E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో దుమ్ము లేపనున్న Poco M8x 5G.. లాంచ్‌కు ముందే లుక్స్ లీక్!

ఫ్లిప్‌కార్ట్‌లో దుమ్ము లేపనున్న Poco M8x 5G.. లాంచ్‌కు ముందే లుక్స్ లీక్!
Advertisement

Poco M8x 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో.. తమ M సిరీస్‌లో మరో కొత్త హ్యాండ్ సెట్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ‘పోకో M8x 5G’ పేరుతో రానున్న ఈ మొబైల్ టీజర్‌ను కంపెనీ ఇటీవల అధికారికంగా విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అందుబాటులోకి రానుందని స్పష్టం చేసింది.

కళ్లు చెదిరే కొత్త డిజైన్..

తాజాగా విడుదలైన టీజర్‌లో ఫోన్ వెనుక భాగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టెక్స్చర్డ్ ఫినిషింగ్‌తో ఉన్న గ్రీన్ కలర్, దానికి తోడు గోల్డ్ కలర్ ఫ్రేమ్ అండ్ కెమెరా మాడ్యూల్ ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇటీవల వచ్చిన పోకో ఫోన్లతో పోలిస్తే.. దీని డిజైన్ చాలా డిఫరెంట్‌గా, ఆకట్టుకునేలా ఉంది.

Advertisement

Also Read: లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

కెమెరా, మిగతా వివరాలు..

వెనుక వైపు పైభాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌కు కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అయితే కెమెరా పిక్సెల్స్, ప్రాసెసర్, బ్యాటరీ వంటి పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.

సేల్స్ ఎక్కడంటే?

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి రానుంది. త్వరలోనే దీని లాంచ్ డేట్‌తో పాటు మిగిలిన వివరాలను కూడా ఒక్కొక్కటిగా కంపెనీ ప్రకటించే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గత మోడల్ కంటే బెటరా?

ఇటీవలే పోకో సంస్థ M8 పవర్ వేరియంట్‌ను రూ.24,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అది 8000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి భారీ ఫీచర్లతో వచ్చింది. మరి ఈ కొత్త M8x 5G దాని కంటే తక్కువ ధరకు వస్తుందా లేక ఇంకా ఎక్కువ ఫీచర్లతో వస్తుందా అనేది వేచి చూడాలి.

Also Read: డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×