E-Paper
Advertisement

Protein From Hair : జుట్టులోని ప్రొటీన్స్‌తో బ్యాండేజ్‌ తయారీ..

Protein From Hair : జుట్టులోని ప్రొటీన్స్‌తో బ్యాండేజ్‌ తయారీ..
Advertisement

Protein From Hair : మనకు తెలియకపోయినా కూడా మనిషి శరీరంలో ఉండే అవయవాలు కూడా ఒక్కొక్కసారి మెడిసిన్‌గా పనిచేస్తాయి. సెల్స్‌లో ఉండే సామర్థ్యం దగ్గర నుండి జుట్టు వరకు ప్రతీ ఒక్కటి ఏదో ఒక విధంగా మెడికల్ రంగంలో ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా హెయిర్‌తో బ్యాండేజ్‌లు, సన్‌స్క్రీన్స్ లాంటివి తయారు చేయవచ్చని వారు బయటపెట్టారు. ప్రస్తుతం ఈ విషయంలో వారు ప్రయోగాలను వేగవంతం చేశారు.

చాలామందికి వారి జుట్టంటే వారికి ఇష్టం. కొంతమంది అయితే వారి హెయిర్ స్టైల్ వారికి కాన్ఫిడెన్స్‌ను కూడా అందిస్తుందని చెప్తారు. అందుకే హెయిర్‌ను రకరకాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి కలర్స్ వేయడం, రకరకాలుగా హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం.. ఇవన్నీ కొందరిలో కాన్ఫిడెన్స్‌ను నింపుతాయి. అయితే మనిషి జుట్టులో కెరాటీన్, మెలానిన్ అనే రెండు కాంపౌండ్స్ వల్ల పలు ప్రొడక్ట్స్‌ను తయారు చేయవచ్చని, ఇలా చేయడం వల్ల ప్రొడక్ట్స్ తయారీలో కెమికల్స్ అవసరం ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

హెయిర్‌తో ప్రొడక్ట్స్‌ను తయారు చేయాలంటే ముందుగా జుట్టు నుండి కెరాటీన్, మెలానిన్‌ను జాగ్రత్తగా బయటికి తీయాలి. అది కూడా ఏ కెమికల్స్‌ను ఉపయోగించకుండా తీయాల్సి ఉంటుంది. ఈ పరిశోధనలో ఇదే పెద్ద ఛాలెంజ్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. హెయిర్ అనేది ప్రొటీన్ ఫిలమెంట్స్‌తో ఎన్నో లేయర్స్, కాంపౌండ్స్ సమూహంగా ఉంటుంది. జుట్టు స్ట్రక్చర్ అనేది కెరాటీన్ వల్ల వస్తుందని, దాని కలర్ అనేది మెలానీన్ వల్ల వస్తుందని వారు బయటపెట్టారు. దాంతో పాటు మెలానిన్‌లో ఏంటియాక్సిడేటివ్ ప్రాపర్టీలు ఉంటాయని, అవి అల్ట్రావైలెట్ రేస్ నుండి కూడా కాపాడతాయని తెలిపారు.

కెరాటీన్, మెలానిన్‌లో ఉండే లక్షణాల వల్ల అవి బయోమెడికల్ ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఒక మనిషి మరిణించిన తర్వాత జుట్టు అనేది ఉపయోగించకుండా మట్టిలోనే ఉండిపోతుంది కాబట్టి కెరాటీన్, మెలానిన్ అనేవి ఉపయోగం లేకుండా వేస్ట్ అయిపోతున్నాయని అన్నారు. కెమికల్స్ ద్వారా వాటిని బయటికి తీయడం సాధ్యమే అయినా కూడా ఒక్కసారి ఒక కెమికల్‌ను బయటికి తీయడమో లేదా కఠినమైన కెమికల్స్, కష్టమైన ప్రక్రియపైన ఆధారపడడమో లాంటివి చేయాల్సి ఉంటుంది.

Advertisement

జుట్టు నుండి కెరాటీన్, మెలానిన్‌ను బయటికి తీసే ప్రక్రియను కష్టంగా ఉండడంతో తాజాగా పలువురు శాస్త్రవేత్తలు దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టారు. కెమికల్స్ అవసరం లేని ఒక గ్రీన్ సాల్వెంట్‌ను వారు ఈ ప్రక్రియ కోసం తయారు చేశారు. జుట్టును ఈ సాల్వెంట్‌లో కడగడం ద్వారా కెరాటీన్, మెలానిన్ కలిసి ఉంటాయని, అప్పుడు వాటిని ఒకేసారి జుట్టు నుండి వేరు చేయడం సాధ్యమని వారు చేసిన ప్రయోగాల్లో తేలింది. ఇక ఈ ప్రయోగాలు సక్సెస్ అవ్వడంతో త్వరలోనే వీటిని ఉపయోగించి బ్యాండేజ్‌లతో పాటు మరికొన్ని ఇతర ప్రొడక్ట్స్‌ను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Related News

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×