BigTV English

NTR: రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. ?

NTR: రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. ?

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ల తరువాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించింది. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఎన్నో అంచనాల నడుమ దేవర.. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ ను అందుకున్నా.. కలక్షన్స్ లో మాత్రం రికార్డులు సృష్టించింది. దేవర.. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం చెప్పుకొస్తున్నారు.


నిజం చెప్పాలంటే దేవర రిలీజ్ రోజునే కాదు.. అసలు దేవర సినిమాను మొదలుపెట్టిన రోజు నుంచి ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు. అందులో ముఖ్యమైంది.. రాజమౌళి సెంటిమెట్.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో  సినిమా చేసిన హీరో తదుపరి చిత్రం ఖచ్చితంగా  డిజాస్టర్ టాక్ ను అందుకుంటుంది అనేది ఒక మిత్. అది రుజువు కూడా అయ్యింది కూడా.  నితిన్, రవితేజ, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా జక్కన్న దర్శకత్వంలో చేసిన హీరోలందరూ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయారు. రెండు సార్లు ఎన్టీఆర్ కూడా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేదు.

స్టూడెంట్ నెంబర్ 1 తరువాత  ఎన్టీఆర్ ప్లాప్ ను అందుకున్నాడు.  ఇక యమదొంగ తరువాత కూడా భారీ డిజాస్టర్స్  అందుకున్నాడు. ఇక  ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చే ఏ సినిమా అయినా ఖచ్చితంగా  ప్లాప్ అవుతుంది అని ఇండస్ట్రీ మొత్తం నమ్మింది. దేవర సినిమా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా.. ? లేదా.. ? అనే ఉత్కంఠతోనే సినిమాకు వెళ్ళినవారు లేకపోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇది కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్ – కొరటాల కూడా అనుకోని ఉంటారు. అందుకే దేవర సినిమాను.. కొరటాల ఒక శిలను చెక్కినట్లు చెక్కాడు.


ఎట్టకేలకు దేవర సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. జక్కన్న సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఆ మిక్స్డ్ టాక్ కూడా వచ్చేది కాదు. దీంతో  ఎన్టీఆర్ జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసినట్టే అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇకపోతే దేవర కలక్షన్స్ పెంచడానికి ఎన్టీఆర్ – కొరటాల కొత్త  ట్రిక్ ప్లే చేశారు. సినిమా రిలీజ్ అయ్యాకా కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా సుమతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.  ఆ ఇంటర్వ్యూలో కేవలం.. దేవర సినిమా తరువాత వచ్చిన మీమ్స్ గురించి ఎన్టీఆర్ – కొరటాల రియాక్షన్స్ గురించి సుమ అడుగుతూ వచ్చింది. ఆ మీమ్స్ లో ఎన్టీఆర్.. రాజమౌళి సెంటిమెంట్  బ్రేక్ చేసినట్లు యమదొంగ లోని క్లైమాక్స్ సీన్ కు ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియోను సుమ చూపించింది.

ఎన్టీఆర్ దేవర సినిమా కూడా ప్లాప్ అనుకోని ట్రోలింగ్ కు రెడీ గా ఉన్నట్లు..  పైనుంచి యమపాశం అంటే రాజమౌళి సెంటిమెంట్, నెగిటివిటీ చంపడానికి వస్తుండగా..  ఇక అంతలోనే ఎన్టీఆర్ ను కాపాడడానికి కొరటాల ఇచ్చిన బిళ్ల అంటే దేవర సినిమా.. ఆ సెటిమెంట్ ను బ్రేక్ చేసినట్లు చూపించారు. ఇక పక్కన రాజమౌళి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చూపించారు. ఈ మీమ్ చూసి ఎన్టీఆర్ పగలబడి నవ్వాడు.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ రియాక్షన్ తోనే   ఎన్టీఆర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని అర్థమైపోతుంది.  ఎలాగైతే  దేవరతో ఎన్టీఆర్ ఈ జక్కన్న సెంటిమెంట్ నుంచి బయటపడ్డాడు. మరి ఆ సెంటిమెంట్ నుంచి రామ్ చరణ్ ఎలా బయటపడతాడో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×