Real Names of Indian Actresses:ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..ఈ సినిమాలో హీరోయిన్ తనే అంటగా, మన హీరో సినిమాలో హీరోయిన్ ఆమె అయితే బాగుంటుంది అంటూ హీరోయిన్ ల పేర్లతో మనం మాట్లాడుతుంటాం.అవే వారి పేర్లు అని మనం ఫిక్స్ అయిపోతాం కూడా.కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా స్టేటస్ చూస్తున్న కొంతమంది హీరోయిన్ల అసలు పేర్ల కన్నా మార్చుకున్న పేర్లతోనే ఫేమస్ అయ్యారు.మరింతకీ మారు పేర్లతో ఫేమస్ అయిన ఆ హీరోయిన్స్ ఎవరో ఒక్కసారి చూద్దాం !
రేఖ…
అలనాటి స్టార్ హీరోయిన్ రేఖ విషయానికి వస్తే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎవర్‌గ్రీన్ లెజెండ్‌గా నిలిచిన రేఖ అసలు పేరు భానురేఖ గణేశన్ అన్న సంగతి మీకు తెలుసా. జెమినీ గణేశన్,పుష్పవల్లి జంటకి 1954లో జనించిన రేఖ ఉమ్రావ్ జాన్, ఖూన్ భరీ మాంగ్, సిల్సిలా, ముకద్దర్ కా సికందర్ వంటి క్లాసిక్ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది కూడా.
శ్రీదేవి
ఇక అతిలోక సుందరి శ్రీదేవి విషయానికి వస్తే తనదైన అందంతో ఇండియన్ ఫస్ట్ సూపర్ స్టార్ గా క్రేజ్ కొట్టేసిన శ్రీదేవి పూర్తి పేరు శ్రీ అమ్మ యంగర్ అయ్యప్పన్ అని చాలా మందికి తెలీదు .ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, ఇంగ్లీష్ వింగ్లీష్, మిస్టర్ ఇండియా, చాందినీ, మామ్ సినిమాలతో సత్తా చాటిన ఈ అందాల భామ 2018 పిబ్రవరి 24 న చనిపోయిన సంగతి తెల్సిందే..
నయనతార
ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్ అని ఎంతమందికి తెలుసు.కేరళకు చెందిన నయన్ , సినిమాల్లోకి వచ్చిన తర్వాతే డయానా కాస్తా “నయనతార”గా మారిపోయింది.ఇక తెలుగులో లక్ష్మి, తులసి, అదుర్స్, సింహా, శ్రీరామరాజ్యం సినిమాలతో క్రేజ్ కొట్టేసిన నయన్ రీసెంట్ గా మన శంకర వర ప్రసాద్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాక్సిక్ సినిమాతో మరోసారి అలరించేందుకు రెడీ అయిపొయింది.
అనుష్క శెట్టి..
ఇక దేవసేన గా బాహుబలి సినిమాతో సుపరిచితం అయిన అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి అని చాలా తక్కువ మందికే తెలుసు.మొదట్లో యోగా టీచర్ గా కెరీర్ మొదలెట్టిన ఈ పొడుగు భామ టాలీవుడ్ లోకి సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ హీరోయిన్ దొరికేసింది.ఇక ఈ అమ్మడు చేసిన విక్రమార్కుడు, అరుంధతి, వేదం, రుద్రమదేవి,బాహుబలి,భాగమతి సినిమాలు ఎంత ఫేమస్ అయ్యయో చెప్పక్కర్లేదు.
కియారా అద్వానీ
ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ.అవును ఇండస్ట్రీలో అప్పటికే ఆలియా భట్ ఉండటంతో తన పేరును కియారాగా మార్చుకోమని సల్లూ భాయ్ చెప్పాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కియారా ,ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలకి వస్తే ఎంఎస్ ధోనీ, కబీర్ సింగ్, షేర్షా, భూల్ భులయ్యా 2 సినిమాలతో బాలీవుడ్ లో సత్తా చాటగా తెలుగులో భరత్ అనే నేను,వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించి మంచి మార్కులే కొట్టేసింది .
శిల్పా శెట్టి
ఇక పిల్లి కళ్ళ సుందరి శిల్పా శెట్టి అసలు పేరు ఏంటో తెలుసా..అశ్విని శెట్టి.బాజీగర్, ధడ్కన్, ఫిర్ మిలేంగే, లైఫ్ ఇన్ ఎ మెట్రో వంటి సినిమాలతో బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ చూసిన ఈ భామ తెలుగులో సాహస వీరుడు సాగర కన్య సినిమాలోనూ కనిపించింది కూడా.ఇక సినిమాలని కాస్త తగ్గించిన ఈ అమ్మడు తర్వాత టీవీ షోలు,యోగా , ఫిట్‌నెస్ రంగాలలో కూడా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
మల్లికా షెరావత్
ఇక బాలీవుడ్ హాట్ గా పేరొందిన మల్లికా షెరావత్ అసలు పేరు రీమా లాంబా.బాలీవుడ్ లో ఎన్నో స్పెషల్ సాంగ్స్ తో సత్తా చాటిన మల్లికా మర్డర్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్‌కమ్ వంటి సినిమాలలోనూ నటించి మెప్పించింది.
టబు
ఇక మనకి బాగా సుపరిచితం అయిన టబు అసలు పేరు ‘తబస్సుం ఫాతిమా హష్మీ’ అని చాలా మందికి తెలీదు.ముఖ్యంగా ఈవిడ అక్కినేని నాగ్ తో నిన్నే పెళ్లాడతా సినిమాలో పండించిన కెమిస్ట్రీ ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటారు మూవీ లవర్స్.ఇక ఈవిడ కెరీర్ లో వచ్చిన ఆవిడా మా ఆవిడే, చాంద్నీ బార్, దృశ్యం, అంధాధున్, భూల్ భులయ్యా 2 సినిమాలు టబు ని మరింత లెవెల్ కి తీసికెళ్ళాయి.
కత్రినా కైఫ్
ఇక చికిని చమేలి అంటూ బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన కత్రినా కైఫ్ అసలు పేరు కత్రినా టర్కోట్.ఇండస్ట్రీ లో పిలవడానికి ఈజీగా ఉండేలా ఇంటి పేరులోని కైఫ్ ని అతికించుకోవడంతో అదే పేరు పాపులర్ అయింది.ఇక ఈ అమ్మడు బాలీవుడ్‌లో నమస్తే లండన్, ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, జిందగీ నా మిలేగీ దోబారా, సూర్యవంశీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా నిలిచింది.
సన్నీ లియోన్
ఇక సన్నీ లియోన్ అసలు పేరు కరంజీత్ కౌర్ వోహ్రా.కానీ సన్నీ లియోన్ గానే బాగా పాపులర్ అయింది,ఇక ఆమె ఎంత పాపులరో చెప్పక్కర్లేదు కూడా.సినిమాల విషయానికి వస్తే జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహేలీ లీలా, కెన్నెడీ క్లబ్ వంటి సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో కూడా స్పెషల్ సాంగ్స్ తో , గెస్ట్ రోల్స్ తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెల్సిందే.
ఏది ఏమైనా పేరు మార్చుకోవడం అనేది సినీ ఇండస్ట్రీలో కొత్త విషయం కాదు. చాలా మంది నటీనటులు తమ కెరీర్ ప్రారంభంలోనే తమ పేరు ని మార్చుకున్న వారే.ఎలాంటి కథలు ఎంచుకుంటున్నాం,ఎలా కష్టపడుతున్నాం అన్నదే ఈ ఇండస్ట్రీలో ఫేట్ ని డిసైడ్ చేస్తుంది !
also read :ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా?.. కృతి సనన్ -కబీర్ ఫోటో వైరల్