E-Paper
Advertisement

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్
Advertisement

Orient Ecotech Volt BLDC Ceiling fan: ఎండాకాలంలోనే కాదు, ఎప్పుడైనా సరే సడన్‌గా కరెంట్ పోతే పడే ఇబ్బందిని మాటల్లో చెప్పలేం. ఇంకా ఇంట్లో ఇన్వర్టర్ లేకపోతే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. అయితే.. ఈ సమస్యకు ఓరియంట్ ఎలక్ట్రిక్ సంస్థ ఒక అదిరిపోయే సొల్యూషన్ తెచ్చింది. ఏకంగా ఇన్-బిల్ట్ బ్యాటరీతో, కరెంట్ పోయినా 10 గంటల పాటు గాలి నిచ్చే సరి కొత్త ‘Orient Ecotech Volt’ BLDC సీలింగ్ ఫ్యాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.4,594 ధరతో మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ ఫ్యాన్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి వివరాలు:

1.ఇన్-బిల్ట్ బ్యాటరీతో 10 గంటల బ్యాకప్:

ఈ ఫ్యాన్ స్పెషల్ అట్రాక్షన్ ఇందులో ఉండే ఇంటిగ్రేటెడ్ రీఛార్జబుల్ బ్యాటరీ. సాధారణంగా కరెంట్ పోతే.. ఫ్యాన్ ఆగిపోతుంది. కానీ ఈ ఫ్యాన్‌లో ఆ సమస్య ఉండదు. పవర్ కట్ అయినప్పుడు ఎలాంటి ఎక్స్‌టర్నల్ ఇన్వర్టర్ సపోర్ట్ లేకుండానే.. ఇది ఆటోమేటిక్‌గా బ్యాటరీ సాయంతో తిరుగుతుంది. తరచూ పవర్ కట్ సమస్యలు ఉండే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.  ఫ్యాన్‌ను స్పీడ్ 1 లో రన్ చేసినప్పుడు ఏకంగా 10 గంటల వరకు కూలింగ్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ బ్యాటరీ 500 ఛార్జ్ సైకిల్స్ పూర్తయినా సరే దాదాపు 80 శాతం వరకు పర్ఫెక్ట్‌గా పని చేస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి కంపెనీ ఫ్యాన్‌పై 3 సంవత్సరాల వారంటీ ఇస్తుండగా.. బ్యాటరీకి ప్రత్యేకంగా 1 సంవత్సరం వారంటీ ఇస్తోంది.

2. పవర్‌ఫుల్ 28W BLDC మోటార్‌:

Advertisement

ఇది కేవలం బ్యాటరీ ఫ్యాన్ మాత్రమే కాదు.. కరెంట్ బిల్లును భారీగా తగ్గించే హై-ఎండ్ 28W BLDC మోటార్‌తో వస్తుంది. సాధారణ ఫ్యాన్లతో.. పోలిస్తే ఇది దాదాపు 50 శాతం వరకు తక్కువ కరెంట్ తో పనిచేస్తుంది. అంతే కాకుండా.. ఇది 120V నుంచి 280V వరకు ఉండే.. వైడ్ వోల్టేజ్ రేంజ్‌లో కూడా చాలా ఈజీగా ఆపరేట్ అవుతుంది. ఒక వేళ మీ ఇంటికి ఇప్పటికే ఇన్వర్టర్ ఉన్నప్పటికీ.. ఈ బ్యాటరీ ఫ్యాన్‌ను వాడటం ద్వారా ఇన్వర్టర్ పై పడే భారాన్ని తగ్గించి, ఇతర పెద్ద గ్యాడ్జెట్లకు పవర్ సేవ్ చేసుకోవచ్చు. ఫలితంగా కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. మీ డబ్బు కూడా దీని ద్వారా  మీరు చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు.

Also Read: నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్.. భారీ డిస్కౌంట్‌లో హైయర్ స్మార్ట్ టీవీ

3.స్టైలిష్ లుక్, కలర్ ఆప్షన్స్:

Advertisement

సాధారణ ఇన్‌వర్టర్ ఫ్యాన్లు లేదా పాత మోడల్స్ చూడటానికి అంతగా బాగోవు. కానీ ఓరియంట్ ఎలక్ట్రిక్ ఈ ఫ్యాన్‌ను చాలా మోడర్న్ లుక్‌లో.. డిజైన్ చేసింది. ఇది మీ ఇంటీరియర్‌కు సరిగ్గా సరిపోయేలా గ్లేసియర్ గ్రే , వైట్ ..రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

తరచూ కరెంట్ పోయే సమస్యతో ఇబ్బంది పడే వారికి, కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనుకునే వారికి ఓరియంట్ ఎలక్ట్రిక్ తెచ్చిన ఈ కొత్త ఫ్యాన్ ఒక అద్భుతమైన గ్యాడ్జెట్. రూ.4,594 బడ్జెట్‌లో.. 10 గంటల బ్యాటరీ బ్యాకప్ , ఎనర్జీ సేవింగ్ ఫీచర్లు కోరుకునేవారు దీన్ని ధైర్యంగా కొనొచ్చు.

Related News

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

బెస్ట్ మోడల్ ఇయర్ బడ్స్..ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే!

నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్.. భారీ డిస్కౌంట్‌లో హైయర్ స్మార్ట్ టీవీ

పైసా ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్.. Jio, Airtel, Vi లో.. చౌకైన ఓటీటీ ప్లాన్స్ ఇవే!

Big Stories

Advertisement
×