Sony BRAVIA 2 II 75 inch review: ఇంటికి పెద్ద స్క్రీన్ టీవీ ఉంటే.. ఆ మజాయే వేరు. కుటుంబమంతా కలిసి సినిమా చూసేటప్పుడు.. లేదా క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు పెద్ద డిస్‌ప్లే ఇస్తే.. వేరే లెవెల్‌లో ఉంటుంది. మార్కెట్లో టెక్నాలజీ.. మారుతున్న కొద్దీ అద్భుతమైన ఫీచర్లతో.. టీవీలు వస్తున్నాయి. ఈ కోవకే చెందిన తాజా ప్రీమియం స్మార్ట్ టీవీ Sony BRAVIA 2 II 75 Inch 4K Smart Google TV. సోనీ బ్రాండ్ క్వాలిటీ మారుపేరుగా నిలుస్తుంది. అలాగే.. ఈ మోడల్ కస్టమర్లకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. అసలు ఈ భారీ టీవీ పని తీరు ఎలా ఉంది? ఇందులో.. ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:
ఈ టీవీ డిజైన్ విషయానికి వస్తే. ఇది చాలా సన్నని బెజెల్స్‌తో ప్రీమియమ్ లుక్‌ను ఇస్తుంది.189.3 సెం.మీ (75 ఇంచుల) సైజ్ కలిగిన ఈ స్క్రీన్ మీ లివింగ్ రూమ్‌కు ఒక రాయల్ లుక్‌ను తెస్తుంది. ఇక డిస్‌ప్లే.. విషయానికి వస్తే, ఇది 4K అల్ట్రా హెచ్‌డీ (3840 x 2160 పిక్సెల్స్) రెసల్యూషన్‌తో వస్తుంది. ఇందులో .. ఉన్న ప్రత్యేక టెక్నాలజీలు ప్రతీ సీన్‌ను చాలా స్పష్టంగా, సహజ మైన రంగులతో ప్రదర్శిస్తాయి. తక్కువ రెసల్యూషన్ ఉన్న వీడియోలను.. కూడా ఇది ఆటోమేటిక్‌గా 4కే క్వాలిటీకి దగ్గరగా మార్చి చూపగలదు.
మంచి విజువల్స్ ఉన్నప్పుడు.. దానికి తగినట్లుగా సౌండ్ కూడా అదిరి పోవాలి. ఈ విషయంలో..సోనీ ఎప్పుడూ ముందుంటుంది.ఈ టీవీలో పవర్ ఫుల్ స్పీకర్లు ఇవ్వబడ్డాయి. ఇవి డాబ్లే డీటీఎస్ ఆడియో టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తాయి. దీని వల్ల మీరు సినిమా చూస్తున్నప్పుడు.. లేదా పాటలు వింటున్నప్పుడు చుట్టుముట్టే.. సరౌండ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. డైలాగులు చాలా స్పష్టంగా వినిపించేలా.. ఇందులో ప్రత్యేకమైన ఆడియో ఎన్హాన్స్‌మెంట్ ఫీచర్లను కూడా జోడించారు.
ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని వల్ల ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. వాయిస్ సర్చ్ ఫీచర్ ఉండటం వల్ల రిమోట్‌తో ..టైప్ చేయాల్సిన పని లేకుండా మాటలతోనే.. మీకు నచ్చిన షోస్ లేదా మూవీస్‌ను సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే.. మొబైల్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకునే మిర్రరింగ్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: గోద్రెజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్..రూ.10వేలకే!
ప్లేస్టేషన్ లేదా ఇతర గేమింగ్ కన్సోల్స్ వాడే వారికి ఈ టీవీ సరిగ్గా సరి పోతుంది. ఇందులో.. ఆటో లో లేటెన్సీ మోడ్ , హెచ్‌డీఎంఐ సపోర్ట్ ఉండటం వల్ల. గేమింగ్ ఫీల్ చాలా స్మూత్‌గా ఉంటుంది. కనెక్టివిటీ కోసం.. బ్లూటూత్, వై-ఫై ,బహుళ హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్ట్‌లు ఇచ్చారు.
మార్కెట్లో ఈ మోడల్ ధర సుమారు రూ.1,20,500 వరకు ఉంది (ఆఫర్లు ,స్టోర్‌లను బట్టి ధరలో మార్పు ఉండొచ్చు). సోనీ బ్రాండ్ నమ్మకం, అద్భుతమైన 4K పిక్చర్ క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్ కోరుకునే.. పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్. మీ ఇంట్లోనే థియేటర్ ఫీల్ పొందాలనుకుంటే ఈ టీవీ నిస్సందేహంగా గొప్ప ఆప్షన్ అవుతుంది.