Pebble Hive smartwatch: ప్రస్తుత రోజుల్లో చేతికి స్మార్ట్‌వాచ్ వాడటం చాలా ట్రెండ్‌గా మారింది. కేవలం సమయం టైం కాకుండా.. ఫిట్‌నెస్ ట్రాక్ చేయడానికి, కాల్స్ మాట్లాడటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ‘Pebble Hive 1.39″ HD ఆక్టా డిస్‌ప్లే’ స్మార్ట్ వాచ్ టెక్ లవర్స్‌కు మొదటి ఆప్షన్ గా మారుతోంది. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, బ్లూటూత్ కాలింగ్ , హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. కేవలం రూ. 1,599 ధరకే లభిస్తున్న ఈ ట్రెండింగ్ గాడ్జెట్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌వాచ్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది బ్లాక్ స్ట్రాప్, ఫ్రీ సైజ్‌లో లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో 1.39 అంగుళాల HD ఆక్టా డిస్‌ప్లే ఇవ్వడం జరిగింది. దీని స్క్రీన్ రిసల్యూషన్ చాలా స్పష్టంగా ఉండి, ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. దీని స్టైలిష్ లుక్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. దీన్ని రోజువారీ వాడకానికి, పార్టీలకు కూడా ఈజీగా ఉపయోగించవచ్చు.
ఈ బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ ఫీచర్లలో బ్లూటూత్ కాలింగ్ ఒకటి. మీరు మీ స్మార్ట్ ఫోన్‌ను వాచ్‌తో కనెక్ట్ చేసుకోవడం ద్వారా నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. అంతే కాకుండ రిసీవ్ చేసుకోవచ్చు.దీనిలో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ ఉండటం వల్ల కాలింగ్ ఫీల్ చాలా బాగుంటుంది.
ఆరోగ్య స్పృహ ఉన్నవారికి ఈ స్మార్ట్ వాచ్ ఒక మంచి డాక్టర్ లా పని చేస్తుంది. దీనిలో ఫుల్ హెల్త్ సూట్ అందించారు.
హార్ట్ రేట్ మానిటర్ : మీ గుండె కొట్టుకునే వేగాన్ని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుంది.
SpO2 మానిటర్: రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది.
స్లీప్ మానిటర్ : మీ నిద్ర విధానాన్ని విశ్లేషించి ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తుంది.
ఇవి కాకుండా.. డైలీ యాక్టివిటీ ట్రాకర్, స్టెప్ కౌంట్, క్యాలరీ బర్న్ వివరాలను కూడా ఇది ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది.
మీ మూడ్‌కు తగినట్లుగా వాచ్ లుక్‌ను మార్చుకోవడానికి.. DIY వాచ్ ఫేసెస్ అవకాశం ఉంది. అంటే మీ మొబైల్‌లోని ఫోటోలను.. కూడా వాచ్ స్క్రీన్ వాల్‌పేపర్‌గా సెట్ చేసుకోవచ్చు. అలాగే .. దీనిలో వరల్డ్ క్లాక్ , అలారం, స్టాప్‌వాచ్, వెదర్ అప్‌డేట్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్ వంటి అనేక యూజ్ ఫుల్ ఫీచర్లు లభిస్తాయి.
Also Read: మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో..క్షణాల్లో తెలుసుకోండిలా!
మార్కెట్లో ఈ మోడల్ అసలు ధర రూ. 6,499 వరకు ఉండగా, ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్స్‌లో ఇది కేవలం రూ. 1,599 ధరకే లభిస్తోంది.
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నట్లయితే ఈ మోడల్ నిస్సందేహంగా కొనొచ్చుక. స్టైలిష్ డిజైన్, కాలింగ్ ఫీచర్, హెల్త్ ట్రాకింగ్ అన్నీ తక్కువ ధరలోనే లభించడం దీని ప్రత్యేకత. మీరు కూడా ఈ ట్రెండింగ్ గాడ్జెట్ కొని చేసి మీ లైఫ్ స్టైల్ మరింత ఈజీగా మార్చుకోండి.