E-Paper
Advertisement

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోతున్న Poco F9 ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. లీకైన వివరాలివే!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోతున్న Poco F9 ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. లీకైన వివరాలివే!
Advertisement

POCO F9 Series: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోకో బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లను అందించడంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ‘టెక్ హోమ్100’ అనే టిప్‌స్టర్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. త్వరలోనే రాబోతున్న Poco F9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ బ్యాటరీ, అల్ట్రా‌ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, మెరుగైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్లు లీకైన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ Poco F9 సిరీస్‌లో అత్యంత ముఖ్యమైనది Poco F9 Ultra. దీనిలో ఏకంగా 6.9 అంగుళాల రియల్ RGB OLED ఫ్లాట్ డిస్‌ప్లేను అందించబోతున్నారు. దీనికి తోడు 185Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, విజువల్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు ఒక సెపరేట్ గ్రాఫిక్స్ చిప్‌ను కూడా జోడించారు.

Advertisement

Also Read: పిక్సెల్ 11 నుంచి పిక్సెల్ ట్యాగ్ వరకు.. గూగుల్ 2026 ఈవెంట్‌లో టాప్ హైలైట్స్ ఇవే!

చాలామంది యూజర్లు బ్యాటరీ లైఫ్ గురించే ఎక్కువ ఆలోచిస్తుంటారు. వారి కోసం Poco F9 Ultraలో ఏకంగా 8050mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం వెనుక వైపు 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 5x ఆప్టికల్ జూమ్ ఉండే 50MP పేరిస్కోప్ లెన్స్‌లు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 32MP కెమెరా ఇచ్చారు. ఐపీ69 రేటింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, సబ్‌వూఫర్ లాంటి అదనపు హంగులు కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

కొంచెం చిన్న స్క్రీన్ ఇష్టపడే వారి కోసం Poco F9 Pro మోడల్‌ను రూపొందించారు. దీనిలో 6.59 అంగుళాల 185Hz OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 V సిరీస్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో కూడా 200MP మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కొనసాగించారు. దీంతో పాటు 50MP టెలిఫోటో, 8MP అల్ట్రా‌వైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ మోడల్‌లో 6330mAh బ్యాటరీని అందించారు. మొత్తం మీద ఈ రెండు ఫోన్లు అధికారికంగా మార్కెట్‌లోకి వస్తే.. మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో మిగతా బ్రాండ్లకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం.

Also Read: జియో, ఎయిర్‌టెల్‌కి BSNL బిగ్ షాక్.. కేవలం రూ.1కే రీఛార్జ్.. 500 లైవ్ టీవీ ఛానెళ్లు ఉచితం!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×