BigTV English

Rafale Jet India: అందుకే రాఫెల్ అంటే వణుకు.. ఆపరేషన్ సిందూర్‌లో దీన్ని ఎలా వాడారంటే?

Rafale Jet India: అందుకే రాఫెల్ అంటే వణుకు.. ఆపరేషన్ సిందూర్‌లో దీన్ని ఎలా వాడారంటే?

Rafale Jet India| పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి సమాధానంగా భారతదేశం.. ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది.మే 7, 2025 అర్ధరాత్రి, తెల్లవారు ఝామున ఆపరేషన్ సిందూర్ మొదటి దశలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.


ఇవి సర్జికల్ స్ట్రైక్స్. అంటే కేవలం ఆ ప్రాంతం వరకే దాడి జరుగుతుంది. చాలా కచ్చితత్వంతో టార్గెట్ పై మాత్రమే మిసైల్స్, బాంబులు కురిపిస్తారు. అందుకే ఆ ఉగ్రవాద స్థావారాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఇతర పౌరులు, లేదా సమీప ప్రాంతాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇంత కచ్చితత్వంతో దాడి చేయడానికి భారత్ హై ఎండ్ టెక్నాలజీ కలిగిన ఆయుధాలను ప్రయోగించింది. ఈ ఆయుధాలను సమర్థవంతంగా ప్రయోగించడానికి రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను భారత సైన్యం రంగంలోకి దింపి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంటే ఈ ఆపరేషన్ సిందూర్ లో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఈ విమానాలు ప్రస్తుతం వైమానిక యుద్ధ రంగంలో చాలా అడ్వాన్స్‌ టెక్నాలజీ కలిగి ఉన్నాయి.

ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన భారత్
రాఫెల్ యుద్ధ విమానాలను భారత దేశం ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఇది ట్విన్ ఇంజిన్ కలిగిన యుద్ధ విమానం. ప్రపంచంలోని అతి ప్రమాదకర ఫైటర్ జెట్స్ లో రాఫెల్ ఒకటి. ప్రస్తుతం ఫ్రాన్స్ వాయు సైన్యం, నేవికి ఈ విమానాలే ఆయువుపట్టు. 2016లో భారత ప్రభుత్వం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ వద్ద నుంచి రూ.59000 కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో ఇప్పటికే 35 విమానాలు ఇండియా సరఫరా చేయబడ్డాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ జెట్స్ కొరత ఉండడంతో అత్యవసరంగా రాఫెల్ యుద్ద విమానాలను భారత్ కొనుగోలు చేసింది.


Also Read: పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్న 7 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు.. ఇక వీరికి మూడినట్లే..

రాఫెల్ జెట్స్ ఇండియా వద్దకు రావడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గేమ్ చేంజర్ గా మారింది.ప్రస్తుతం ఇండియాతో యుద్ధంలో తలపడే చైనా, పాకిస్తాన్ ల వద్ద 42, 27 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్స్ ఉన్నాయి. వారిని ఎదుర్కోవడానికి ఇండియా వద్ద 31 స్క్వాడ్రన్స్ మాత్రమే ఉన్నాయి. స్క్వాడ్రన్స్ అంటే యుద్ధ విమానాల సంఖ్య. అందుకోసమే భారత్ చైనాతో సమానంగా 42 స్క్వాడ్రన్స్ పొందేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ కు సమీపంగా ఉన్న అంబాలా ఎయిర్ స్టేషన్ వద్ద, చైనా సరిహద్దులకు సమీపంగా బెంగాల్ లో హాశిమారా ఎయిర్ బేస్ వద్ద రెండు స్క్వాడ్రన్స్ ని స్టాండ్ బైలో ఉంచింది.

రాఫెల్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకతలు..

  • మల్టీ రోట్ ఫైటర్ జెట్స్ అయిన రాఫెల్ విమానాలు.. 4.5 జెనరేషన్ ట్విన్ ఇంజిన్ (ఎం88 ఇంజిన్లు) ఉంటుంది. దీనివల్ల అత్యధికంగా గంటకు 1912 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణించగలదు.అంటే సౌండ్ స్పీడ్ కంటే రెండు రెట్లు వేగంగా రాఫెల్ దూసుకుపోతుంది. 3700 కిలోమీటర్ల రేంజ్ వరకు 3 డ్రాంప్ ట్యాంక్స్ మోయగలదు.
  • రాఫెల్ పొడవు -15.3 మీటర్ల పొడవు.
  • ఎత్తు – 5.3 మీటర్లు
  • వింగ్ స్పాన్ లెంగ్త – 10.9 మీటర్లు.
  • ల్యాండింగ్ కోసం కూడా దీనికి చాలా తక్కువ గ్రౌండ్ రన్ అవసరమవుతుంది. కేవలం 450 మీటర్ల పొడవు ఉన్న గ్రౌండ్ ఉంటే చాలు. అది కూడా విమానం ఆగడానికి డ్రాగ్ షూట్ కూడా అవసరం లేదు. డ్రాగ్ షూట్ అంటే విమానం భూమిపై దిగే సమయంలో దాని స్పీడ్ ని తగ్గించే పారాషూట్.
  • రాఫెల్ విమానం మొత్తం బరువు 10 టన్నులు. మిసైల్స్ బరువుతో కలిపి టేకాఫ్ సమయంలో 24.5 టన్నుల వరకు ఉంటుంది.
    ఇందులో రెండు ఫ్యూయెలింగ్ కెపాసిటీలో ఉండడం ప్రత్యేకం. ఇంటర్నల్ ఫ్యూయెలింగ్ కెపాసిటీ 4.7 టన్నులు, ఎక్స్ టర్నల్ కెపాసిటీ 6.7 టన్నులు.
  • దీని గ్రావిటేషనల్ పుల్ (గురుత్వాకర్షణ శక్తి) -3.6g నుంచి 9g

రాఫెల్ మిసైల్ కెపాసిటీ
రాఫెల్ విమానంలో చాలా ప్రమాదకర, ముఖ్యమైన మిసైల్స్ మోసే కెపాసిటీ ఉంది. అన్నింటి ముఖ్యమైనవి యూరోపియన్ మిసైల్స్.

  • ఇందులో ముందుగా మిటిఆర్ (Meteor) అడ్వాన్స్‌డ్ మిసైల్స్ ఉన్నాయి. ఇవి ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, డ్రోన్స్, క్రూయిజ్ మిసైల్స్ ని సైతం ఢీకొని వాటిని నాశనం చేయగలవు.
  • రెండవది స్కాల్ప్ లేదా స్టార్మ్ షాడో మిసైల్స్. ఇవి భూమిపై ఉండే టార్గెట్స్ ను ఈజీగా నాశనం చేయగలవు. లేజర్ గైడ్ టెక్నాలజీతో 300 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ ను ఛేదించగలదు.
  • ఇక మూడోది హ్యామర్. ఇది కూడా స్కాల్ప్ లాగే ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్. ఇది కొండ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుది. 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ ను నాశనం చేయగలదు.
  • ఇందులో ట్విన్ గన్ పాడ్, 30ఎంఎం రివాల్వర్ కూడా ఉంది. ఇది ఒక నిమిషంలో 2500 రౌండ్స్ కాల్పులు చేయగలదు.
  • త్వరోలనే న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఇందులో క్యారీ చేయడానికి మార్పులు చేయబడుతున్నాయి.
  • వీటితోపాటు అదనంగా ఇందులో ఇజ్రాయెలి హెల్మెట్ మౌంటెడ్ డిస్‌ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్స్, లో బ్యాండ్ జామర్స్, 10 గంటల ఫ్లైట్ రికార్డిండ్ డేటా. ఇన్‌ఫ్రా రెడ్ సెర్చ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి.
  • అన్నింటి కంటే ముఖ్యంగా ఆకాశంలో ఉన్నప్పుడు విమానంలో ఇంధనం అయిపోతే.. ఇతర విమానం నుంచి గాల్లో ఉండగానే ఇంధనం నింపుకునే వెసలుబాటు ఉంటుంది. దీన్ని బడ్డి రీ ఫ్యూయెలింగ్ అంటారు.
  • ఇక రాడార్ల విషయానికి వస్తే ఇందులో సింథెటిక్ అపార్చర్ రేడార్, ఇన్ వర్స్ ఎస్ఎఆర్ రాడార్లు ఉన్నాయి. ఈ రెండు గ్రౌండ్ మ్యాపింగ్ చేసి టార్గెట్స్ గుర్తించడానికి పైలట్ కు ఉపయోగపడతాయి. ఏదైనా అడవి ప్రాంతంలో పైలట్ కు దాడి కనపడకపోతే ఈ విమానం ఆటో పైలట్ పై చాలా సేఫ్ గా దాడి చూపిస్తూ తక్కువ ఎత్తులో ఎగరగలుగుతుంది.
  • శత్రువు చేతికి చిక్కకుండా ఉండేందుకు ఇందులో ముందుగానే థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది. రాడార్ వార్నింగ్, లేజర్ వార్నింగ్, మిసైల్ వార్నింగ్ రిసీవర్స్ ఉన్నాయి. వీటితోపాటు శత్రువుల రాడార్ జామ్ చేసేందుకు రాడార్ జామర్స్, డికార్ డిస్పెన్సర్ ఉంది. ఇతరులు దీనికి రాడార్ జామ్ చేయకుండా నివారిస్తుంది. ఇందులో 1 ఎంబి డేటా స్పేడుతో ఇంటర్నెట్ సౌలభ్యం ఉంది. టెక్స్ మెసేజెస్, ఇమేజరీ డేటా, డిజిటల్ వాయిస్ ట్రాన్స్‌ఫర్ చేయగలరు.

ఈ సింగిల్ సీటర్ కెపాసిటీ రాఫెల్ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్నో రెట్లు వృద్ధి చేసింది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×