BigTV English

Rinku Singh – Virat Viral Video: “భయ్యా ఈ బ్యాట్ విరిగింది.. ఇంకో బ్యాట్ ఇయ్యవా”.. వైరల్ అవుతున్న విరాట్ – రింకు సంభాషణ!

Rinku Singh – Virat Viral Video: “భయ్యా ఈ బ్యాట్ విరిగింది.. ఇంకో బ్యాట్ ఇయ్యవా”.. వైరల్ అవుతున్న విరాట్ – రింకు సంభాషణ!

Rinku Singh – Virat Kohli Conversation Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 36వ మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇందులో కనిపించబోతున్న స్టార్స్ ఇప్పటికే తమ చర్యలతో ఆఫ్ ఫీల్డ్‌లో అభిమానులను అలరించడం ప్రారంభించారు.


కోల్‌కతా, బెంగళూరు మ్యాచ్‌కు ముందు ఒక వినోదభరితమైన, ఆసక్తిరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, కోల్‌కతా ఫినిషర్ రింకూ సింగ్ మధ్య ఒక చిన్న సంఘటన జరిగింది. రింకూ సింగ్.. విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి.. భయ్యా ఇంకో బ్యాట్ ఇయ్యవా అంటూ కోహ్లీని అడగటం అభిమానులను అలరించింది. అంతకుముందు కోహ్లీ.. రింకూ సింగ్‌కు ఒక బ్యట్ బహుమతిగా ఇచ్చాడు. రింకూ ప్రాక్టీస్ సెషన్లలో ఆ బ్యాట్‌‌తో స్పిన్నర్లను ఎదుర్కునే క్రమంలో బ్యాట్ విరిగిపోయింది. దీంతో రింకూ సింగ్.. కోహ్లీ దగ్గరకు వచ్చి ఇంకో బ్యాట్ ఇయ్యావా అంటూ అడొగాడు.

“నేనేం చెయ్యాలి ఇప్పుడు.. నాకు ఎలాంటి సమాచారం అక్కర్లేదు అని కొట్టిపారేశాడు. దీంతో చిన్నబోయిన రింకూ సింగ్ ఇంకో బ్యాట్ ఇయ్యవా ఈ సారి విరగ్గొట్టను అంటూ కోహ్లీని అడిగాడు. దీంతో కోహ్లీ రింకూ సింగ్‌ను ఆటపట్టిస్తూ ఇంకో బ్యాట్ ఇస్తే టోర్నమెంట్ తర్వాత దశల్లో మొదటికే మోసం వస్తుంది.. ఇంకో బ్యాట్ ఇవ్వను అని అన్నాడు. దీంతో రింకూ సింగ్ చిన్నబోయాడు.


Also Read: Virat Kohli: అంపైర్ తో వాగ్వాదం.. డస్ట్ బిన్ పై కోపాన్ని చూపించిన విరాట్

ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇప్పడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా మార్చి 29న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రింకూ సింగ్‌కు విరాట్ కోహ్లీ తన బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.

Also Read: RR vs MI IPL 2024 Preview: నెంబర్ వన్ తో హార్దిక్ నిలుస్తాడా? నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్

కాగా ఆదివారం డబుల్ హెడర్‌లో కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో 33 సార్లు తలపడగా.. కేకేఆర్ 19 మ్యాచుల్లో విజయం సాధించగా.. బెంగళూరు 14 మ్యాచుల్లో గెలిచింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×