Nothing Headphone 1 Pro: ఎప్పుడూ ఏదో ఒక కొత్త డిజైన్‌తో టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే నథింగ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి మరో సంచలనం మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. మ్యూజిక్ ప్రియుల కోసం నథింగ్ సంస్థ ఏకంగా ఓ ప్రీమియం హెడ్‌ఫోన్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్లకు ఇది గట్టిపోటీ ఇచ్చేలా కన్పిస్తోంది. మరి ఆ కొత్త గ్యాడ్జెట్ ఏంటి, దాని ప్రత్యేకతలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఇప్పడు చూసేద్దామా..
తాజా లీకుల ప్రకారం.. నథింగ్ హెడ్‌ఫోన్ (1) ప్రో ధర యూరప్ మార్కెట్లో రూ.38,700గా, అమెరికాలో రూ.38,000గా ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే, ఈ హెడ్‌ఫోన్ సెప్టెంబర్ 29న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్లాసిక్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి రానుందని సమాచారం.
Also Read: వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!
సాధారణ హెడ్‌ఫోన్ల కంటే ఇందులో ఆడియో క్వాలిటీ నెక్ట్స్ లెవెల్లో ఉండబోతోంది. ఇందులో త్రిపుల్-డ్రైవర్ ఆర్కిటెక్చర్‌ను వాడినట్లు తెలుస్తోంది. బేస్, క్లారిటీ కోసం ప్రత్యేక డ్రైవర్లతో పాటు హై ఫ్రీక్వెన్సీల కోసం ప్రత్యేకమైన ఎక్స్‌మెమ్స్ టెక్నాలజీని అందించారు. లండన్‌కు చెందిన ప్రముఖ మెట్రోపాలిస్ స్టూడియోస్ సహకారంతో దీని సౌండ్ ట్యూనింగ్ చేయడం విశేషం. హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో పాటు ఎల్‌డీఏసీ సపోర్ట్, హెడ్ ట్రాకింగ్‌తో కూడిన స్పేషియల్ ఆడియో దీని సొంతం.
మ్యూజిక్ ప్రియులను డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు ఇందులో పది మైక్రోఫోన్లతో కూడిన అడాప్టివ్ ఏఎన్‌సీని ఇస్తున్నారు. అంటే.. పరిసరాలను బట్టి నాయిస్ క్యాన్సిలేషన్ తనంతట తానుగా మారుతుంది. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 60 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్ లభించనుంది. దీనికి తోడు బ్లూటూత్ 6.1 కనెక్టివిటీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం జాక్ కూడా ఉన్నాయి.
ఈ హెడ్‌ఫోన్ కేవలం సౌండ్ విషయంలోనే కాకుండా డిజైన్ పరంగా కూడా చాలా రిచ్‌గా ఉండనుంది. అల్యూమినియం బాడీతో పాటు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ను ఉపయోగించి దీన్ని చాలా పటిష్టంగా తయారు చేశారు. నీటి చుక్కలు, ధూళి తగిలినా ఏమీ కాకుండా ఐపీ52 రేటింగ్ కూడా ఇచ్చారు. మొత్తానికి మ్యూజిక్ లవర్స్‌కు ఇదొక మంచి ఆప్షన్ అయ్యేలా ఉంది.