Poco F7 vs Oppo Reno 14 vs iQOO Neo 10| మార్కట్లో అందుబాటులో ఉండే ₹40,000 లోపు 5G పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఒప్పో రెనో 14 5G, పోకో F7, ఐక్యూ నియో 10 మూడు బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లు పవర్ ఫుల్ ప్రాసెసర్‌లు, పెద్ద బ్యాటరీలు, అద్భుతమైన డిస్‌ప్లేలు, ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌తో వస్తాయి. ఏ ఫోన్ ఎంచుకోవాలో మీరు నిర్ణయించుకోవడం కష్టంగా ఉంటే, ఈ సరళమైన పోలికను ఒకసారి గమనించండి.
ధరలు
ఒప్పో రెనో 14 5G ధర 8GB RAM + 256GB స్టోరేజ్‌తో ₹37,999, 12GB RAM + 256GBతో ₹39,999. పోకో F7 తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్ ఇస్తుంది. 12GB RAM + 256GB ₹31,999, 12GB RAM + 512GB ₹33,999. ఐక్యూ నియో 10 8GB RAM + 128GBతో ₹31,999 నుండి మొదలై, 8GB RAM + 256GB ₹33,999 వరకు ఉంది. ధర, స్టోరేజ్‌లో పోకో F7 ముందుంది.
డిస్‌ప్లే
ఒప్పో రెనో 14 5Gలో 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. పోకో F7లో 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1280×2772 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఐక్యూ నియో 10లో 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 1260×2800 రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. వీడియోలు చూడటం లేదా గేమింగ్‌కు ఐక్యూ నియో 10 డిస్‌ప్లే బెస్ట్.
పర్‌ఫామెన్స్
ఒప్పో రెనో 14 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంది. ఇది మంచి చిప్ అయినప్పటికీ, పోకో F7, ఐక్యూ నియో 10.. ఈ రెండూ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తాయి. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ భారీ యాప్‌ల రన్నింగ్ కోసం ఫుల్ పవర్ ఇస్తుంది. వేగం, స్మూత్ పర్‌ఫామెన్స్ లో పోకో F7, ఐక్యూ నియో 10 ముందున్నాయి.
సాఫ్ట్‌వేర్
మూడు ఫోన్‌లూ ఆండ్రాయిడ్ 15తో వస్తాయి. ఒప్పో రెనో 14లో కలర్‌ఓఎస్ 15, పోకో F7లో హైపర్‌ఓఎస్ 2.0, ఐక్యూ నియో 10లో ఫన్‌టచ్ ఓఎస్ 15 ఉన్నాయి. ఫన్‌టచ్ ఓఎస్‌లో యాడ్స్ తక్కువ, ఇంటర్‌ఫేస్ క్లీన్‌గా ఉంటుంది. కలర్‌ఓఎస్ సాఫీగా ఉంటుంది కానీ కొన్ని అనవసర యాప్‌లు ఉండవచ్చు. హైపర్‌ఓఎస్‌లో యాడ్స్ ఎక్కువగా ఉండవచ్చు.
కెమెరా
ఒప్పో రెనో 14 5Gలో 50MP మెయిన్, 50MP పెరిస్కోప్ జూమ్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి, ఫోటోగ్రఫీ ఇది ఉత్తమం. పోకో F7లో 50MP మెయిన్, 8MP అల్ట్రా-వైడ్, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఐక్యూ నియో 10లో 50MP మెయిన్ (OISతో), 8MP అల్ట్రా-వైడ్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. జూమ్ మరియు సెల్ఫీలకు ఒప్పో రెనో 14 ఉత్తమం.
బ్యాటరీ
ఒప్పో రెనో 14లో 6000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. పోకో F7లో 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ ఉన్నాయి. ఐక్యూ నియో 10లో 7000mAh బ్యాటరీ, 120W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి, ఇది త్వరగా ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ జీవితకాలం.. ఛార్జింగ్ వేగంలో ఐక్యూ నియో 10 ఉత్తమం.
కనెక్టివిటీ
మూడు ఫోన్‌లూ 5G, వై-ఫై, బ్లూటూత్, GPS, USB టైప్-C ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఒప్పో రెనో 14లో వై-ఫై 6, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. పోకో F7, ఐక్యూ నియో 10లో వై-ఫై 7 ఉంది, ఇది వేగవంతమైన కనెక్షన్ ఇస్తుంది. పోకో F7లో బ్లూటూత్ 6.0, NFC, రివర్స్ ఛార్జింగ్ ఉన్నాయి. ఐక్యూ నియో 10లో NFC, USB-C 2.0 ఉన్నాయి.
Also Read: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!
ఏది విన్నర్
ఉత్తమ డిస్‌ప్లే, బ్యాటరీ, పనితీరు కావాలంటే ఐక్యూ నియో 10 బెస్ట్ ఆప్షన్. గేమర్స్, వేగవంతమైన ఛార్జింగ్ కావాల్సిన వారికి ఇది సరైనది. కెమెరా, ముఖ్యంగా సెల్ఫీలు, జూమ్ ఫోటోగ్రఫీ కావాలంటే ఒప్పో రెనో 14 5G ఉత్తమం. బడ్జెట్‌లో శక్తివంతమైన పనితీరు, స్టోరేజ్ కావాలం