Vivo X500: వివో నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న ఎక్స్500 సిరీస్‌పై ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు తాజాగా లీక్ అయ్యాయి. డెమో యూనిట్‌లోని అబౌట్ ఫోన్ స్క్రీన్‌షాట్‌గా చెబుతున్న వివరాల ప్రకారం.. ఎక్స్500లో భారీ 7,500mAh బ్యాటరీతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9600ఎం చిప్‌సెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
Vivo X500లో 7,500mAh బ్యాటరీ ఉండనుందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. ఇంత పెద్ద బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో పనితీరుతో పాటు బ్యాటరీ బ్యాకప్‌కు కూడా యూజర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 7,500mAh బ్యాటరీ ఉంటే రోజువారీ వాడకంలో తరచుగా ఛార్జర్ పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా గేమింగ్, వీడియోలు చూడటం, సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు.
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9600M చిప్ ఉండనుందని తాజా లీక్‌లు చెబుతున్నాయి. ఈ చిప్‌ను Dimensity 9500కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. రెండు చిప్‌ల గరిష్ఠ క్లాక్ స్పీడ్ 4.21GHzగా ఉంటుందని సమాచారం. దీంతో పేరులో మార్పు ఉన్నప్పటికీ పనితీరులో పెద్ద తేడా ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే Vivo ఈ చిప్‌ను ఫోన్‌లో ఎలా ట్యూన్ చేస్తుందనే దానిపై అసలు పనితీరు ఆధారపడి ఉంటుంది.
Also Read: ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్ పక్కన ఈ చిన్న హొల్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?
లీక్ అయిన డెమో యూనిట్‌లో 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్టోరేజ్‌తో యాప్‌లు, గేమ్స్, ఫొటోలు, వీడియోలను ఎక్కువగా సేవ్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు. అలాగే ఫోన్‌లో Vivo V3+ కస్టమ్ ISP ఉండనుందని సమాచారం. ఇది కెమెరా ఫొటోలు, వీడియోల ప్రాసెసింగ్‌ను మెరుగుపరచడంలో ఉపయోగపడే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే OriginOS 7తో ఫోన్ వచ్చే అవకాశం ఉంది.
Vivo X500 సిరీస్‌ను సెప్టెంబర్ 21న చైనాలో విడుదల చేయనున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. చైనా లాంచ్ తర్వాత భారత్, యూరప్ వంటి మార్కెట్లలో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ధర, కెమెరా స్పెసిఫికేషన్లు, ఛార్జింగ్ స్పీడ్ వంటి వివరాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం డెమో యూనిట్, లీక్‌ల ఆధారంగానే ఉంది. కాబట్టి.. వివో అధికారికంగా ప్రకటించే వరకు వీటిని ఖచ్చితమైన స్పెసిఫికేషన్లుగా భావించకపోవడం మంచిది.
మొత్తంగా చూస్తే.. 7,500mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వంటి ఫీచర్లు నిజమైతే Vivo X500 మంచి ప్యాకేజీగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో ఈ ఫోన్ ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చు. అయితే ఇంత పెద్ద బ్యాటరీ కారణంగా ఫోన్ బరువు, మందం ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కంపెనీ అధికారిక వివరాలు వెల్లడించిన తర్వాతే వివో X500 పూర్తి స్పెసిఫికేషన్లు, ధరపై స్పష్టత వస్తుంది.
Also Read: గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్ అప్లోడింగ్ చాలా స్లోగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చూసి చూడండి!