E-Paper
Advertisement

ప్రీమియం డిజైన్,7 రోజుల బ్యాటరీ! NoiseFit Halo 3 స్మార్ట్‌వాచ్ ఫుల్ డీటైల్స్!

ప్రీమియం డిజైన్,7 రోజుల బ్యాటరీ! NoiseFit Halo 3 స్మార్ట్‌వాచ్ ఫుల్ డీటైల్స్!
Advertisement

NoiseFit Halo 3 smartwatch: స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైమ్ చూసుకోవడానికి లేదా హెల్త్ ట్రాకింగ్ చేయడానికి మాత్రమే కాదు, మన చేతికి ఒక రాయల్ అండ్ ట్రెండీ లుక్ ఇవ్వడానికి కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది. ప్రముఖ టెక్ అండ్ వేరబుల్స్ బ్రాండ్ నోయిస్, సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. మెటాలిక్ బాడీ, 1.43 ఇంచుల అమోలెడ్ స్క్రీన్, ‘Noise AI Pro’ ఫీచర్లు, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రూపుదిద్దుకున్న ఈ లేటెస్ట్ వాచ్ ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

NoiseFit Halo 3 పూర్తి వివరాలు:

డిజైన్ ,డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ వాచ్ చూడగానే ఆకట్టుకునే క్లాసీ ప్రొఫెషనల్ లుక్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇందులో బిగ్ అండ్ కలర్‌ఫుల్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. 1000 nits పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎంత  ఎండలో ఉన్నా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

ప్రీమియం బిల్డ్: రౌండ్ డయల్ మెటల్ బాడీతో వస్తుంది. ఇందులో మెటల్, లేదర్, సిలికాన్ స్ట్రాప్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫీచర్లు:

ఈ వాచ్‌లో మెయిన్ అట్రాక్షన్ ఇందులోని Noise AI Pro సిస్టమ్.

Advertisement

కమాండ్స్: మీ వాయిస్ నోట్స్‌ను టెక్స్ట్‌గా మార్చడం, వాయిస్ కమాండ్స్ ద్వారా నేరుగా పనులు పూర్తి చేసుకోవడం చాలా తేలిక.

సూపర్ నోటిఫికేషన్లు : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే ఓటీపీలు, డెలివరీ అప్‌డేట్లు, క్యాబ్ అలర్ట్ వంటివి నేరుగా వాచ్ స్క్రీన్ మీదే చూసుకోవచ్చు.

నోయిస్ వాల్ట్ : విమాన టిక్కెట్లు, మూవీ పాస్‌లు లేదా కాన్సర్ట్ టిక్కెట్ల క్యూఆర్ కోడ్‌లను వాచ్‌లో సేవ్ చేసుకుని నేరుగా స్కాన్ చేయవచ్చు.

బ్లూటూత్ కాలింగ్: ఇన్-బిల్ట్ మైక్, స్పీకర్ ద్వారా ఫోన్ ఎత్తకుండానే వాచ్ నుంచే నేరుగా మాట్లాడవచ్చు.

హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ట్రాకింగ్:

మీ ఆరోగ్యం గురించిన వివరాల కోసం లేటెస్ట్ సెన్సార్లు అమర్చారు.

వన్-ట్యాప్ హెల్త్ చెక్: ఒక్క క్లిక్‌తో హార్ట్ రేట్ , రక్తంలో ఆక్సిజన్ , ఒత్తిడి స్థాయిలను కొలవవచ్చు.

స్లీప్ ట్రాకింగ్ & మోర్నింగ్ బ్రీఫ్: రాత్రి వేళ మీ నిద్ర నాణ్యతను రికార్డ్ చేయడమే కాక, ఉదయాన్నే రోజువారీ హెల్త్ సమ్మరీని అందిస్తుంది.

మల్టీ-స్పోర్ట్స్ మోడ్లు: రన్నింగ్, వాకింగ్, యోగా, జిమ్ వర్కౌట్లు చేసేవారి కోసం వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి.

Also Read: జేబులో పట్టేంత కాంపాక్ట్ డిజైన్! ఫీచర్లు చూస్తే ఫిదా

బ్యాటరీ లైఫ్:

ఈ మోడల్ ని ఒక సారి పూర్తి స్థాయిలో ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంతో గరిష్టంగా 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ప్రతి రోజూ ఛార్జింగ్ పెట్టుకునే తిప్పలు ఉండవు.

ధర ఎంత?

మార్కెట్లో ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 5,499 గా నిర్ణయించారు. (వివిధ ఆన్‌ లైన్ సేల్స్, ఆఫర్లను బట్టి ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది). ఈ స్మార్ట్‌వాచ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటు లో ఉంది.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×