Jasprit Bumrah: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకొని 471 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ రోజు ఆటలో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మినహా మిగతా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. బుమ్రా ఒక్కడే 5 వికెట్లు పడగొట్టగా.. మరో ఎండ్ నుంచి మద్దతు రాలేదు.
Also Read: Prasidh krishna: కప్పను మింగిన పాములాగా తయారైన ప్రసిద్… టీమిండియాను ఓడించేందుకు కుట్రలు..?
దీంతో మాజీ క్రికెటర్లు బుమ్రా ప్రదర్శనను ప్రశంసిస్తూనే.. ఇతర బౌలర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక రెండవ టెస్టుకి బుమ్రాకి విశ్రాంతి ఇచ్చారు. గాయం బెడద ఉండడంతో లీడ్స్ టెస్ట్ లో దాదాపుగా 50 ఓవర్లు వేసిన బుమ్రా.. రెండవ మ్యాచ్ కి దూరంగా ఉంచాలని టీం మేనేజ్మెంట్ భావించింది. అతడు ఈ సిరీస్ లో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడేందుకు వచ్చాడని టీమ్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే మొదటి టెస్ట్ లో ఓడిన భారత జట్టు.. రెండవ టెస్ట్ లో ఓడితే పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన పడ్డారు.
కానీ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ అద్భుత బౌలింగ్ తో రాణించారు. ఇక మూడో టెస్ట్ మ్యాచ్ ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కి ప్రిపేర్ అయ్యేందుకు బుమ్రాని రెండో టెస్ట్ కు పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుమ్రా రెండో టెస్ట్ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయి, బుమ్రాకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బుమ్రా మ్యాచ్ వీక్షిస్తుండగా.. ఓ లేడీ అభిమాని బుమ్రా వైపే చూస్తూ కనిపించింది. దీంతో ఆ లేడీ బుమ్రా వెంట పడుతుందని.. హాట్ హాట్ చూపులతో అతడిని పడేసేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. నిజానికి బుమ్రాకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అతని బౌలింగ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అతని బౌలింగ్ కి ప్రపంచంలోని ఏ బ్యాటర్ అయినా షివర్ అవ్వాల్సిందే. అందుకే అతన్ని టీమిండియాకి దొరికిన కోహినూర్ అని కూడా పిలుస్తారు.
Also Read: Mohammed Siraj: ప్రభాస్ హీరోయిన్ తో రొమాన్స్.. తెలంగాణ డీఎస్పీ సిరాజ్ ఇంతకు తెగించాడ్రా!
బుమ్రా మ్యాచ్ లో ఉంటే ఆఖరి బంతి వరకు ప్రత్యర్థులకు భయమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి మ్యాచ్ లో గాయం బారిన పడ్డ బుమ్రా.. చాలాకాలం ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమయ్యాడు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బుమ్రా ఆడలేదు. ఆ తర్వాత ఐపీఎల్ మధ్యలో జట్టులో చేరిన అతడు పూర్తిగా రికవరీ అయ్యాడు. ఇక ఐపీఎల్ 2025 బుమ్రాకి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ఓ ప్రాక్టీస్ సెషన్ గా మారింది.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 4, 2025