగా వాడుకోవచ్చు.

Also Read: రూ.2.30 లక్షల Foldable iPhone.. లాంచ్ అయినా చేతికి రావడం కష్టమే, ఎందుకో తెలుసా?

పవర్‌ఫుల్ సెన్సార్లు.. ఏఐ రిపోర్ట్స్:

Advertisement

ఈ బ్యాండ్‌లో అధునాతన ఆప్టికల్ సెన్సార్లు, రంగు రంగుల ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఇవి అన్ని రకాల స్కిన్ టోన్స్ ఉన్నవారికి ఖచ్చితమైన రీడింగ్స్ ఇస్తాయి. అలాగే గుండె వేగం, ఆక్సిజన్ స్థాయిలు (SpO2), ఒత్తిడి, నిద్ర నాణ్యత, రికవరీ స్కోర్ వంటి ఎన్నో విషయాలను ఈ స్మార్ట్ బ్యాండ్ నిరంతరం ట్రాక్ చేస్తుంది. విశేషం ఏమిటంటే.. ఎలాంటి మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేకుండానే ‘నాయిస్ ఫిట్’ యాప్ ద్వారా ఏఐ (AI) ఆధారిత హెల్త్ రిపోర్ట్‌లను ఉచితంగా పొందవచ్చు.

ఆటోమేటిక్ వర్కౌట్ ట్రాకింగ్:

ఈ స్మార్ట్ బ్యాండ్‌లోని ప్రత్యేక సెన్సార్లు మన వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, రోయింగ్ వంటి వ్యాయామాలు చేయడాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించి రికార్డ్ చేస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు బ్లూటూత్ ద్వారా ఇది సులభంగా కనెక్ట్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండా, కేవలం ఆరోగ్యాన్ని ట్రాక్ చేసుకోవాలనుకునే వారికి నాయిస్ రెప్ బ్యాండ్ పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది.

Also Read: స్మార్ట్ టీవీల్లో ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలిస్తే.. ఇకపై సినిమా చూసే స్టైలే మారిపోతుంది!

Related News

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు

బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్

Big Stories

Advertisement
×