E-Paper
Advertisement

తెలుగు రానోళ్లతో తెలుగు బిగ్‌బాస్ ఆడిషన్స్ ఏంటి భయ్యా? నిఖిల్ ఫైర్!

తెలుగు రానోళ్లతో తెలుగు బిగ్‌బాస్ ఆడిషన్స్ ఏంటి భయ్యా? నిఖిల్ ఫైర్!
Advertisement

Bigg Boss Auditions:బిగ్‌బాస్ సీజన్ 10, ‘అగ్నిపరీక్ష’ ఆడిషన్స్‌ వ్యవహారం ఇపుడు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. కామన్ మ్యాన్ కేటగిరీ కింద బిగ్‌బాస్ ఆడిషన్స్‌లో పాల్గొన్న నిఖిల్, సెలక్షన్ ప్రాసెస్ వెనుక జరిగిన అన్యాయాలు మరియు నిర్వాహకుల వైఖరిపై సెన్సేషన్ కామెంట్స్ చేశాడు.

నవదీప్, శ్రీముఖి, బిందు మాధవి, అభిజిత్ వంటి ప్రముఖులు జడ్జీలుగా వ్యవహరించిన ఈ ఆడిషన్లలో అసలేం జరిగింది, కామన్ మ్యాన్‌కు నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ దొరుకుతుందా లేక ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంటా అనే నిజాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

తీవ్ర నిరాశకు గురిచేసిన ప్రాసెస్ 

Advertisement

ఈ అగ్నిపరీక్ష సీజన్ ఆడిషన్స్ కోసం వేలాది మంది నెటిజన్లు అప్లై చేసుకోగా, దాదాపు 200 మందికి పైగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి చాలా రకాలుగా ఆడిషన్స్ నిర్వహించిన సంగతి తెల్సిందే.
అయితే, లోపల జరిగిన ప్రాసెస్ తీవ్ర నిరాశకు గురిచేసిందని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు తరబడి క్యూలలో నిలబెట్టి, చివరికి జడ్జిల ముందు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, ఒక వ్యక్తి టాలెంట్ లేదా పర్సనాలిటీని అంచనా వేయడానికి ఈ టైమ్ ఏమాత్రం సరిపోదని మండిపడ్డాడు.

ఎలాంటి సరైన వివరణ లేకుండానే

అంతేకాకుండా, తెలుగు బిగ్‌బాస్ ఆడిషన్స్ అవుతున్నప్పటికీ నిర్వాహకులకు సరిగ్గా తెలుగు రాకపోవడం, ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడాలని ఒత్తిడి తేవడం పెద్ద సమస్యగా మారిందన్నారు.అసలు  తెలుగు రానోళ్లతో తెలుగు బిగ్‌బాస్ ఆడిషన్స్ ఏంటో అంటూ ఫైర్ అయ్యాడు.

Advertisement

తను ఒక ఫిట్‌నెస్ ట్రైనర్ అని, పవర్ లిఫ్టర్ అని చెప్పి స్కిల్స్ ప్రదర్శించినప్పటికీ, ఎలాంటి సరైన వివరణ లేకుండానే “3 రెడ్స్” ఇచ్చి రిజెక్ట్ చేశారని ఆరోపించాడు.ఈ అనుభవాలను వివరిస్తూ నిఖిల్ ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక దీనికి బిగ్‌బాస్ ఆడిషన్స్ టీమ్‌లో ఉన్న నవదీప్ స్పందిస్తూ “Good Luck Brother” అంటూ పర్సనల్ మెసేజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలనే కోరికతో వచ్చిన సామాన్యులను కేవలం టిఆర్పి రేటింగ్స్, ప్రమోషనల్ వీడియోల (Promos) కోసమే వాడుకుంటున్నారనికుండబద్దలు కొట్టేశాడు నిఖిల్.

also read :అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

నిజంగా పారదర్శకంగా ఉంటున్నాయా

సాధారణంగా చిత్రపరిశ్రమలో లేదా రియాలిటీ షోలలో “కామన్ మ్యాన్‌కు అవకాశం ఇస్తున్నాం” అని చెప్పే షోలు నిజంగా పారదర్శకంగా ఉంటున్నాయా అంటూ నికిల్ వేసిన ప్రశ్న ఇపుడు బిగ్ బాస్ ట్రాన్స్పరెన్సీని క్వశ్చన్ చేస్తుంది.చూడాలి మరి అగ్నిపరీక్ష కంటెస్టెంట్ నిఖిల్ చేసిన ఈ వైరల్ కామెంట్స్ రాబోయే బిగ్‌బాస్ సీజన్ 10 పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, దీనిపై బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

Big Stories

Advertisement
×