One Plus 13 : చైనా ఆధారిత ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను లాంఛ్ చేస్తుంది. తమ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు స్పెషల్ స్పెసిఫికేషన్స్ ను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కు పోటీ ఇస్తూ ఈ ఏడాది మరో స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేయటానికి రెడీ అయిపోయింది.
ఇక ఈ ఏడాది జనవరిలో లాంఛ్ చేసిన OnePlus 12 కి కొనసాగింపుగా త్వరలోనే OnePlus 13ను తీసుకొచ్చేందుకు వన్ ప్లస్ సన్నాహాలు చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను సంబంధించిన హ్యాండ్‌సెట్, డిస్ ప్లే వివరాలు తాజాగా విడుదల చేసింది.
OnePlus 13 స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి విడుదలకానుంది. ఈ ఫోన్ కీ ఫీచర్స్ ను రిలీజ్ చేస్తూ తాజాగా విడుదల చేసిన టీజర్ స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. బ్యాటరీ కెపాసిటీతో పాటు స్పెసిఫికేషన్స్ సైతం ఇందులో లీక్ అయ్యాయి. ఇక ఈ టీజర్ ను రిలీజ్ చేసిన వన్ ప్లస్ కంపెనీ అధినేత లూయిస్ జీ కీలక విషయాలు వెల్లడించారు.
ఛార్జింగ్ – మాగ్నటిక్ వైర్ లెస్ ఛార్జ్ సపోర్ట్ తో వన్ ప్లస్ 13 రాబోతుంది. ఉడెన్ గ్రెయిన్ ఫోన్ కేస్ సహాయంతో ఛార్జ్ కు సపోర్ట్ చేస్తుందని లూయిస్ జీ వెల్లడించారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్ తో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది.
స్క్రీన్ – OnePlus 12 లో BOE X-సిరీస్ స్క్రీన్ ఉంది. ఇక తాజాగా రిలీజైన OnePlus 13లో BOE X2 ప్యానెల్ ఉంది.
బ్యాటరీ – OnePlus 13 స్మార్ట్ ఫోన్ 100W వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ తో రాబోతుంది. దీని ముందు వెర్షన్ OnePlus 12 100W వైర్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5400mAh బ్యాటరీతో లాంఛ్ అయింది.
ALSO READ : గూగుల్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్.. ఎలా పని చేస్తుంది వివరాలివే!
డిస్ ప్లే – OnePlus 13 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల 2K 10 బిట్ LTPO BOE X2 మైక్రో కర్వ్డ్ OLED డిస్‌ప్లే తో రాబోతుంది.
స్టోరేజ్ – స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌తో పాటు గరిష్టంగా 24 GB RAM, 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కు వన్ ప్లస్ 13 మద్దతు ఇస్తుంది.
కెమెరా – కెమెరా విషయానికి వస్తే 50-మెగాపిక్సెల్ సోనీ LYT-808 ప్రైమరీ సెన్సార్ తో రాబోతుంది. ఇక అల్ట్రా వైడ్ లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో రాబోతుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ కెమెరా యూనిట్‌ను డిజైన్ చేశారు.
ధర – ఇక OnePlus 12 భారత్ లో జనవరి 2024లో లాంఛ్ కాగా… ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 64,999 ఉంది. అయితే ప్రస్తుతం రాబోయే వన్ ప్లస్ మెుబైల్ లో మరిన్ని అధునాతన ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురావటంతో ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.