Best top load washing machine under 20000: ఇంట్లో బట్టలు ఉతకడం పెద్ద టాస్క్.. దానికి తోడు కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు తలుచుకుంటేనే గుండె గుభేల్ మంటుంది! అందుకే తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ నీటిని ,కరెంట్ ను ఆదా చేసే స్మార్ట్ వాషింగ్ మెషీన్ల వైపు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతున్నారు. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఇళ్లకు వాషింగ్ మెషీన్ అనేది లగ్జరీ కాదు, ఒక నిత్యావసర వస్తువు. అయితే వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే చూస్తే సరిపోదు. అది ఎంత కరెంట్ కాలుస్తుంది, ఎన్ని నీళ్లను వాడుకుంటుంది అనేది కూడా లెక్క వేసుకోవాలి. ప్రస్తుతం కస్టమర్లు ఎక్కువ రేటింగ్, తక్కువ వాటర్ ఖర్చు చేసే మోడల్స్ కోసమే ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు. రూ.20వేల బడ్జెట్ లో అమెజాన్‌లో లభిస్తున్న బెస్ట్ ఎనర్జీ & వాటర్ సేవింగ్ టాప్-లోడ్ వాషింగ్ మెషీన్లు ఇవే..
ఎల్‌జీ బ్రాండ్ హోమ్ అప్లయన్స్ మార్కెట్లో నంబర్ వన్. ఈ మోడల్‌లో స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది. ఇది బట్టల బరువుకు తగ్గట్టుగా మోటార్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీని వల్ల కరెంట్ 36% వరకు ఆదా అవుతుంది. దీని ప్రత్యేకతలు 5 స్టార్ రేటింగ్, స్మార్ట్ మోషన్, టర్బో డ్రమ్. అంతే కాకుండా ఇది చాలా తక్కువ నీటిని వాడుకుంటుంది. దీని ధర సుమారు రూ. 18,990 వరకు ఉంటుంది.
శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఎకో బబుల్ టెక్నాలజీ ఒక సంచలనం. ఇది డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి బట్టల్లోకి వేగంగా చొచ్చుకుపోయేలా చేస్తుంది. దీని వల్ల చల్లటి నీటిలో కూడా బట్టలు తెల్లగా మెరుస్తాయి.డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ (20 ఏళ్ల వారంటీ), సూపర్ ఎనర్జీ సేవింగ్, సాఫ్ట్ క్లోజింగ్ డోర్ వంటి ప్రత్యేకతలు దీనిలో ఉంటాయి. అంతే కాకుండా ధర సుమారు రూ.18,490 వరకు ఉంటుంది.
ఎక్కువ మంది ఉన్న కుటుంబానికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో హార్డ్ వాటర్ వాష్ ఫీచర్ ఉంది. మన ఇళ్లల్లో వచ్చే బోరు నీటిలో కూడా డిటర్జెంట్ బాగా కరిగేలా చేసి బట్టలను క్లీన్ చేస్తుంది. స్మార్ట్ సెన్సార్లు (నీటిని, డిటర్జెంట్‌ను ఆటోమేటిక్‌గా లెక్కిస్తాయి), జీరో ప్రెజర్ ఫిల్ టెక్నాలజీ (తక్కువ వాటర్ ప్రెజర్ ఉన్నా నడుస్తుంది) వీటి ప్రత్యేకతలు.
ధర రూ.16,990 వరకు ఉంటుంది.
తక్కువ ధరలో లేటెస్ట్ ఏఐ ఫీచర్లు కావాలనుకుంటే గోద్రేజ్ బెస్ట్ ఆప్షన్. దీనిలోని స్మార్ట్ వాష్ టెక్నాలజీ బట్టల బరువును బట్టి సరైన వాటర్ లెవెల్‌ను తానే సెలెక్ట్ చేసుకుంటుంది. దీని వల్ల చుక్క నీరు కూడా వృథా కాదు. వీటి ప్రత్యేకతలు గరిష్టంగా నీటి పొదుపు, ఐ-వాష్ టెక్నాలజీ, టఫ్ అండ్ స్ట్రాంగ్ గ్లాస్ లిడ్.దీని ధర సుమారు రూ.14,990 వరకు ఉంటుంది.
Also Read: పోర్ట్రానిక్స్ బ్రీజ్ 4 పై భారీ ఆఫర్! కేవలం రూ.1,149 కే మైక్‌తో.. బ్లూటూత్ స్పీకర్
పానాసోనిక్ వాషింగ్ మెషీన్లు వాటి లాంగ్ లైఫ్ , అద్భుతమైన క్లీనింగ్‌కు పేరుగాంచాయి. దీనిలోని ఆక్వా స్పిన్ రిన్స్ టెక్నాలజీ వల్ల బట్టలు పిండేటప్పుడు నీటి వాడకం దాదాపు 28% వరకు తగ్గుతుంది. ఆక్వా బీట్ వాష్, వన్-టచ్ స్మార్ట్ వాష్, కరెంట్ ఆదా చేసే ఇన్వర్టర్ మోటార్ వంటి ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. ధర సుమారు రూ.15,990 వరకు ఉంటుంది.
మీరు వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు మీ ఇంట్లో ఉండే వాటర్ క్వాలిటీ (సాఫ్ట్ వాటరా లేదా హార్డ్ వాటరా), ఫ్యామిలీ సైజును బట్టి పైన పేర్కొన్న వాటిలో బెస్ట్ మోడల్‌ను అమెజాన్ డీల్స్ లేదా కార్డ్ ఆఫర్ల ద్వారా మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.