Nita Ambani-kohli Water: టీమిండియా వన్డే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని నీతా అంబానీ ఫాలో అవుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ తాగే బ్రాండ్ కు సంబంధించిన మంచినీళ్లనే నీతా అంబానీ తాగుతున్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ నిత్యం తాగే ఏవీఎన్ న్యాచురల్ మినరల్ వాటర్ (Evian natural Mineral still water) బ్రాండుకు సంబంధించిన బాటిల్ నీతా అంబానీ చేతిలో కనిపించింది. దీంతో మంచినీళ్ల విషయంలో విరాట్ కోహ్లీని అంబానీ ఫ్యామిలీ ఫాలో అవుతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు ఈ మంచినీళ్లకు వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రచారం చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ బ్రాండ్ ఇవియాన్ నీళ్లనే నీతా అంబానీ తాగుతున్నట్టు వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని తెలుస్తోంది. ఇవియాన్ వాటర్ తాగినట్టు ఎలాంటి రుజువులు లేవని తెలుస్తోంది. కావాలనే కొంత మంది విరాట్ కోహ్లీ అభిమానులు ప్రచారం చేస్తున్నారని సమాచారం. గతంలో మిగతా నీతా ఆక్వా డి క్రిస్ట్లో ట్రిబ్యుటో అనే బంగారు వాటర్ బాటిల్ ద్వారా మంచి నీళ్లను తాగే వారని చెబుతుంటారు. ఆ వాటర్ బాటిల్ ధర దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మ్యాచులు జరిగేటప్పుడు ఆ బంగారు వాటర్ బాటిల్ లోనే నీతా అంబానీ మంచినీళ్లను తాగుతారని సమాచారం అందుతోంది. కానీ అందులో ఖరీదైన వాటర్ ఏమీ ఉండదని సమాచారం. లీటర్ కు 700 రూపాయలకు దొరికే మంచినీళ్లను అంబానీ ఫ్యామిలీ తాగుతున్నట్టు తెలుస్తోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి నుంచి ఇవియాన్ మంచినీళ్లను తాగుతున్నాడు. ఈ నీళ్లు తాగితే చాలా ఫిట్ గా ఉంటారు. ఈ నీళ్లను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేస్తోంది భారత్. ఇండియాలో ఈ వాటర్ బాటిల్ లీటర్ ధర 600 రూపాయల వరకు ఉంటుంది. కానీ కొంత మంది విరాట్ కోహ్లీ తాగే ఇవియాన్ వాటర్ కు లక్షల్లో ధర ఉంటుందని కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు.
ఇవియాన్ వాటర్ ఎక్కువగా సెలబ్రిటీలు, క్రీడాకారులు మాత్రమే తాగుతూ ఉంటారు. ఈ నీళ్లు ఫ్రాన్స్ లోని ఆల్ప్స్ పర్వతాల మంచు కరగడం ద్వారా లభిస్తుందని సమాచారం. భూమి పొరల నుంచి 15 సంవత్సరాల పాటు సహజంగా ఫిల్టర్ కావడంతో దీనికి ప్రత్యేకమైన ఖనిజ లవణాలు రుచి లభిస్తాయని నివేదికలు చెబుతున్నాయి. అందుకే దీన్ని లగ్జరీ బ్రాండ్ కింద చేర్చారు.