E-Paper
Advertisement

రోహిత్ పై ప్రశంసల కురిపించిన శివాజీ.. ఎలిమినేషన్ పై రియాక్షన్?

రోహిత్ పై ప్రశంసల కురిపించిన శివాజీ.. ఎలిమినేషన్ పై రియాక్షన్?
Advertisement

Bigg boss Buzz:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ప్రేమలు, ఒకరినొకరు తిట్టుకోడాలు అన్నీ కూడా షోపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాంటి ఈ బిగ్ బాస్ సీజన్ 10 లో విజేతగా నిలుస్తాడు అనుకున్న రోహిత్ నాయుడు (Rohit Naidu) అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడంతో నెట్టింట బిగ్ బాస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అక్కడ హోస్ట్ అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్స్ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే గత రెండు సీజన్లుగా బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న శివాజీ.. తనదైన మాట తీరుతో కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తుంటారు. అంతేకాదు బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే కంటెస్టెంట్స్ సైతం భయపడేలా వాతావరణం సృష్టిస్తున్నాడు అంటూ కూడా కొంతమంది విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అలాంటి శివాజీ తొలిసారి రోహిత్ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయన ఎలిమినేషన్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శివాజీ రోహిత్ కోసమే బిగ్ బాస్ షో చూశారా?

బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న శివాజీ (Sivaji) తొలిసారి రోహిత్ కోసమే బిగ్ బాస్ 24×7 కార్యక్రమం చూస్తున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలాంటి రోహిత్ ఎలిమినేట్ అవ్వడం నిజంగా బాధాకరమే. ఇకపోతే ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ కి వచ్చిన రోహిత్ ని చూసి శివాజీ మాట్లాడుతూ.. “బిగ్ బాస్ మనకి 2 వీక్స్ ఇచ్చింది. లాస్ట్ వీక్ కూడా సేమ్ ప్రక్రియ కదా జరిగింది. నేను ప్రతి ఒక్క ఎపిసోడ్ ను నాకు షూటింగ్ లేని ప్రతిరోజు 24×7 చూస్తాను. అయితే ఈ సీజన్ చూడడం స్టార్ట్ చేసింది కూడా నీకోసమే.. నేను నా మనసులో నుండి చెబుతున్నాను. నీకోసమే నేను బిగ్ బాస్ ఈ సీజన్ చూడడం మొదలుపెట్టాను” అంటూ తెలిపారు శివాజీ.

Advertisement

also read:స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

రోహిత్ మైండ్ సెట్ పై శివాజీ ప్రశంసలు..

అలాగే రోహిత్ ఆట గురించి మాట్లాడుతూ.. మొదటి మూడు వారాలు నువ్వు మాట్లాడిన తీరు, చక్కటి క్లారిటీ, పాయింట్ పెట్టే విధానం, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఊహించి చెప్పే నీ మైండ్ సెట్.. ఇవన్నీ కలిసిన ఒక రోహిత్ ని చూసి టాప్ ఫైవ్ కాదు టాప్ వన్ లో ఉండే రకం అని ఊహించిన వాళ్లలో బహుశా నేను మొదటి వాడినేమో అంటూ రోహిత్ పై తనకున్న ఎక్స్పెక్టేషన్స్ ను నిర్మొహమాటంగా బయటపెడుతూ.. తొలిసారి పాజిటివ్ గా స్పందిస్తూ శివాజీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా శివాజీ లాంటి వారి చేతే రోహిత్ ప్రశంసలు అందుకున్నారు అంటే.. ఇక ఆయనది అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదు అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

8 వారాలకు గానూ రోహిత్ రెమ్యూనరేషన్ ఎంత? ఎలిమినేషన్ కి అసలు కారణం?

అరియానాకు పెళ్లి అయ్యిందా..? వీడియోతో ట్విస్ట్ ఇచ్చిందిగా సామి..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. రామరాజు పరిస్థితి ఏంటి..?

Illu Illalu Pillalu Today Episodes: అంజలికి టెన్షన్.. ప్రేమ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వల్లికి ఘోర అవమానం..

Karthika Deepam 2 Serial Today Episode November 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ప్లాన్ సక్సెస్ – కష్టాల్లో దీప, కార్తీక్    

Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..

Brahmamudi Serial Today Episode November 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లిన రాజుతో ఇందు ఏం చెప్పిందో తెలుసా..?  

Big Stories

Advertisement
×