E-Paper
Advertisement

7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!

7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!
Advertisement

POCO M8X 5G: బడ్జెట్ ధరలో శక్తివంతమైన ఫీచర్లు కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పోకో (POCO) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ‘పోకో M8x 5G’ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధరపై ఏకంగా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తోంది. మరి ఈ ఫోన్ స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం రండి!

ధర, ఆఫర్ల వివరాలు:

POCO M8X 5G రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ మోడల్ (4GB+128GB) అసలు ధర రూ.20,999 కాగా, టాప్ వేరియంట్ (6GB+128GB) రూ.22,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,000 కూపన్ డిస్కౌంట్, అదనంగా రూ.1,000 బ్యాంక్ ఆఫర్ కలుపుకుని ఈ ఫోన్‌ను కేవలం రూ.17,999 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్లాక్, లెదర్ గ్రీన్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.

Advertisement

Also Read: DSLR కెమెరాలకు గట్టిపోటీ ఇవ్వనున్న iQOO 16.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

అద్భుతమైన డిస్‌ప్లే, ప్రాసెసర్:

ఇందులో 6.9-అంగుళాల పెద్ద HD+ LCD డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. పనితీరు విషయానికి వస్తే.. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్ 3 ఓఎస్‌తో ఇది రన్ అవుతుంది.

7,900mAh భారీ బ్యాటరీ:

Advertisement

ఈ POCO M8X 5Gకు అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీనే. ఇందులో ఏకంగా 7,900mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది IP64 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది.

కెమెరా, ఇతర ఫీచర్లు:

ఫోటోగ్రఫీ కోసం వెనుకభాగంలో 50MP ప్రైమరీ కెమెరా, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. వీటితో పాటు 5G, వైఫై, బ్లూటూత్, టైప్-సి పోర్ట్, మ్యూజిక్ లవర్స్ కోసం 3.5mm ఆడియో జాక్ కూడా ఇందులో అందించడం విశేషం. ఈ బడ్జెట్‌లో ఇంత భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ రావడం అనేది విశేషమే మరి.

Also Read: 7,500mAh బ్యాటరీ.. డైమెన్సిటీ 9600M చిప్‌తో అదరగొట్టనున్న Vivo X500 ఫోన్!

Tags

Related News

DSLR కెమెరాలకు గట్టిపోటీ ఇవ్వనున్న iQOO 16.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

ఒప్పో ఫైండ్ N6 vs మోటరోలా రేజర్ ఫోల్డ్.. ఈ రెండింటిలో ఫీచర్లు, కెమెరా, డిజైన్ పరంగా ఏది బెటర్?

అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్ వాడేస్తున్నారా? జాగ్రత్త

ఫోన్‌లో..కనిపించే ఈ 5 వార్నింగ్ సిగ్నల్స్ మీకు తెలుసా?

7,500mAh బ్యాటరీ.. డైమెన్సిటీ 9600M చిప్‌తో అదరగొట్టనున్న Vivo X500 ఫోన్!

ఫ్రిజ్‌లో నీరు చేరుతోందా? టెక్నీషియన్‌ను పిలవకుండానే ఇలా సాల్వ్ చేయండి!

టాప్ 5 ఏఐ టూల్స్..ఈ ట్రిక్స్ తెలిస్తే వర్క్ చిటికెలో అయిపోతుంది!

Big Stories

Advertisement
×