Recharge Plans : టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) త్వరలోనే కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకురావటానికి సన్నాహాలు చేస్తుంది. వాయిస్, SMS కోసం మాత్రమే రీఛార్జ్ వోచర్‌ను జారీ చేయాలని టెలికాం సంస్ధలను ఆదేశించింది.
మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు డేటాను ఉపయోగించని వినియోగదారుల కోసం వాయిస్ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లతో ప్రత్యేక ప్లాన్‌ను జారీ చేయాలని టెలికాం రెగ్యులేటర్ (ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ప్రత్యేక రీఛార్జ్ కూపన్‌లపై 90 రోజుల పరిమితిని తొలగించి, దానిని 365 రోజుల వరకూ పొడిగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ నిబంధనలను అమలు చేయాలని తెలుపుతూ టారిఫ్ నిబంధనలను సవరించింది.
ఈ రూల్స్ త్వరలోనే అమలు చేయాలని ట్రాయ్ టెలికాం సంస్థలకు తెలిపింది. ఇక ఈ రూల్స్ తో ఉపయోగించిన సేవలకు మాత్రమే చెల్లింపులు ఉంటాయని తెలుస్తుంది. సబ్ స్క్రైబర్స్ సౌకర్యార్థం ఈ సేవలను తీసుకొస్తున్నట్టు తెలిపిన ట్రాయ్.. డేటా అవసరం లేని యూజర్లు అనవసరంగా చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ముఖ్యంగా ఈ ఫీచర్ కీ పాడ్ మొబైల్ వాడే యూజర్స్ తో పాటు వృద్ధులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.
ఇప్పటి వరకూ ప్రముఖ టెలికాం సంస్థలు వాయిస్ కాల్స్ తో పాటు మెసేజ్ డేటా సదుపాయంతో ఉన్న ప్లాన్స్ ని మాత్రమే అందిస్తున్నాయి. డేటా అవసరం లేని యూజర్స్ కోసం ఎలాంటి ప్రత్యేక ప్లాన్స్ లేవు. ప్రతీ ప్లాన్ మినిమం రూ. 200 ఉండటంతో డేటా ఉపయోగించని యూజర్స్ సైతం మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫీచర్ ఫోన్ మాత్రమే వాడుతున్న వారికి, డేటా అవసరం లేకపోయినా ఈ రీఛార్జ్ ప్లాన్ చేసి నష్టపోతున్నారు. ఇక రెండు సిమ్ కార్డ్స్ వాడే వాళ్ల పరిస్థితి సైతం ఇలాగే ఉండటంతో ట్రాయ్ ఈ రూల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అవసరం లేకుండా ఉన్న నెంబర్ సైతం యాక్టివ్ గా ఉండటం కోసం రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాల్సి వస్తే పూర్తి రీఛార్జ్ చేయాల్సి వస్తుందని ట్రాయ్ తెలిపింది. ఇలాంటి ఇబ్బందులు అన్నింటినీ తొలగించేందుకు.. ఈ సరికొత్త ప్లాన్స్ ఉపయోగపడతాయని.. తక్కువ ధరతోనే రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పుకొచ్చింది. ఈ స్పెషల్ రీఛార్జ్ కూపన్స్ కు 90 రోజుల పరిమితిని తొలగిస్తూ.. 365 రోజులకు పొడిగించింది ట్రాయ్. దీంతో ప్రతీసారి రీఛార్జ్ చెయ్యాల్సిన అవసరం ఉండదని తెలిపింది.
ఈ రీఛార్జ్ ప్లాన్స్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపిన ట్రాయ్.. విలువైన రీఛార్జ్ ప్లాన్స్ తో పాటు కస్టమర్స్ సదుపాయంకు తక్కువ ధరకే రీఛార్జ్ కూపన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పుకొచ్చింది. రీఛార్జ్ ఓచర్స్ సైతం అందుబాటు ధరల్లోనే తీసుకురావాలని, తమకు నచ్చిన ధరల్లో వోచర్స్ తీసుకొచ్చే అవకాశం టెలికాం సంస్థలకు ఉన్నప్పటికీ కష్టమర్స్ సదుపాయం నడుచుకోవాలని వెల్లడించింది. అయితే ట్రాయ్ తెచ్చిన ఈ నిబంధనలు యూజర్స్ కు మరింతగా ఉపయోగపడేలా ఉన్నాయి. అయితే ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో మాత్రం తెలియాల్సి ఉంది.
ALSO READ : ఐఫోన్ 18 ప్రో కెమెరా ఫీచర్స్ లీక్.. ఎపార్చర్ కెమెరా ఇంకా!