E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

OnePlus 13 Price Dropped: అమెజాన్‌లో అరుదైన ఆఫర్.. వన్‌ప్లస్ 13 ఫోన్‌పై ఏకంగా రూ.10వేలు తగ్గింపు .. క్యాష్‌బ్యాక్ కూడా

OnePlus 13 Price Dropped: అమెజాన్‌లో అరుదైన ఆఫర్.. వన్‌ప్లస్ 13 ఫోన్‌పై ఏకంగా రూ.10వేలు తగ్గింపు .. క్యాష్‌బ్యాక్ కూడా
Advertisement

OnePlus 13 Price Dropped: వన్‌ప్లస్ 15 గ్లోబల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే టెక్ ప్రపంచం మొత్తం ఆ ఫోన్ గురించే మాట్లాడుతోంది. గత సంవత్సరం విడుదలైన వన్‌ప్లస్ 13 ఇప్పటికీ తన స్థాయిని కోల్పోలేదు. ఎందుకంటే ఈ ఫోన్‌లో ఉన్న క్వాలిటీ, పవర్, కెమెరా ఔట్‌పుట్, బ్యాటరీ ఇవన్నీ ఇంకా కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్‌పై భారీ ధర తగ్గింపు చూసాక, వన్‌ప్లస్ అభిమానులు తిరిగి ఈ మోడల్ వైపు ఆసక్తి చూపుతున్నారు. లేటెస్ట్ ఫోన్ తప్పనిసరి కాదు అనుకునే వారికి, విలువ కోసం చూసేవారికి వన్‌ప్లస్ 13 ఇప్పుడు పర్‌ఫెక్ట్ ఛాన్స్.

డిజైన్.. పూర్తిగా ప్రీమియం ఫినిష్‌

Advertisement

ఈ ఫోన్‌ను చేతిలో పట్టుకున్న వెంటనే మనకు మొదట కనిపించేది దాని డిజైన్. వన్‌ప్లస్ 13 పూర్తిగా ప్రీమియం ఫినిష్‌తో తయారు చేయబడింది. వెనుక భాగంలో స్మూత్ కర్వ్డ్ గ్లాస్ లుక్, పక్కలలో పాలిష్ చేసిన మెటల్ ఫ్రేమ్, పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఇవన్నీ కలిపి ఫోన్‌కు ఒక రాయల్ లుక్ ఇస్తాయి. చేతిలో పట్టుకున్నా స్లిప్ అవకుండా గట్టి గ్రిప్ ఇస్తుంది. లైట్ వెయిట్ డిజైన్ కావడంతో ఎక్కువసేపు ఉపయోగించినా చేతిలో బరువు అనిపించదు. ఈ ఫోన్ మిడ్‌నైట్ ఓషన్, బ్లాక్ ఎక్లిప్స్, ఆర్క్టిక్ డాన్ అనే మూడు కలర్లలో వస్తుంది. ఈ మూడు రంగులు ఫోన్‌కు రిచ్ స్టేటస్ లుక్ ఇస్తాయి.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌

Advertisement

లోపలి పనితీరు విషయానికి వస్తే దీని పవర్ మరింత ఇంప్రెస్ చేస్తుంది. వన్‌ప్లస్ 13లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 830 గ్రాఫిక్స్ యూనిట్ ఉంది. దాని వల్ల ఏ పని చేసినా స్పీడ్ అద్భుతంగా ఉంటుంది. బిజిఎమ్ఐ, కోడ్, పబ్‌జి లాంటి హెవీ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా ల్యాగ్ లేకుండా, హీట్ ఎక్కువ కాకుండా సూపర్ స్మూత్‌గా నడుస్తాయి. మల్టీటాస్కింగ్, 4కే వీడియో ఎడిటింగ్ వంటి పనులు కూడా స్మూత్‌గా రన్ అవుతాయి.

ఎల్టిపిఒ 4.1 అమోలెడ్ స్క్రీన్ డిస్‌ప్లే

డిస్‌ప్లే ఈ ఫోన్‌లో మరో పెద్ద ఆకర్షణ. వన్‌ప్లస్ 13లో 6.82 ఇంచ్‌ల ఎల్టిపిఒ 4.1 అమోలెడ్ స్క్రీన్ ఉంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ — ఇవి కలిపి సూర్యరశ్మి నేరుగా పడినా కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. వీడియోలు, మూవీస్, గేమింగ్ అన్నిటిలో కలర్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. సిరామిక్ గార్డ్ గ్లాస్ వల్ల స్క్రాచ్‌లు, చిన్న షాక్స్ నుంచీ బలమైన రక్షణ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతూ నాలుగు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది.

Also Read: Jio’s Big 5G Launch: ఓ మై గాడ్.. 7200mAh బ్యాటరీతో జియో ఫోన్ జస్ట్ రూ.1999లకే..

కెమెరా 32 మెగాపిక్సెల్

కెమెరా వైపు చూస్తే వన్‌ప్లస్ 13 ఒక బీస్ట్. వెనుక ట్రిపుల్ కెమెరా కాంబినేషన్‌లో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పిరిస్కోప్ టెలిఫోటో కెమెరా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉన్నాయి. డే లైట్ ఫోటోలు కానీ, నైట్ షాట్స్ కానీ, పోర్ట్రెట్లలో స్కిన్ టోన్స్ కానీ, అన్నీ ప్రొఫెషనల్ లెవెల్ ఔట్‌పుట్ ఇస్తాయి. ముందు కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీలు, వీడియో కాల్స్, రీల్స్ అన్నిటిలో కూడా క్లారిటీ అద్భుతం.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఫోన్ పవర్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. రోజంతా హేవీ యూజ్ చేసినా కూడా పవర్ డ్రెయిన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 100వాట్ల సూపర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందించింది వన్‌ప్లస్. కొన్ని నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయ్యే స్థాయి స్పీడ్.

ధర, ఆఫర్, తగ్గింపు.. ఎలా ఉన్నాయంటే?

వన్‌ప్లస్ 13 మొదట 69,999 రూపాయల ధరతో ఇండియాలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో 63,999 రూపాయలకు లభిస్తోంది. అంటే నేరుగా 10వేల రూపాయల తగ్గింపు. దీనితో పాటు సెలెక్టెడ్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు అదనంగా 4,000 రూపాయల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది అమెజాన్. దాంతో ఫైనల్ ప్రైస్ కేవలం 59,999 రూపాయలు అవుతుంది. మొత్తం చూస్తే లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు 14 శాతం తగ్గింపు. ఇంత ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ ఈ రేంజ్‌లో దొరకడం చాలా అరుదు. ఈ ఆఫర్ ఎప్పటికీ ఉండకపోవచ్చు. కొనాలని నిర్ణయించుకుని ఉంటే మిస్ కాకుండా వెంటనే ఆర్డర్ పెట్టుకుంటే మంచిది.

Related News

ఫోన్లో ఈ 5 యాప్స్ ఉంటే.. మీ బ్యాంక్ అకౌంట్, పత్రాలు సేఫ్!

ఈ పెయింట్ వేస్తే ఇల్లు కూల్ కూల్.. 97% వరకు ఎండను అడ్డుకుంటుందట!

రూ.5వేల బడ్జెట్‌లో స్మార్ట్ బ్యాండ్ కొనాలా? షావోమి vs హానర్.. మధ్య గట్టి పోటీ !

మునుపెన్నడూ లేని బిగ్ స్క్రీన్‌తో ఎంట్రీ ఇవ్వనున్న iQOO 16T.. లీకైన పూర్తి వివరాలు ఇవే!

జెట్ స్పీడ్‌లో ఛార్జ్ చేసే Xiaomi 20,000mAh కాంపాక్ట్ డీల్!

మొబైల్ చార్జింగ్ జెట్ స్పీడ్‌లో ఎక్కాల్సిందే.. రూ.వెయ్యిలోపు టాప్ 5 ఫాస్ట్ చార్జర్స్!

ఒప్పో షాకింగ్ నిర్ణయం.. ఆ ప్రీమియం ఫోన్‌పై ఏకంగా రూ.64,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

నోకియా లవర్స్ గెట్ రెడీ.. 14 ఏళ్ల క్రితం నాటి క్రేజీ ఫోన్ మళ్లీ వస్తోంది, ఫీచర్లు ఇవేనా?

Big Stories

×