E-Paper
Advertisement

Vi రూ.2,249 vs BSNL రూ.2,799.. ఏడాదంతా పండగే.. కానీ రెండిట్లో ఏది బెస్ట్?

Vi రూ.2,249 vs BSNL రూ.2,799.. ఏడాదంతా పండగే.. కానీ రెండిట్లో ఏది బెస్ట్?
Advertisement

Annual Recharge Plans: తరచూ రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా ఏడాది అంతా ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి వార్షిక రీఛార్జ్ ప్లాన్లు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంటాయి. అయితే ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తాయన్న పేరుంది. ముఖ్యంగా వార్షిక ప్లాన్ల విభాగంలో వీఐ రూ.2,249, బీఎస్ఎన్ఎల్ రూ.2,799 ఆకట్టుకుంటున్నాయి. అయితే బెనిఫిట్స్ ఏంటి? ఎవరికి ఏ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వీఐ రూ. 2,249 ప్లాన్

వీఐ ఈ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత లోకల్, ఎస్‌టీడీ కాలింగ్ సౌకర్యం లభించనుంది. ఇక డేటా విషయానికి వస్తే.. ఇందులో ఏడాది మొత్తానికి కలిపి 30 జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభించనుంది. అటు 3,600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. డేటా పరిమితి అయిపోతే ఇంటర్నెట్ వాడకానికి 1MB కి 50 పైసల చొప్పున ఛార్జ్ చేస్తారు. అలాగే 3,600 ఎస్‌ఎంఎస్‌లు దాటితే లోకల్ మెసేజ్‌కు రూపాయి, ఎస్‌టీడీ మెసేజ్‌కు రూ.1.50 చెల్లించాల్సి ఉంటుంది.

BSNL రూ. 2,799 ప్లాన్

Advertisement

మరోవైపు బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్ విషయానికి వస్తే.. ఏడాది పొడవునా రోజుకు 3 జీబీ చొప్పున హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి తోడు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం కూడా ఉంది. రోజువారీ 3GB డేటా కోటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అవ్వకుండా 40kbps వేగంతో కొనసాగుతుంది.

Also Read: ఓరి దేవుడా.. పదో అంతస్తు నుంచి దూకినా.. యువతికి ఏం కాలేదు!

ఏ ప్లాన్ ఎంచుకోవడం బెస్ట్?

Advertisement

డేటాతో పెద్దగా పనిలేకుండా, కేవలం ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే ముఖ్యమైతే తక్కువ ధరలో లభించే Vi రూ.2,249 ప్లాన్ సరిపోతుంది. కానీ రోజూ ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతూ ప్రతిరోజూ ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత డేటా కావాలనుకునే వారికి బీఎస్ఎన్ఎల్ రూ.2,799 ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీ అవసరానికి తగ్గ ప్లాన్ ను మీరే ఎంచుకోండి.

Also Read: 1871లో మనుషుల్లేని ద్వీపంలోకి 5 ఆవులు.. 137 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్నది చూసి.. శాస్త్రవేత్తలే షాక్!

Tags

Related News

రూ. 49,990కే ల్యాప్‌టాప్ ! ఆఫర్ ముగిసే లోపు కొనేయండి

ప్రీమియం డిజైన్,7 రోజుల బ్యాటరీ! NoiseFit Halo 3 స్మార్ట్‌వాచ్ ఫుల్ డీటైల్స్!

ఐఫోన్ అల్ట్రా రంగులపై కొనసాగుతున్న ఉత్కంఠ.. డిజైన్ ఎలా ఉండొచ్చంటే?

ఇంటినే డిస్కోలా మార్చేసే..బ్లూటూత్ స్పీకర్

రాఖీ గిఫ్ట్ ఏంటో ఇంకా ఫిక్స్ కాలేదా? అయితే ఈ గ్యాడ్జెట్స్‌పై ఓ లుక్కేయండి!

రూ.599లకే ట్రెండీ బ్లూటూత్ స్పీకర్ ! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

కిటికీ పక్కన PC ఉందా? మానిటర్ గ్లేర్ తగ్గించడానికి ఇలా చేయండి!

Big Stories

Advertisement
×