India’s UPI Impresses German Minister: ప్రపంచంలో కార్ల తయారీ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే దేశాల్లో జర్మనీ ఒకటి. BMW, బెంజ్, ఆడి లాంటి దిగ్గజ కంపెనీలు ఆ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అత్యాధునిక ఇంజినీరింగ్, సాంకేతికత విషయంలో జర్మనీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే డిజిటల్ చెల్లింపుల విషయంలో మాత్రం భారత్ మరో దేశానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. దేశంలో UPI ఎంత వేగంగా సాధారణ జీవితంలో భాగమైందో చెప్పడానికి ఓ ఆసక్తికరమైన ఘటన బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. భారత పర్యటనకు వచ్చిన జర్మనీకి చెందిన డిజిటల్, రవాణా శాఖ మంత్రి వోల్కర్ విస్సింగ్ తొలిసారి UPI ద్వారా చెల్లింపు చేశారు.
భారత పర్యటనలో భాగంగా ఆయన ఓ రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణానికి వెళ్లారు. అక్కడ కొనుగోలు చేసిన వస్తువులకు ఫోన్ ద్వారా చెల్లించేందుకు UPIని ఉపయోగించారు. QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత కొన్ని క్షణాల్లోనే పేమెంట్ పూర్తయింది. పేమెంట్ ఇంత సులభంగా, వేగంగా పూర్తవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. సాధారణంగా రోజువారీ కొనుగోళ్ల కోసం ప్రత్యేక యాప్‌లు, కార్డులు, నగదు అవసరం లేకుండా ఫోన్ తోనే పేమెంట్ చేయడం భారత్ లో ఎంత సాధారణమైందో ఈ ఘటన మరోసారి చూపించింది.
One of India’s success story is digital infrastructure. UPI enables everybody to make transactions in seconds. Millions of Indians use it. Federal Minister for Digital and Transport @Wissing was able to experience the simplicity of UPI payments first hand and is very fascinated! pic.twitter.com/I57P8snF0C
— German Embassy India (@GermanyinIndia) August 20, 2023
భారత్‌లో డిజిటల్ చెల్లింపులు పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. టీ దుకాణాలు, కూరగాయల బండ్లు, చిన్న హోటళ్లు, మెడికల్ షాపులు, టిఫిన్ సెంటర్లు ఇలా దాదాపు ప్రతి చోటా QR కోడ్‌లు కనిపిస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డబ్బు పంపించే సౌకర్యం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. చిన్న మొత్తమైనా, పెద్ద లావాదేవీ అయినా UPI ద్వారా చెల్లించడం ఇప్పుడు రోజువారీ అలవాటుగా మారిపోయింది.
జర్మనీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ముఖ్యంగా ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా దానికి తిరుగులేని పేరు ఉంది. అయితే, నగదు వినియోగం అక్కడ ఇప్పటికీ ఎక్కువగా ఉంది. అందుకే దేశంలోని సాధారణ వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్లను ఎంత సులభంగా స్వీకరించారో చూడటం విదేశీ ప్రతినిధులకు ఆసక్తికరంగా మారుతోంది. భారత్‌లో UPI విజయానికి ప్రధాన కారణం ఈజీగా ఉపయోగించుకునే విధానం. బ్యాంకింగ్ సేవలను ఉపయోగించే వ్యక్తి పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా, QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపు చేయడం సాధ్యం అవుతోంది.
ఒకప్పుడు డిజిటల్ పేమెంట్ల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల వైపు చూసిన భారత్.. ఇప్పుడు తన స్వంత మోడల్ తో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. UPI వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరగడానికి ఇదే ప్రధాన కారణాల్లో ఒకటి. కార్ల తయారీలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న జర్మనీకి చెందిన మంత్రి.. భారతదేశంలోని ఓ చిన్న కూరగాయల దుకాణంలో UPI పేమెంట్ చేసి ఆశ్చర్యపోయారు.
Read Also: కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!