Pebble 30000 mAh power bank: ఇంట్లో ఉన్నా, బయట జర్నీలో ఉన్నా మన ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే.. వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. అందులోనూ రీల్స్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ ఉంటే.. బ్యాటరీ ఇట్టే కరిగిపోతుంది. ఇలాంటి టైమ్‌లో ఒక పవర్‌ఫుల్ పవర్‌బ్యాంక్ ఉంటే ఆ కిక్కే వేరు. సరిగ్గా ఇలాంటి వాళ్ల కోసమే Pebble 30000 mAh Compact Power Bank మార్కెట్లోకి వచ్చింది. కేవలం రూ.1,899 బడ్జెట్‌లోనే కొండంత బ్యాటరీ కెపాసిటీ, పైగా జేబులో ఇమిడిపోయే కాంపాక్ట్ సైజుతో వస్తున్న.. ఈ పవర్‌బ్యాంక్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో.. భాగమైపోయాక పవర్‌బ్యాంక్ అనేది లగ్జరీ కాదు, ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. సాధారణంగా 30000 mAh పవర్‌బ్యాంక్ అంటే ఇటుకరాయి అంత సైజులో.. మోయలేనంత బరువుగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ Pebble బ్రాండ్ ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తూ, సరి కొత్త కంపాక్ట్ పాకెట్ సైజ్ తో ఈ పవర్ బ్యాంక్‌ను తీసుకొచ్చింది. రూ. 1,899 ధరలో ఇదొక అల్టిమేట్ గ్యాడ్జెట్.
ఈ పవర్‌బ్యాంక్ మెయిన్ హైలైట్ దీని కెపాసిటీ. ఇందులో ఏకంగా 30000 mAh భారీ బ్యాటరీ ఉంది. అంటే.. మీ స్మార్ట్ ఫోన్‌ను దీనితో సుమారు 5 నుండి 6 సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ పవర్ బ్యాంక్‌ను ఫుల్ ఛార్జ్ చేసుకుని బ్యాగ్‌లో వేసుకుంటే.. లాంగ్ ట్రిప్స్, క్యాంపింగ్, లేదా కరెంట్ పోయినప్పుడు మొబైల్ డెడ్ అయిపోతుందనే భయమే ఉండదు. ఫోన్‌తో.. పాటు మీ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లను కూడా దీనితో ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇంత భారీ కెపాసిటీ ఉన్నప్పటికీ, దీని సైజ్ విషయంలో Pebble చాలా కేర్ తీసుకుంది. ఇది చాలా కంపాక్ట్ గా, ఈజీగా చేతిలో పట్టుకునేలా లేదా జేబులో, చిన్న హ్యాండ్‌బ్యాగ్‌లో ఇమిడిపోయేలా ఉంటుంది. దీని ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మరియు స్లీక్ డిజైన్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తాయి. పట్టుకుంటే.. మంచి గ్రిప్ ఇచ్చేలా దీని ఔటర్ బాడీని డిజైన్ చేశారు.
ఇందులో మల్టిపుల్ అవుట్‌పుట్ పోర్ట్స్ ఉన్నాయి.అంటే.. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కి వెళ్లినప్పుడు ఒకే పవర్‌బ్యాంక్‌తో అందరి ఫోన్లు ఛార్జ్ చేసేయొచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీ ఫోన్ చాలా త్వరగా రీఛార్జ్ అవుతుంది. అలాగే ఇందులో సేఫ్టీ ప్రొటెక్షన్ లేయర్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఓవర్ హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉండదు.
Also Read: ఇంట్లో ఈ వాషింగ్ మెషీన్ ఉంటే..బట్టలు ఐరన్ చేయాల్సిన పనే లేదు!
ధర: రూ.1,899 కి 30000 mAh కెపాసిటీ అంటే సూపర్ క్రేజీ డీల్.
సైజ్: భారీ కెపాసిటీ ఉన్నా.. కూడా పాకెట్ సైజ్‌లో రావడం మెచ్చుకోదగ్గ విషయం.
కనెక్టివిటీ: ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జింగ్ ఆప్షన్.
1.10000 mAh పవర్‌బ్యాంక్‌లతో పోలిస్తే.. ఇది కొంచెం బరువుగా అనిపించవచ్చు (కానీ కెపాసిటీ పరంగా ఇది కామన్).
2.పవర్‌బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.
మీరు తరచూ ప్రయాణాలు చేసేవారైనా, లేదా ట్రావెలింగ్ వ్లాగర్ అయినా రూ. 2,000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ పవర్‌బ్యాంక్ కోసం చూస్తుంటే.. Pebble 30000 mAh Compact Power Bank ని మించిన ఆప్షన్ మరొకటి లేదు.