Oppo Enco Air5Pro: మ్యూజిక్ లవర్స్‌కు ఒప్పో బ్రాండ్ ఇయర్‌బడ్స్ అంటే.. ఎప్పుడూ ఒక క్రేజీ నమ్మకం. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ‘Oppo Enco Air 5 Pro’ ఆ నమ్మకాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. తక్కువ బడ్జెట్‌లో.. ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ప్రీమియం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ , అదిరిపోయే బేస్,అల్ట్రా-లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను ఇది అందిస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ ఇయర్‌బడ్స్ పూర్తి రివ్యూ, ఫీచర్లు, వాటి ధర వివరాలు.
ఈ రోజుల్లో మార్కెట్లో వందలాది ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ దొరుకుతున్నాయి. కానీ రూ.5,000 బడ్జెట్‌లో టాప్-క్లాస్ ఆడియో క్వాలిటీ , పవర్‌ఫుల్ ఫీచర్లు ఇచ్చే డివైజ్‌లు చాలా తక్కువ. ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ప్రో ఆ గ్యాప్‌ను పర్ఫెక్ట్‌గా భర్తీ చేసింది. ‘ప్యూర్ వాల్యూ, నో కాంప్రమైజ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్ నిజంగానే.. వాల్యూ ఫర్ మనీ అనిపిస్తున్నాయి.
1.డిజైన్ అండ్ కంఫర్ట్ :
ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ప్రో కేస్ చూడటానికి చాలా ప్రీమియంగా, గులకరాయి లాగా స్లీక్ గా ఉంటుంది. ఇయర్‌బడ్స్ విషయానికి వస్తే.. ఇవి ‘ఇన్-ఇయర్’ డిజైన్‌తో వస్తాయి. చాలా తేలికగా ఉండటం వల్ల గంటల తరబడి చెవుల్లో పెట్టుకున్నా అసలు నొప్పే తెలియదు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు లేదా రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇవి చెవుల నుంచి అస్సలు జారిపోవు.
2.ఆడియో క్వాలిటీ :
ఈ ఇయర్‌బడ్స్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్. సాధారణంగా ఈ ఫీచర్ రూ.10,000 పైబడిన ప్రీమియం ఇయర్‌బడ్స్‌లో ఉంటుంది. దీని వల్ల పాటల్లోని ప్రతి చిన్న మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా వినబడుతుంది. బేస్ చాలా పంచీగా, డీప్‌గా ఉంటుంది. మీరు మెలోడీలు విన్నా లేదా హై-బీట్ సాంగ్స్ విన్నా థియేటర్ లాంటి త్రిల్ ఇస్తుంది. ఇది హై-రెజ్, ఆడియో, LDAC కోడెక్ సపోర్ట్‌తో వస్తుంది.
3.నెక్స్ట్ లెవెల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ :
మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నా లేదా ఆఫీస్ క్యాబిన్‌లో ఉన్నా.. బయట వచ్చే గోల ఏదీ మీకు వినబడకుండా చేయడంలో దీని 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు ‘ట్రాన్స్‌పరెన్సీ మోడ్’ కూడా ఉంది. దీని వల్ల ఇయర్‌బడ్స్ తీయకుండానే పక్కనున్న వారితో ఈజీగా మాట్లాడవచ్చు.
4.కాలింగ్ , గేమింగ్ ఎక్స్‌పీరియన్స్:
ఇందులో మూడు మైక్రోఫోన్లు,ఏఐ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ ఉంది. ట్రాఫిక్‌లో ఉండి కాల్స్ మాట్లాడినా అవతలి వ్యక్తికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వెళ్తుంది. ఇక గేమర్స్ కోసం ఇందులో అల్ట్రా-లో లేటెన్సీ మోడ్ ఇచ్చారు. పబ్‌జీ లేదా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు గన్ సౌండ్స్, ఫుట్‌స్టెప్స్ ఏమాత్రం లాగ్ లేకుండా ఇన్‌స్టంట్‌గా వినబడతాయి.
Also Read: ఫిలిప్స్ బ్లూటూత్ సౌండ్‌బార్.. తక్కువ బడ్జెట్‌లో ఇల్లే సినిమా థియేటర్!
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కేస్‌తో కలిపి ఇది ఏకంగా 38 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ ఇస్తుంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, సుమారు 4 నుంచి 5 గంటల పాటు పాటలు వినవచ్చు. దీనికి IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది. కాబట్టి చెమట లేదా చిన్నపాటి వర్షపు చినుకులకు ఇది అస్సలు పాడవదు.
ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ప్రో (Oppo Enco Air 5 Pro) మార్కెట్లో సుమారుగా రూ.4,999 బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ , ఒప్పో స్టోర్లలో బ్యాంక్ ఆఫర్లు లేదా సేల్ డిస్కౌంట్లు ఉన్నప్పుడు ఇది రూ.4,000 లోపే లభించే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది కళ్ళు మూసుకుని కొనేయగల బెస్ట్ ఆప్షన్.