E-Paper
Advertisement

లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Flipkart Freedom Sale 2026: రూ.1,49,900 పెట్టి కొనాల్సిన iPhone 17 Pro Max.. ఇప్పుడు రూ.98,300కేనా? Flipkart Freedom Saleలో దర్శనం ఇచ్చిన ఈ ప్రైస్ చూసి యాపిల్ ఫ్యాన్స్ ఒక్కసారి షాక్ అవ్వాల్సిందే. అయితే ఇది అందరికీ వర్తించే సింపుల్ డిస్కౌంట్ కాదు. మీ దగ్గర పాత ఐఫోన్ 16 ఉండాలి, దానికి మంచి ఎక్స్ఛేంజ్ విలువ రావాలి.. పైగా బ్యాంక్ ఆఫర్ కూడా కలవాలి. అప్పుడే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర లక్ష కంటే తక్కువకు వస్తుంది.

ధరెంత తగ్గిదంటే?

గతేడాది సెప్టెంబర్‌లో యాపిల్ కంపెనీ ఈ 256GB మోడల్‌ను రూ.1,49,900 ప్రారంభ ధరతో భారత్‌లో లాంచ్ చేసింది. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ నేరుగా రూ.8,000 తగ్గి రూ.1,41,900 ధరకు అందుబాటులో ఉంది. అంటే.. దాదాపు 5.34 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు వర్తింపజేస్తే ఫోన్ ధరను మొదట రూ.1,33,900 కు చేరుకోవచ్చు.

Advertisement

Also Read: ఆఫర్ల పండగ.. Flipkart Saleలో సగం ధరకే మోటరోలా 5G ఫోన్లు.. డోంట్ మిస్!

రూ.98,300కి ఎలా వస్తుంది?

ఈ ఆఫర్‌ను పూర్తిగా వాడుకోవాలంటే మీ దగ్గర వర్కింగ్ కండిషన్‌లో ఉన్న పాత ఐఫోన్ 16 ఉండాలి. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 ఎక్స్ఛేంజ్‌పై గరిష్టంగా రూ.35,600 వరకు వాల్యూ ఇస్తోంది. దీనికి తోడు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్ వాడితే ఇంకో రూ.8,000 తక్షణ డిస్కౌంట్ వస్తుంది. ఈ రెండూ కలిపితే అసలు ధర నుంచి ఏకంగా రూ.51,600 (సుమారు 34.4 శాతం) వరకు ఆదా అయి, నెట్ ప్రైస్ రూ.98,300కు చేరుకుంటుంది.

ఎక్స్ఛేంజ్ లేకపోతే?

Advertisement

మీ దగ్గర మార్చుకోవడానికి పాత ఫోన్ లేకపోతే ఈ రూ.98,300 ఆఫర్ మీకు వర్తించదు. అలాంటి వారు కేవలం బ్యాంక్ ఆఫర్లతో రూ.1,33,900కి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా.. ఎక్స్ఛేంజ్ ఇచ్చే ఫోన్ కండిషన్, మీరు ఉండే పిన్‌కోడ్‌ను బట్టి కూడా ఈ ట్రేడ్‌ఇన్ వాల్యూ మారుతూ ఉంటుంది. కాబట్టి.. పాత ఐఫోన్ 16ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి మాత్రమే ఈ రూ.98,300 డీల్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

Also Read: ఇవి బడ్స్ కాదండోయ్.. శాంసంగ్ నుంచి మునుపెన్నడూ చూడని సరికొత్త డివైజ్!

Tags

Related News

పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్

ఏఐ సౌండ్ యాప్‌తో లీఫ్ బడ్స్ ఎక్స్121.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్!

ఆఫర్ల పండగ.. Flipkart Saleలో సగం ధరకే మోటరోలా 5G ఫోన్లు.. డోంట్ మిస్!

BoAt Vs Noise..బ్యాటరీ, సౌండ్,ధర పరంగా ఏది కొంటే బెటర్?

ఇవి బడ్స్ కాదండోయ్.. శాంసంగ్ నుంచి మునుపెన్నడూ చూడని సరికొత్త డివైజ్!

మ్యూజిక్‌కు తగ్గట్టుగా 360-డిగ్రీ లైటింగ్ షో.. దద్దరిల్లే బేస్‌తో JBL స్పీకర్

జియోలో ఇంత మంచి ప్లాన్ ఉందా.. రూ. 666తో 70 రోజులపాటు ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పండగే!

Big Stories

Advertisement
×