E-Paper
Advertisement

రూ.2,411కే..అద్భుతమైన స్మార్ట్ బ్యాండ్! వెంటనే కొనేయండి

రూ.2,411కే..అద్భుతమైన స్మార్ట్ బ్యాండ్! వెంటనే కొనేయండి
Advertisement

Sekyo FLEX fitness tracker review: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో మన ఆరోగ్యం గురించి.. శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. రోజూ… మనం ఎంత నడుస్తున్నాం, మన గుండె స్పందన ఎలా ఉంది, రాత్రి సరిగ్గా నిద్ర పోతున్నామా లేదా వంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మన శారీరక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. దీని కోసం మార్కెట్లో.. చాలా రకాల స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే..ఎక్కువ ధర పెట్టి వాటిని కొనలేని.. వారి కోసం ప్రముఖ బ్రాండ్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆప్షనే Sekyo FLEX Fitness Tracker. కేవలం రూ. 2,411 ధరకే లభిస్తున్న ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ మార్కెట్లో.. ట్రెండ్ సృష్టిస్తోంది. అసలు ఈ డివైజ్ ఫర్పామెన్స్ ఎలా ఉంది? ఇందులో.. ఉండే ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ మోడల్ విషయానికి వస్తే..ఇది చాలా స్లీక్‌గా, మోడ్రన్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. చేతికి పెట్టుకున్నప్పుడు.. చాలా లైట్‌వెయిట్‌గా అనిపిస్తుంది.దీని వల్ల జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు.. లేదా రాత్రి పడుకున్నప్పుడు.. కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. దీని బ్రైట్ డిస్‌ప్లే బయట ఎండలో.. తిరిగేటప్పుడు కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూడటానికి సహాయ పడుతుంది. రక రకాల వాచ్ ఫేస్‌లను మార్చుకునే.. సపోర్ట్ ఉండటం వల్ల మీ మూడ్‌కు తగినట్టుగా దీన్ని డిజైన్ మార్చుకోవచ్చు. అలాగే.. ఇది వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కలిగి ఉంది. కాబట్టి వర్షంలో.. తడిచినా లేదా చెమట పట్టినా ఎలాంటి సమస్య ఉండదు.

హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు:

Advertisement

ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ మెయిన్ హైలైట్ దీని హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు.ఇందులో.. రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని చూపే.. SpO2 సెన్సార్ ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్య స్థితిని ఎప్పటి కప్పుడు కచ్చితంగా ..అంచనా వేస్తాయి. అంతేకాకుండా.. స్లీప్ మానిటర్ , నిద్ర క్వాలిటీని విశ్లేషించి రిపోర్ట్ ఇస్తుంది. వ్యాయామాలు చేసేవారి.. కోసం ఇందులో ఏకంగా 110+ స్పోర్ట్స్ మోడ్స్ అందించారు. రన్నింగ్, సైక్లింగ్, యోగా, వాకింగ్ వంటి వివిధ రకాల యాక్టివిటీలను ఇది ట్రాక్ చేయగలదు.

బ్యాటరీ బ్యాకప్, కనెక్టివిటీ:

బ్యాటరీ లైఫ్ విషయంలో.. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంలో ఇది రోజుల తరబడి బ్యాకప్ ఇస్తుంది. అంటే.. పదే పదే ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ ఉండదు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇది బ్లూటూత్ ద్వారా మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌కు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లు , సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను నేరుగా మీ చేతిలోనే చూసుకోవచ్చు.

Advertisement

Also Read: పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా?బెస్ట్ గాడ్జెట్ ఇదే

ధర:

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ధర కేవలం రూ. 2,411 గా ఉంది. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో.. ఇది కొనడానికి అందుబాటులో ఉంది. కేవలం రెండున్నర వేల రూపాయల బడ్జెట్‌లో.. హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్, 110కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ లభించడం నిజంగా చాలా గొప్ప విషయం. మీరు బడ్జెట్ ధరలో .. ఒక మంచి హెల్త్ కంపానియన్ కోసం చూస్తున్నట్లయితే.. నిస్సందేహంగా మీకు ఒక చక్కటి ఆప్షన్ అవుతుంది.

Related News

ఇంటికి హైటెక్ సెక్యూరిటీ.. మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఫేస్ ఐడీ స్మార్ట్ లాక్స్ ఇవే!

గోద్రెజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్..రూ.10వేలకే!

మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌తో ఇన్ని పనులు చేయొచ్చా? దిమ్మతిరిగే షాకింగ్ నిజాలు!

పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా?బెస్ట్ గాడ్జెట్ ఇదే

డేటా అక్కర్లేని వారికి జియో గుడ్ న్యూస్.. అపరిమిత కాల్స్ కోసం సరికొత్త చౌకైన ప్లాన్లు!

1,099కే నెక్ట్ లెవల్ ఫీచర్లున్నఇయర్ బడ్స్! డోంట్ మిస్

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డిష్ వాషర్ కావాలా?ఈ మోడల్ మీ కోసమే

Big Stories

Advertisement
×