Mahavatar Narsimha Teaser: ఈ మధ్యకాలంలో మైథలాజీ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువ ఉంటుంది. అందుకే మేకర్స్ సైతం అలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నారు. అయితే నటీనటులతో ఇలాంటి మైథాలజీ సినిమాలను చేస్తుంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆ హీరో కు ఈ క్యారెక్టర్ సరిపోలేదని, అతను ఎలా ఇలాంటి పాత్రలు చేస్తారని, సెట్ అవ్వలేదని ఇలా రకరకాలుగా విమర్శలు గుప్పించేస్తుంటారు. ఇవన్నీ చూసిన హోంబలే ఫిల్మ్స్ ఈ గొడవలు అన్ని ఎందుకు అనుకున్నదో ఏమో కానీ.. తమ నెక్స్ట్ సినిమాను పూర్తిగా యానిమేషన్ చేసేసింది.
కొత్త సంవత్సరం హోంబలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహా అనే టైటిల్ తో ఒక పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. మహావతార్ సిరీస్ ను మొదలుపెట్టామని, అందులో భాగంగా తాము తెరకెక్కిస్తున్న మొదటి చిత్రం మహావతార్ నరసింహా అని చెప్పుకొచ్చారు. విశ్వాసం సవాలుగా ఉన్నప్పుడు అతను కనిపిస్తాడు అనే క్యాప్షన్ తో ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ తోనే హైప్ క్రియేట్ చేయడంతో ఆ పాత్రలో ఏ హీరో నటిస్తున్నాడు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.
అయితే తాజాగా నేడు ఆ ఎదురుచూపులు ఒక సమాధానం దొరికింది. ఇందులో హీరోలు ఎవరు లేరని, ఇదొక యానిమేషన్ సినిమా అని మేకర్స్ టీజర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక టీజర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ” నీ పుత్రుని వీరమరణం గురించి నువ్వు శోకించడం మాత.. విష్ణువు నీ సామర్థ్యాన్ని ఇలా సవాలు చేస్తున్నాడు.. నువ్వు నీ పుత్రుడిని వదించాలి అనుకుంటే.. వాడు తన భక్తుడుని కాపాడాలి అనుకుంటున్నాడు” అంటూ బేస్ వాయిస్ తో వచ్చే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. నరసింహా స్వామి భక్తుడు భక్త ప్రహ్లాద గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని జీవిత కథనే ఈ సినిమాలో చూపించనున్నట్లు టీజర్ ను బట్టి అర్ధమవుతుంది.
Sobhan Babu: ఓరీ దేవుడా.. కేవలం దాని కోసం ఇన్ని హిట్ సినిమాలు వదులుకున్నాడా.. సోగ్గాడు మామూలోడు కాదు
భక్త ప్రహ్లాద కథ గురించి అందరికీ తెల్సిందే. వైకుంఠము వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు ఒక తప్పు చేసి రాక్షసులుగా మారతారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి శాప విమోచనము కావడానికి రెండు మార్గాలు చెప్తాడు. ఏడు జన్మలు ఆయన భక్తులుగా ఉంటారా లేక మూడు జన్మలు విరోధులుగా ఉంటారా అని అడుగుతాడు.
వారు ఏడ జన్మలు విష్ణువు దూరంగా ఉండలేమని మూడు జన్మలు ఆయన విరోధులుగా పుట్టి ఆయన చేతిలో మరణించి తిరిగి వైకుంఠం చేరేలా శాప విమోచనం పొందుతారు. అలా మొదటి జన్మలో వారే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుడతారు. ఇక ప్రహ్లాదుడు తల్లి కడుపులోనే శ్రీహరి గురించి వాని ఆయనకు భక్తుడుగా మారతాడు. అది తండ్రి హిరణ్యకశిపుడుకు నచ్చదు.
ఎన్నిసార్లు చెప్పినా ప్రహ్లాదుడు తన తీరును మార్చుకోడు. అనేక విధాలుగా చెప్పి చెప్పి విసిగిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని పోయిన వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించిననూ ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. ఇక తన భక్తుడును చంపడానికి వచ్చిన హిరణ్య కశిపుడును నరసింహా స్వామి ఎలా మట్టుపెట్టాడు అనేది అందరికీ తెల్సిందే. ఇప్పుడు ఈ కథతోనే మహావతార్ నరసింహా తెరకెక్కుతుంది.
పూర్తిగా విఎఫ్ఎక్స్ తో తెరకెక్కించిన ఈ టీజర్ అదిరిపోయింది. గత సినిమాల్లోగానే హోంబల్ ఫిల్మ్స్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది. డైలాగ్స్, విజువల్స్ .. థియేటర్ లో చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.