Apple Flip Mobile : యాపిల్ (Apple).. ఈ సంస్థ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెక్ దిగ్గజం త్వరలోనే ఫ్లిప్ మొబైల్స్ (Apple Flip Mobiles) ను తీసుకొస్తుందనే వార్త హల్చల్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి రాబోతుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అసలు యాపిల్ ఫ్లిప్ మెుబైల్ కాబోతుందా? ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఓ లుక్కేద్దాం.
ఫ్లిప్ మొబైల్స్.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఈ ఫోల్డబుల్ మొబైల్స్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నగా పోర్టబుల్ డిజైన్ తో వాడేందుకు ఎంతో తేలిగ్గా ఉండే మొబైల్స్ ఎక్కడికైనా తీసుకు వెళ్ళటం కూడా ఎంతో తేలిక. ఇందులో బ్యాటరీ లైఫ్ సైతం మెరుగ్గా ఉంటుంది. కాల్స్, మెసేజ్ చేయడానికి మరింత అనుకూలంగా ఉంటుంది.
అందుకే సామ్ సాంగ్, మెటో ఇప్పటికే తమ సిరీస్ లో ఫ్లిప్ మొబైల్స్ ను లాంఛ్ చేశాయి. అయితే కాస్త ఆలస్యమైనా యాపిల్ కంపెనీ సైతం అప్ గ్రేడ్ ఫీచర్స్ తో ఫ్లిప్ మొబైల్స్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం యాపిల్ ఇవ్వనప్పటికీ.. వచ్చే ఏడాది ఈ మొబైల్ రాబోతుందని అంచనా వేసేస్తున్నాయి.
నిజానికి ఫ్లిప్ మొబైల్స్ ఇప్పుడు మాత్రమే రాలేదు. 2000 సంవత్సరం నుంచే ఈ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అప్పుడు వచ్చే మొబైల్స్ లో స్క్రీన్ సైజ్ చిన్నగా ఉండేది కానీ ఇప్పుడు వచ్చే ఫ్లిప్ మొబైల్స్ లో స్క్రీన్ అనుకూలంగా ఉంటుంది. ఇలా యాపిల్ సైతం పెద్ద స్క్రీన్ తో ఫ్లిప్ మొబైల్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇంకా ఈ ఫోల్డబుల్ మొబైల్స్ లో రెండు భాగాలుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇందులో ఈ స్మార్ట్ ఫోన్ తెరవగానే ఇంటర్ఫేస్ లేదా స్క్రీన్ వాడేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక యాపిల్ తీసుకొచ్చే ఈ కొత్త ఫ్లిప్ మొబైల్స్ సామ్సాంగ్ గేలక్సీ Z ఫ్లిప్ (Samsung Galaxy Z Flip), మోటోరోలా రాజార్ (Motorola Razr) వంటి ఫోన్స్ డిజైన్ తో రాబోతున్నాయని తెలుస్తుంది. ఫోల్డబుల్ ఫోన్స్ లో OLED డిస్‌ప్లే, ఫోల్డబుల్ AMOLED ప్యానెల్స్ ఉన్నాయి.
యాపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 17 సిరీస్ (Apple iPhone 17 Series) ను గ్రాండ్ గా లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉండనున్నాయి. అయితే వీటితో పాటు స్లిమ్ మొబైల్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కానీ ఫ్లిప్ మొబైల్ మాత్రం మార్కెట్లో అందుబాటులోకి రావడానికి కాస్త టైం పట్టే ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక యాపిల్ ఈ ఫ్లిప్ మొబైల్స్ ను ఎప్పుడు తీసుకురాబోతుంది అధికార ప్రకటన ఎప్పుడు రాబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ALSO READ : బడ్జెట్ కాస్త ఎక్కువైనా ఓకే కానీ టాప్ మెుబైల్ కొనాలా! తోపు ఇవే మరి