E-Paper
Advertisement

సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్‌లో కానిస్టేబుల్‌కు రూ.30 లక్షల టోకరా!

సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్‌లో కానిస్టేబుల్‌కు రూ.30 లక్షల టోకరా!
Advertisement

Cyber Fraud: సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి సామాన్యులే కాదు, చట్టాన్ని పరిరక్షించే పోలీసులు కూడా మోసపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఒక ఘటనలో, ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా రూ.30 లక్షల వరకు సమర్పించుకుని రోడ్డున పడ్డారు.

పరిచయం కాస్తా పెట్టుబడుల వైపు..

Advertisement

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌కు ఫేస్‌బుక్‌లో ‘సుకన్య రెడ్డి’ అనే పేరుతో ఉన్న ఖాతా నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఏమాత్రం అనుమానం రాకుండా ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన కానిస్టేబుల్, ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇద్దరూ వాట్సాప్ నంబర్లు మార్చుకుని మరింత చనువుగా మాట్లాడటం మొదలుపెట్టారు.

ఆశ చూపి.. లాభాలు చూపించి..

Advertisement

కొద్దిరోజుల పరిచయం తర్వాత, ఆ మహిళ ‘డార్విన్ ఎక్స్ గ్లోబల్’ అనే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ గురించి అతనికి చెప్పింది. అందులో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికింది. మొదట ఆమె మాటలు నమ్మి సదరు కానిస్టేబుల్ చిన్న మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఖాతాలో లాభాలు కనిపించడం, వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు కూడా వెసులుబాటు ఉండటంతో అతనికి నమ్మకం కుదిరింది.

అసలు రంగు బయటపడింది ఇలా..

ఈ నమ్మకంతోనే కానిస్టేబుల్ విడతలవారీగా ఏకంగా రూ.29.20 లక్షల వరకు సదరు ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత అతని ఖాతాలో ఏకంగా రూ.76 లక్షల లాభం వచ్చినట్లు చూపించింది. అయితే, ఆ మొత్తాన్ని తన బ్యాంక్ ఖాతాలోకి ఉపసంహరించుకోవాలని ప్రయత్నించాడు. ముందస్తుగా రూ.12 లక్షల ఫీజు చెల్లిస్తేనే విత్‌డ్రా అవుతుందని నిర్వాహకులు తేల్చిచెప్పారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

దాంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన సదరు కానిస్టేబుల్, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే సోషల్ మీడియా రిక్వెస్ట్‌లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Tags

Related News

గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!

రెవెన్యూ, ఫారెస్ట్ భూములపై కీలక నిర్ణయం.. ఏళ్ల నాటి సమస్యకు మంత్రి పొంగులేటి మాస్టర్ ప్లాన్!

జైలు గోడల మధ్య ఆటలు, పాటలు.. ఖైదీల్లో మార్పు కోసం మార్గదర్శిగా ఉల్లాసం!

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. కరెంటు పోల్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. దంపతులు దుర్మరణం!

తెలంగాణలో ఖేలో ఇండియా ధమాకా.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

సొంత బావలు ఎంత పని చేశారు.. మరదల్ని ఇంట్లోకి రప్పించి గొంతు కోశారు, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం

ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైడ్రా బిగ్ షాక్.. ఫామ్‌హౌస్‌ ప్రహరీ గోడ కూల్చివేసిత!

Big Stories

Advertisement
×