E-Paper
Advertisement

80’s సోకులు.. ఏఐతో హంగులు.. జెన్ జీ ఫుల్ ఫిదా, ఎందుకంటే?

80’s సోకులు.. ఏఐతో హంగులు.. జెన్ జీ ఫుల్ ఫిదా, ఎందుకంటే?
Advertisement

ఏఐతో పైసా ఖర్చు లేకుండా అయిపోతున్న ఈ ఇమేజ్ క్రియేషన్‌ను తెగ వాడేస్తున్నారు మన జనం. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ తెరిస్తే చాలు.. అన్నీ అవే. ఫొటోలు, వీడియోలు.. అబ్బో హంగామా మామూలుగా లేదు. దీనికి ఇంత ఆధరణ దొరకడానికి కారణం.. ఆనాటి ఫ్యాషన్. మొబైళ్లు లేని కాలంలో టేప్ రికార్డులు, పాతకాలం టీవీలను చూస్తుంటే భలే చిత్రంగా అనిపించడం. ఈ తరం చూడలేని కొత్త విషయాలను అందులో చూపించడం. చెప్పాలంటే ఇలా చాలానే ఉన్నాయి. వీటికి ఆనాటి రెట్రో మ్యూజిక్ యాడ్ చేస్తే.. మరింత అద్భుతం.

సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ నుంచి స్టోరీ దాకా అచ్చం 80స్ నాటి పాత ఫోటోలాగే కనిపిస్తోంది! కొంచెం బ్లర్ అయిన టెక్స్చర్, సూర్యకాంతి పడినట్లు ఉండే లైట్ లీక్స్, ఆరెంజ్-బ్రౌన్ ఫేడెడ్ కలర్ టోన్స్‌తో వింటేజ్ గ్రెయిన్ ఎఫెక్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఎలాంటి హై-ఎండ్ స్టూడియో లైట్లు అక్కర్లేకుండా.. సింపుల్‌గా ఆ పాతకాలపు నాస్టాల్జిక్ ఫీల్‌ని ఫోటోల్లోకి తేవడమే ప్రెజెంట్ జనరేషన్ ట్రెండ్.

Advertisement

కేవలం కలర్ టోన్సే కాదు.. డ్రెస్సింగ్ స్టైల్ కూడా పూర్తిగా ఎయిటీస్ మోడ్‌లోకి మారిపోయింది! హై-వాస్టెడ్ మామ్ జీన్స్, ఓవర్‌సైజ్డ్ బ్లేజర్స్, రంగురంగుల విండ్‌బ్రేకర్ జాకెట్లు, చేతిలో వాక్‌మ్యాన్ లేదా రియల్ క్యాసెట్ టేప్‌లను ప్రాప్స్‌గా పట్టుకుని మరీ ఫోటోలు దిగుతున్నారు. ఆ కాలంలో పెద్దలు వాడిన వింటేజ్ సన్ గ్లాసెస్, హెయిర్‌స్టైల్స్‌ని మోడర్న్ టచ్‌తో మిక్స్ చేసి మరీ రీక్రియేట్ చేస్తూ గ్లోబల్ లెవెల్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

Also Read: చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!

Advertisement

ఒకప్పుడు ఆ పాత 80s ఫోటోలు తీయాలంటే ముప్పై ఆరు ఎక్స్పోజర్లు ఉన్న ఫిలిం రోల్ కచ్చితంగా ఉండాల్సిందే. కెమెరా లెన్స్ ముందు వేలు అడ్డం పడితే ఆ షాట్ వేస్ట్! కానీ ఈ రోజుల్లో ఆ కష్టాలన్నీ పూర్తిగా మాయం అయిపోయాయి! చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో Dazz Cam, VSCO లాంటి యాప్స్ ఓపెన్ చేసి.. జస్ట్ సింగిల్ ట్యాప్ చేస్తే చాలు, సెకన్లలో అచ్చం ఒరిజినల్ వింటేజ్ కెమెరా ఫోటో రెడీ అయిపోతుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి రీల్ వేస్ట్ టెన్షన్ లేకుండా ప్రెజెంట్ కుర్రాళ్ళు ఈ రెట్రో ట్రెండ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: ఇప్పటి ఆర్భాటాలు లేవు కానీ.. 80ల్లో వినాయకచవితి మజానే వేరు.. ఆ రోజులు మళ్లీ రావు!

Tags

Related News

80’s లవ్ లెటర్.. కాగితంపై మనసులో మాట.. అక్షరాల్లో అంతులేని ప్రేమ!

స్త్రీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం.. PCOS – PCOD మధ్య అసలు తేడా ఇదే!

సైకిల్ బెల్ వినిపిస్తే చాలు.. ఉత్తరం వచ్చిందనే ఆనందం, అప్పుడు డబ్బాలు.. ఇప్పుడు ఫోన్లు!

పొరపాటున కూడా..ఇలాంటి వినాయక విగ్రహాలు అసలు కొనొద్దు!

ఆస్తమా రోగుల కోసం సూపర్ మొక్క.. దీని ప్రత్యేకతలు తెలుసా

వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తారు? పుట్టుక వెనుక అసలు రహస్యం ఇదే!

మీ హ్యాండ్‌షేక్ బలహీనంగా ఉంటే గుండె సమస్యలు ఉన్నట్లే? గ్రిప్‌ స్ట్రెంగ్త్‌‌‌తో ఇలా తెలుసుకోండి

Big Stories

Advertisement
×