MS Dhoni: భారత క్రికెట్ లోని దిగ్గజ ఆటగాళ్లలో మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కూడా ముందు వరుసలో ఉంటాడు. భారత జట్టుకు కెప్టెన్ గా ధోని మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం సహా ఎన్నో అద్భుత విజయాలను జట్టుకు అందించాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక మహేందర్ సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను కేవలం గ్రౌండ్ లో కనబడితే చాలు అని ఎదురుచూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.
Also Read: Watch Video: మరోసారి మంచి మనసు చాటుకున్న రిషబ్ పంత్
అయితే తాజాగా ఓ వివాదంతో వార్తల్లో నిలిచాడు ఈ ఝార్ఖండ్ డైనమేట్. మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వ అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ ముండా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధోనీకి రాంచీలోని హర్మ్ హౌసింగ్ కాలనీలో 10,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో ధోని ఎంతో విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ధోని ఈ ఇంటిని కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్నాడని ఆరోపణలు వచ్చాయి.
రాంచీలోని హర్మ్ రోడ్ లో ఉన్న ధోని ఇంట్లో డయాగ్నోస్టిక్స్ సెంటర్ ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ భూవివాదం విషయంలో గతంలోనే ధోని వార్తల్లోకి వచ్చాడు. 2017 నవంబర్ నెలలోనే ధోనీకి నోటీసులు జారీ అయ్యాయి. కానీ అధికారులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. భూ కేటాయింపు సక్రమంగా జరగలేదనే నేపథ్యంలో గతంలో ధోనీకి నోటీసులు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కేటాయించిన ఆ భూమిలో ధోని ఇంటి నిర్మాణం చేసి.. కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్నాడనే ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఈ ఆరోపణలపై హౌసింగ్ బోర్డుకి ఫిర్యాదు వెళ్లడంతో జార్ఖండ్ హౌసింగ్ బోర్డ్ ధోనిని వివరణ కోరింది. ఆ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ ఫ్లాట్ లను వాణిజ్య అవసరాల కోసం వాడకూడదు. ఏదైనా సందర్భంలో అలా చేస్తే చట్ట విరుద్ధంగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ సంజయ్ లాల్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ఈ చర్య పై విచారణ ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కమర్షియల్ అవసరాలకు వాడుతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: Ben Stokes Injury: ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ జట్టు నుంచి ఔట్
అయితే ధోని ప్రస్తుతం ఈ ఇంట్లో నివసించడం లేదు. కొన్ని సంవత్సరాలుగా సిమాలియాలోని రింగ్ రోడ్ లో ఉన్న వారి భారీ ఫామ్ హౌస్ లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ ఫామ్ హౌస్ పేరు కైలాసపతి. ఈ ఫామ్ హౌస్ ఏడు ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, జిమ్ ఇలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. మన టీమ్ ఇండియా క్రికెటర్లు ఎక్కువమంది కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫామ్ హౌస్ అందాలను ఆస్వాదిస్తారు.