E-Paper
Advertisement

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!
Advertisement

Used Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే సమయంలో చాలామంది ముందుగా ధర, కారు కండిషన్, బ్రాండ్ లాంటి విషయాలను పరిశీలిస్తారు. అయితే, ఇప్పుడు పరిస్థితి కొంత మారుతోంది. కారు కొనడానికి ఎంత ఖర్చవుతుందనే దానితో పాటు, దాన్ని ప్రతిరోజూ నడపడానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంశాన్ని కూడా కొనుగోలుదారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, సర్వీస్ ఖర్చులు, మైలేజీ వాడిన కార్ల మార్కెట్లో కీలక అంశంగా మారుతోంది.

కారు ధర ఒక్కటే కాదు..

కారు కొనుగోలు చేసిన తర్వాత అసలు ఖర్చులు మొదలవుతాయి. ఫ్యూయల్, సర్వీసింగ్, రిపేర్లు, టైర్లు లాంటి వాటికి క్రమంగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఇంధన ఖర్చు చాలామంది యజమానుల నెలవారీ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది. మంచి మైలేజీ ఇచ్చే కారు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. అదే తక్కువ మైలేజీ ఇచ్చే కారు ఎక్కువ ఇంధనం తీసుకుంటే, కాలక్రమంలో ఆ ఖర్చు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సెకండ్ హ్యాండ్ కార్లను పోల్చేటప్పుడు కొనుగోలుదారులు మైలేజీని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

రోజూ ఎక్కువ దూరం ప్రయాణిస్తే..

Advertisement

పెద్ద నగరాల్లో ట్రాఫిక్ కారణంగా ప్రయాణ సమయం పెరుగుతోంది. కొంతమంది ఉద్యోగులు ప్రతిరోజూ చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇలాంటి వారికి కారు మైలేజీ మరింత ముఖ్యమైన అంశంగా మారుతుంది. రోజూ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తికి ప్రతి లీటర్ ఇంధనంతో వచ్చే అదనపు కిలోమీటర్లు కూడా నెలవారీ ఖర్చులో తేడాను చూపించవచ్చు. అందుకే ఇలాంటి కొనుగోలుదారులు కారు బ్రాండ్, ఫీచర్లతో పాటు  ఎంత మైలేజీ వస్తుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పెట్రోల్, డీజిల్‌లో ఏది బెస్ట్?

సెకెండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఇంధన రకం కూడా ముఖ్యమే. తక్కువ దూరాలు, ప్రధానంగా నగర ప్రయాణాలు చేసే వారికి పెట్రోల్ కారు అనుకూలంగా ఉంటుంది. అదే ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి డీజిల్ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

రీసేల్ సమయంలోనూ మైలేజీ కీలకమే!

Advertisement

మంచి మైలేజీకి పేరున్న కార్లకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో కారును అమ్మే సమయంలో కూడా ఇంధన సామర్థ్యం కొంత లాభం కలిగిస్తుంది. అంటే మంచి మైలేజీ ఉన్న కారుతో రెండు రకాలుగా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒకటి రోజువారీ ఇంధన ఖర్చు తగ్గడం, రెండోది అమ్మే సమయంలో కొనుగోలుదారుల నుంచి ఆసక్తి ఉండటం.

సెకెండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఇవి కూడా చెక్ చేయండి!

కారు కొనుగోలు చేసే ముందు కంపెనీ మైలేజీతో పాటు వాస్తవ పరిస్థితుల్లో వచ్చే మైలేజీ గురించి తెలుసుకోవాలి. కారు సర్వీస్ హిస్టరీని కూడా తప్పకుండా పరిశీలించాలి. సరిగ్గా మెయింటెయిన్ చేసిన ఇంజన్ చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే కారు ఏజ్, కిలోమీటర్ల రీడింగ్, ఇంజన్ పరిస్థితి, టైర్లు, గతంలో జరిగిన పెద్ద రిపేర్లు లాంటి అంశాలను కూడా పరిశీలించాలి.

Read Also: డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!

Tags

Related News

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

బజాజ్ పల్సర్ NS400Z న్యూ వెర్షన్ వచ్చేసింది.. TFT డిస్‌ ప్లేతో లుక్ అదిరిపోయిందిగా!

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ షురూ.. లాంచింగ్ ఎప్పుడంటే?

జీప్ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.4 లక్షల తగ్గింపు!

కార్ల మార్కెట్‌లో పండుగ జోష్.. సెప్టెంబర్‌ అమ్మకాల్లో బిగ్ జంప్.. టాప్ కంపెనీల సేల్స్ ఇవే!

Big Stories

Advertisement
×